కజ్జికాయలు భారతదేశమున లభ్యమయ్యే ఒకరకమైన మిఠాయిలు.

కజ్జికాయ
రుచికరమైన కజ్జికాయలు
రుచికరమైన కజ్జికాయలు
కజ్జికాయలు
మూలము
మూలస్థానంభారతదేశం
ప్రదేశం లేదా రాష్ట్రంఆంధ్రప్రదేశ్
వంటకం వివరాలు
వడ్డించే విధానంDessert
ప్రధానపదార్థాలు కొబ్బరి కోరు, బెల్లం ,గోధుమ పిండి , నీరు , పంచదార
కజ్జికాయ

కావలసిన పదార్థములు మార్చు

  • కొబ్బరి కోరు
  • బెల్లం
  • గోధుమ పిండి
  • నూనె
  • పంచదార

తయారీ విధానము మార్చు

మొదటిది దశ మార్చు

కొబ్బరిని కోరి దానికి బెల్లపుపాకమును చేర్చిన మిశ్రమమును ఉండలుగాచేసి ఉంచుతారు. తరువాత గోధుమ పిండిని మెత్తగా నీళ్ళతో కలపి బాగుగా పిసికి చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని గుండ్రముగా ఉత్తరాదిన చేయబడే పరోటా మాదిరిగా చేస్తారు. గుండ్రముగా ఉండే దాని మధ్య ముందుగా సిద్దము చేసుకొన్న కొబ్బరి కోరు ఉంచి ఉంచి రెండు వైపులా సగానికి మడిచి కొబ్బరికోరు బయటకు రాకుండా అంచులను దగ్గరగా మూసివేస్తారు. అలా చేయబడ్డ అర్ధ చంద్రాకారపు కజ్జికాయలను బాగా మరిగే నూనెలో మంచి బంగారపు రంగు వచ్చేవరకూ వేయిస్తారు. ఇవి పొడిగా ఉండి తినేందుకు అనువుగా ఉంటాయి.

రెండవ దశ మార్చు

ఇదికూడా కొంతవరకూ పైమాదిరిగానే చేసి ఆఖరులో మాత్రం పంచదార పల్చని పాకంగా మార్చి వీటిని అందులో వేస్తారు. పాకం కారుతూ మెరుస్తూ ఉండే వెటిని తినేందుకు పాత్ర తప్పనిసరి.

అధికంగా వినియోగించు ప్రదేశాలు మార్చు

  • ఇది కోస్తా ఆంధ్రప్రాంతములో విస్తారముగా లభ్యమగును. ప్రస్తుతం ప్రతి మిఠాయి దుకాణంలోనూ దొరకుతున్నవి.

రకాలు మార్చు

  • కోవా కజ్జికాయలు
  • గోధుమ రవ్వ కజ్జికాయ (కుస్లీ)
  • డ్రైఫ్రూట్‌ కజ్జికాయలు[1]

మూలాలు మార్చు

  1. "పిండి వంటలు". Archived from the original on 2016-06-18. Retrieved 2016-06-19.

ఇతర లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కజ్జికాయ&oldid=2984012" నుండి వెలికితీశారు