ఇవాంజెలిస్టా టొర్రిసెల్లి

టోరసెల్లి ఎన్నో విషయాలను కనుగొన్నప్పటికి ఆయన పేరు వింటే మాత్రం ఎవరికైనా సరె గుర్తుకు వచ్చేది భారమితి ఒక్కటే!

ఇవాంజెలిస్టా టొర్రిసెల్లి
ఇవాంజెలిస్టా టొర్రిసెల్లి
జననం15 October 1608
Faenza, Province of Ravenna,
Papal States
మరణం25 October 1647 (aged 39)
Florence, Grand Duchy of Tuscany
పౌరసత్వంPapal States
జాతిItalian
రంగములుPhysicist,
mathematician
పరిశోధనా సలహాదారుడు(లు)Benedetto Castelli
ప్రసిద్ధిBarometer
Torricelli's Law
ప్రభావితం చేసినవారుGalileo Galilei

టెలిస్కోపిక్ లెన్సు మార్చు

ఇటలీ లోని ప్లోరెన్స్ లో విజ్ఞాన శాస్త్ర చరిత్రను తెలిపే మ్యూజియం ఒకటి ఉంది. అందులో అద్భుతమనిపించే ఎన్నో శాస్త్ర పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాలలో ఒకటి అతి సామాన్యంగా కనిపించే టెలిస్కోపిక్ లెన్సు. నాలుగు అంగుళాల వ్యాసమున్న ఈ కటకం నిర్మాణాన్ని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. అది ఎంత కచ్చితంగా ఉందంటే మిల్లీమీటర్ లో పదివేల వంతు లోపం కూడా రాదు. ఈ అంశం ఎంతో విచిత్రముగా కనిపించవచ్చు. అంతకంటె చిత్రమైన విషయం ఆ కటకం 1646 లో తయారు చేయబడిందనే వాస్తవం! యీ కటకాన్ని తయారు చేసింది ఎవరో కాదు... ఇవాంజెలిస్టా టొరిసెల్లీ. యీ ఒక్క కటకం ఆధారంగా టొరసెల్లి పరికరాల విషయంలో ఎంత కచ్చితముగా ఉంటాడో తెలుసుకోవచ్చు.

భారమితి వెనుక కథ మార్చు

భారమితి సృష్టి కర్త టొర్రిసెల్లి అని ఎంతో మందికి తెలుసు కాని ఈ సృష్టి వెనుక కథ చాలామందికి తెలియదు.

టస్కానీ రాజు తన భవనం పెరటిలో ఒక పెద్ద బావి త్రవ్వించాడు. ఆ బావిలోని నీటి మట్టం నేల నుండి 40 అడుగుల లోపలికి ఉంది. బావిలోని నీటిని పైకి చేదడానికి ఒక చేతి యంత్రాన్ని అమర్చాలు. ఎంత కష్టపడ్డా నీరు 33 అడుగులు దాటి మరిపైకి రావటం లేదు. మొదట్లో చేతి యంత్రంలో లోపం ఉందని అనుకున్నారు. కాని అది సయైందేనని తెలిసి పోయింది. ఈ విషయం గురించి రాజుకు తెలియచేయబడింది. ఈ సమస్య గురించి ప్రఖ్యాత గణిత వేత్త గెలీలియోకు తెలిపారు. అయితే అప్పటికె గెలీలియో వృద్ధుడు. అందుకని ఆ విషయాన్ని టొర్రిసెల్లీని చూడమన్నారు. దాంతో రంగంలోకి దిగాడు టొర్రిసెల్లి.

బరువైన ద్రవం పైకి రావడం తేలికైన ద్రవం పైకి రావడమంత తేలిక కాదని టొర్రిసెల్లికి తెలుసు. అందుకోసమే ఆయన తన ప్రయోగం కోసం పాదరసాన్ని ఎన్నుకున్నాడు. ఈ పాదరసం నీటి కన్నా సుమారుగా పదమూడున్నర రెట్లు ఎక్కువ బరువుగా ఉంటుంది. అంటే 33 అడుగులు ఎత్తుకు నీరు పైకి లేస్తే పాదరసం 2.4 అదుగుల వరకు మాత్రమే లేవగలుగుతుందని టొర్రిసెల్లీ గుర్తించాడు. ప్రయోగం కోసం తొర్రిసెల్లి ఒక గజం పొడవు గల గాజు గొట్టం ఎన్నుకున్నాడు. ఈ గొట్టం ఒక చివర ముసివేశాడు. దానిని పాదరసంతో నింపాడు. ఆ తరువాత ఆ గొట్టాన్ని చేతి బొటన వేలితో మూసి దానిని జాగ్రత్తగా తలకిందులు చేసి పాదరసం నిండుగా ఉన్న గాజు తొట్టెలో ముంచాడు. అలా ముంచిన తరువాత టొర్రిసెల్లి బొటనవేలు జాగ్రత్తగా తీసివేశాడు. ఇలా చేసి నప్పుదు గాజు గొట్టంలోని పాదరసం కొద్దిగా గాజు తొట్టెలోకి చేరుకుని 30 అంగుళాలు వద్ద పాదరసం మట్టం నిలిచి పోయింది. కాగా గాజు గొట్టం పై భాగం ఖాళీగా మిగులుతుంది. యీ ఖాళీ ప్రదేశాన్ని 'టొర్రిసెల్లీ శూన్య ప్రదేశం" అని పిలవడం ఆనవాయితీ అయింది. యీ ప్రయోగ ఫలితంగా టొర్రిసెల్లీ బావిలోని నీరు 33 అడుగుల ఎత్తు కంటే ఎక్కువగా దాటి రావడం కుదరదని తెలుసుకోగలిగాడు. యీ బావి విషయం తేల్చుకోవటానికి చేసిన యీప్రయోగ ఫలితంగానె భారమితిని కూడా యీయన రూపొందించగలిగాడు.

టొర్రిసెల్లి భారమితినికొంత పైకి తీసుకుని వెళ్ళీంప్పుడు పాదరస మట్టం తగ్గుతుంది. దీని ఆధారంగా భూమి ఉపరితలం నుండి పైకి పోయినకొద్దీ వాతావరణ పీడనం తగ్గుతుందని స్పష్టంగా చెప్పడానికి వీలవుతుంది. ఈ ప్రయోగం ఆధారంగా బ్లైస్ పాస్కల్ గాలికి బరువు ఉంది అని చెప్పిన గెలీలియో వాదాన్ని సరియైనదని ఋజువు చేశాడు.

పరిశోధనలు మార్చు

 
1959 Evangelista Torricelli commemorative stamp of the U.S.S.R.

టొర్రిసెల్లి రకరకాల టెలిస్కోప్ లను, మైక్రోస్కోప్ లను రూపొందించాడు. ఈ పరికరాలు ఊహాతీతమైన శాస్త్రీయపు అంచనాలతో ఉండటం ఎవరినైనా కదిలించే విషయం.టొర్రిసెల్లి గణిత శాస్త్రవేత్త కూడా! ఈయన "ఇంటెగ్రల్ క్యాలిక్యులస్"కు ప్రాథమిక సూత్రం నిర్దేశించాడు. 19 యెళ్ళ వయస్సులో రోం యూనివర్సిటీలో ఈయనగూర్చి ఎంతో మంది చెప్పుకునేవారు. గెలీలియో పరిశోధనల మీద యీయన చేసిన వ్యాఖ్యానాలు 1641 లో ప్రచురించబడ్డాయి. విల్లియం హార్వే, గెలీలియో, పాస్కల్, వంటి మహానుభావులకు ఈయన సమకాలీకులు.

అస్తమయం మార్చు

ఎన్నో విషయాలకు కొత్త దారులు చూపించి విజ్ఞాన శాస్త్రాలకు వింత వెలుగులను రప్పించిన టొర్రిసెల్లి అతి చిన్న వయస్సు (39 సం. లకే) లో అనగా 25 అక్టోబరు 1647 లో మరణించాడు.

బయటి లింకులు మార్చు