గర్భాశయపు లోపలి మ్యూకస్ పొరను ఎండోమెట్రియమ్ (Endometrium) అంటారు. చాలా క్షీరదాలలో ఈ పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్త పొర ఏర్పడుతుంది. దీనినే ఋతుచక్రం అంటారు. ఇవి స్త్రీలు గర్భవతులయ్యే కాలమంతా ఉండి, చివరికి బహిష్టు లాగిపోతాయి. ఈ చక్రం కొన్ని రోజుల నుండి ఆరు నెలల కాలం వరకు ఉండవచ్చును.

ఎండోమెట్రియమ్
Uterus and uterine tubes. (Endometrium labeled at center right.)
లాటిన్ tunica mucosa uteri
గ్రే'స్ subject #268 1262
MeSH Endometrium

నిర్మాణం మార్చు

 
High magnification micrograph of decidualized endometrium due to exogenous progesterone (oral contraceptive pill). H&E stain.

ఎండోమెట్రియమ్ ఒక సన్నని ఉపకళా కణజాలపు పొరతో కప్పబడి ఉంటుంది. దీని క్రింద ఆధార కణజాలం, కొన్ని రక్తనాళాలు ఉంటాయి. ఇది స్త్రీ సెక్స్ హార్మోనుల ప్రభావానికి లోనై ప్రతి ఋతుచక్రంలోను మార్పుచెందుతుంది.[1]

వ్యాధులు మార్చు

వ్యాధి నిర్థారణ మార్చు

అల్ట్రాసౌండ్ పరీక్షతో పునరుత్పత్తి అవయవాల్లోని సమస్యలను కనిపెడతారు. ముఖ్యంగా ఎండోమెట్రియోసిన్ తో సంబంధం ఉన్న సిస్ట్‌లు ఈ పరీక్షలో కనిపిస్తాయి. ఎమ్మారై పరీక్షతో సిస్ట్‌ల పరిమాణం, ప్రదేశాలు తెలుస్తాయి. ల్యాప్రోస్కోపీ ద్వారా గర్భాశయంపైన ఏర్పడుతున్న ఎండోమెట్రియం పొరను పరీక్షిస్తారు.[2]

మూలాలు మార్చు

  1. Blue Histology - Female Reproductive System. School of Anatomy and Human Biology - The University of Western Australia http://www.lab.anhb.uwa.edu.au/mb140/CorePages/FemaleRepro/FemaleRepro.htm Archived 2007-02-21 at the Wayback Machine Accessed 20061228 20:35
  2. "ఎండోమెట్రియోసిస్‌ అంటే?". andhrajyothy. Retrieved 2022-03-09.