ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. కృష్ణవేణి, భక్త కన్నప్ప వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన గోపీకృష్ణా మూవీస్ (కృష్ణంరాజు సొంత బానరు) తొలిసారిగా రాఘవేంద్రరావు, కృష్ణంరాజు కాంబినేషన్ లో ఈ చిత్రం నిర్మించింది.

అమరదీపం
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
తారాగణం కృష్ణంరాజు,
జయసుధ,
మాగంటి మురళీమోహన్,
కైకాల సత్యనారాయణ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం వి.రామకృష్ణ,
ఎస్.పీ.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల
గీతరచన ఆత్రేయ,
ఆరుద్ర,
వేటూరి సుందరరామ్మూర్తి
నిర్మాణ సంస్థ గోపీకృష్ణా మూవీస్
విడుదల తేదీ సెప్టెంబర్ 29, 1977
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • కృష్ణంరాజు
  • జయసుధ
  • మురళీమోహన్
  • మాధవి
  • ప్రభాకరరెడ్డి
  • జయమాలిని
  • సారథి
  • రమాప్రభ
  • సాక్షి రంగారావు
  • సత్యనారాయణ
  • ఝాన్సీ
  • కె.జె.సారథి
  • మాస్టర్ రాము
  • మాడా
  • విజయలక్ష్మి
  • పొట్టి ప్రసాద్
  • అపర్ణ
  • జయకృష్ణ
  • జూ.కాంచన
  • రాళ్ళబండి కామేశ్వరరావు
  • జి.ఎన్.స్వామి
  • జగ్గారావు
  • వీరభద్రరావు

చిత్రకథ మార్చు

అనాధ ఐన కృష్ణంరాజును దొంగ తనం వృత్తిగా ఉన్న సత్యనారాయణ పెంచుతాడు. పెద్దవాడైన కృష్ణంరాజు ధనికుడౌతాడు. తన దగ్గర పనిచేసే జయసుధను ప్రేమిస్తాడు. ఐతే జయసుధ, మురళీమోహన్ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అంతే కాకుండా దుర్మార్గపు వృత్తిలో ఉన్న కృష్ణంరాజు అంటే జయసుధ ఇష్టపడదు. కోపంతో మురళీమోహన్ ను చంపాలనుకున్న కృష్ణంరాజుకు (చిన్ననాటి ఫొటో ద్వారా) మాగంటి మురళీమోహన్ తన తమ్ముడని కృష్ణంరాజుకు తెలుస్తుంది. వారిద్దరికీ పెళ్ళి జరిపిస్తాడు. కాని జయసుధపై కృష్ణంరాజు యొక్క ఇదివరకటి ప్రేమ గురించి తెలుసుకొన్న మురళీమోహన్ అపార్ధంతో అతనిని ద్వేషిస్తాడు. జయసుధ కూడా అతనిని దూషిస్తుంది. ప్రేమించిన జయసుధ, తన వాళ్ళకోసం కృష్ణంరాజు ఆత్మహత్య చేసుకుని అమరదీపమౌతాడు.

పాటలు మార్చు

చెళ్ళపిళ్ళ సత్యం సంగీత దర్శకత్వంలో రామకృష్ణ, సుశీల, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు చిత్ర విజయానికి తోద్పడ్డాయి.

  • నా జీవన సంధ్యాసమయంలో ఒక దేవత ఉదయించింది గీతరచన: వేటూరి, గానం: వి.రామకృష్ణ, పి.సుశీల
  • ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము గీతరచన: ఆత్రేయ, గానం: వి.రామకృష్ణ
  • ఏ రాగమో ఇది ఏ తాళమో గీతరచన: ఆత్రేయ, గానం: ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
  • కొత్తగా ఉందా గీతరచన: ఆత్రేయ, గానం: పి.సుశీల
  • నీవే తల్లియు తండ్రియు గీతరచన: వేటూరి, గానం: పి.సుశీల
  • అంతలేసి అందాలు దాచుకున్న అమ్మాయి - గీతరచన: ఆరుద్ర,[1] గానం: వి.రామకృష్ణ, రమోల

మూలాలు మార్చు

  1. కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.
"https://te.wikipedia.org/w/index.php?title=అమరదీపం&oldid=4068823" నుండి వెలికితీశారు