అక్బరుద్దీన్ ఒవైసీ

భారతదేశంలో ఒక రాజకీయనాయకుడు

అక్బరుద్దీన్ ఒవైసీ (జననం 1970 జూన్ 14) హైదరాబాదు-చాంద్రాయణగుట్టకు చెందిన శాసన సభ్యుడు.[1] ఇతను ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీకి చెందిన వాడు. ఆంధ్రప్రదేశ్ విధాన సభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడరు.[1] అక్బరుద్దీన్ ఒవైసీ కుటుంబానికి చెందిన వాడు. ఇతని తండ్రి సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ, అన్న అసదుద్దీన్ ఒవైసీ.[2]

అక్బరుద్దీన్ ఒవైసీ
అక్బరుద్దీన్ ఒవైసీ

అక్బరుద్దీన్ ఒవైసీ - ఫ్లోర్ లీడర్ ఏ.ఐ.ఎం.ఐ.ఎం.


పదవీ కాలం
1999 – 2004
ముందు అమానుల్లా ఖాన్
నియోజకవర్గం చాంద్రాయణగుట్ట హైదరాబాదు
పదవీ కాలం
2004 – 2009
పదవీ కాలం
2009 – 2014
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014

వ్యక్తిగత వివరాలు

జననం (1970-06-14) 1970 జూన్ 14 (వయసు 53)
హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
సంతానం నూరుద్దీన్ ఒవైసీ , ఒక కుమార్తె
పూర్వ విద్యార్థి సెయింట్ మేరీ జూనియర్ కాలేజి
వృత్తి రాజకీయాలు
మతం ఇస్లాం

2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆయనను ప్రభుత్వం ప్రొటెం స్పీకర్‌గా నియమించింది. ఆయన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేయించి కొత్త స్పీకర్ ఎన్నికయ్యేంత వరకూ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాడు.[3][4]

ఒవైసీ వివాస్పాద ప్రసంగాలకు ప్రసిద్ధి.[5] 2007 లో సల్మాన్ రుష్దీ, తస్లీమా నస్రీన్ లకు వ్యతిరేక ఫత్వాను పురస్కరించుకుని వారు హైదరాబాదుకు వస్తే తగిన గుణపాఠం నేర్పుతామని ప్రకటించాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

అక్బరుద్దిన్ 1970 జూన్ 14 లో జన్మించాడు. విద్యాభ్యాసం హైదరాబాదు లోనే జరిగింది. వైద్యశాస్త్రం చదువుతూ మధ్యలోనే, రాజకీయాలలో చేరుటకు, వదిలేశాడు. ఇతడు ఒవైసీ హాస్పిటల్ కు డైరక్టరు కూడా. ఇతను ఒక క్రైస్తవ మతస్తురాలైన స్త్రీని వివాహమాడాడు.

రాజకీయ రంగం మార్చు

1999, 2004, 2009, 2014 సం.లలో వరుసగా నాలుగు సార్లు హైదరాబాదు చాంద్రాయణ గుట్ట నుండి శాసన సభకు పోటీ చేసి గెలిచాడు.[6]2018లో ఎన్నికల్లో గెలిచిన ఆయన 22 సెప్టెంబర్ 2019లో తెలంగాణ శాసనసభలో ప్రజా పద్దులు (పీఏసీ) కమిటీ చైర్మన్‌ గా ఎన్నికయ్యాడు.[7]

ప్రత్యర్ధుల దాడి మార్చు

30 2011 ఏప్రిల్ 1 వ తారీఖున ఎమ్మే ల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ పై ప్రత్యర్గివర్గం దాడికి పాల్ప డింది. ప్రత్యర్థులు ముందుగా కత్తులతో దాడిచేసి తర్వాత కాల్పులు జరిపారు. దీంతో ఎమ్మెల్యేల గన్‌మెన్‌ కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో అక్బరుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా గాయపడ్డాడు. అక్బరుద్దీన్‌ శరీరంలోకి రెండు బులెట్లు దూసుకుపో యాయి. 17 కత్తిపోట్లు ఉన్నాయి.[8]

వివాదాస్పద ప్రసంగాలు మార్చు

24 డిశెంబరు 2012 లో ఆదిలాబాదు జిల్లా లోని నిర్మల్ పట్టణంలో చేసిన ప్రసంగం తీవ్ర వివాదాలకు గురైంది. ఈ ప్రసంగం కారణాన ఇతడిపై కేసు నమోదయింది. హిందువుల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. పోలీసుల వైఖరిని తూర్పారబట్టాడు.

విమర్శ మార్చు

ఎందరో సాహితీకారులు, సామాజిక కార్యకర్తలు ఇతడిని విమర్శించారు. అస్గర్ అలీ ఇంజనీర్, స్వామి అగ్నివేష్, మహేశ్ భట్, హామిద్ ముహమ్మద్ ఖాన్, సందీప్ పాండే, రాం పుణ్యాని మొదలగువారు ఇతడిని విమర్శించిన వారిలో ఉన్నారు.

పాదపీఠికలు మార్చు

  1. 1.0 1.1 "Owaisi's brother shot at, critical; Hyderabad tense". Indian Express. 1 May 2011. Retrieved 3 January 2012.
  2. Eenadu (4 December 2023). "హ్యాట్రిక్‌ వీరులు.. హైదరాబాద్‌లో 10 మంది." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  3. Eenadu (8 December 2023). "శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. V6 Velugu (9 December 2023). "ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ప్రమాణం". Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Owaisi hate speech: This is not the first time". Firstpost. 3 January 2012. Archived from the original on 6 జనవరి 2013. Retrieved 4 January 2013.
  6. "Chandrayangutta Assembly Constituency Details". Archived from the original on 12 సెప్టెంబరు 2013. Retrieved 19 July 2013.
  7. TV9 Telugu, TV9 (22 September 2019). "Telangana PAC Chairmanఅ‍క్బరుద్దీన్‌ ఒవైసీకి కీలక పదవి..కేబినెట్ ర్యాంక్ కూడా! - Akbaruddin Owaisi appointed as PAC chairman". TV9 Telugu. Archived from the original on 7 జూన్ 2021. Retrieved 7 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2013-12-01.