ఇస్రాఫీల్ (అరబ్బీ: إسرافيل) సూర్ ధరించిన మలక్ . ఇస్లామీయ శాస్త్రాలలో ఒక దేవదూత, ఇతని పేరు ఖురాన్లో ప్రస్తావింపబడలేదు. ముగ్గురు మలాయిక పేర్లు జిబ్రయీల్, మీకాయీల్, ఇజ్రాయీల్ (ఖురాన్ లో ఇతని పేరు 'మలకల్ మౌత్') పేర్లు ప్రస్తాయింపబడినవి.

ఇస్లామీయ సంప్రదాయం మార్చు

 
అల్-ఖాజ్విని చిత్రించిన, సూర్ ధరించిన ఇస్రాఫీల్ (1280)

సూర్ వూదబడును, భూమ్యాకాశాలలో వున్న సర్వమున్నూ నాశనం గావింపబడును, అల్లాహ్ ను మినహాయించి. మరల సూర్ వూదబడును, అపుడు చూడండి అన్నియూ మరలా సృష్టింపబడుదురు. ఖురాన్ (39.68).

ఆదమ్ను సృష్టించుటకు అల్లాహ్ మట్టిని తీసుకురమ్మని తన నలుగురు మలాయికాలను భూమ్మీదకి పంపిస్తాడు, ఆ నలుగురిలో ఇస్రాఫీల్ ఒకరు.

ఇస్రాఫీల్ తన సూర్ బాజావాద్యాన్ని ఎల్లవేళలా తన పెదవులకు ఆన్చి, అల్లాహ్ ఆజ్ఞకొరకు వేచి వుంటాడు. ఖయామత్ ఎపుడు వస్తుందో, దాని కొరకు ఆజ్ఞ (అల్లాహ్ నుండి) ఎప్పుడు వస్తుందో అప్పుడు తన సూర్ ను మొదటిసారి వాయిస్తాడు. అనగా భూమ్యాకాశాలు వినాశమయ్యేలా బ్రహ్మాండమైన మహాశబ్దం ఉదయిస్తుంది. సృష్టి అంతా నాశనం అవుతుంది. తన సూర్ ను రెండవసారి వాయిస్తాడు. చనిపోయినవారందరూ మరలా జీవింపబడుతారు, అంతిమతీర్పుకొరకు తీసుకుపోబడుతారు.

ఇవీ చూడండి మార్చు