గియాకోమో కాసనోవా

ఇటలీ దేశానికి చెందిన సాహసికుడు, రచయిత

గియాకోమో కాసనోవా (1725, ఏప్రిల్ 2 - 1798, జూన్ 4) ఇటలీ దేశానికి చెందిన సాహసికుడు, రచయిత.[1][2] ఇతని ఆత్మకథ - "స్టోరీ అఫ్ మై లైఫ్"; 18వ శతాబ్దపు కాలంలో యూరోపియన్ ఆచార వ్యవహారాల గురించిన ప్రామాణికమైన సమాచారాన్ని అందించే వనరుగా పరిగణించబడుతుంది.[3][4]

గియాకోమో కాసనోవా
జననం(1725-04-02)1725 ఏప్రిల్ 2
మరణం1798 జూన్ 4(1798-06-04) (వయసు 73)
తల్లిదండ్రులుగేటానో కాసనోవా - జనెట్టా ఫారుస్సీ

న్యాయవాది, మతాధికారి, సైనిక అధికారి, వయోలిన్, కాన్ మ్యాన్, పింప్, గౌర్మాండ్, నర్తకి, వ్యాపారవేత్త, దౌత్యవేత్త, గూఢచారి, రాజకీయవేత్త, వైద్యుడు, గణిత శాస్త్రజ్ఞుడు, సామాజిక తత్వవేత్త, క్యాబలిస్ట్, నాటక రచయిత గా వివిధ రంగాలలో కృషిచేశాడు. నాటకాలు, వ్యాసాలు, అనేక లేఖలతోపాటు ఇరవైకి పైగా రచనలు చేసాడు. ఐకోసమెరాన్ సైన్స్ ఫిక్షన్ నవల ఇతడి మొదటి రచన.[5]

జననం మార్చు

గియాకోమో గిరోలామో కాసనోవా 1725, ఏప్రిల్ 2న ఇటలీలోని వెనిస్ నగరంలో జన్మించాడు. ఇతని తండ్రి గేటానో కాసనోవా ఒక నటుడు, తల్లి జనెట్టా ఫారుస్సీ. ఆరుగురు సంతానంలో గియాకోమో మొదటివాడు, ఫ్రాన్సిస్కో గిసెప్పే (1727–1803), గియోవన్నీ బాటిస్టా (1730–1795), ఫౌస్టినా మద్దలేనా (1731–1736), మద్దలేనా ఆంటోనియా స్టెల్లా (1732–1800), గైటానో అల్విసే (1734–1783) కాసనోవా దంపతుల ఇతర సంతానం.

రచనలు మార్చు

  • 1752 - జొరాస్ట్రో: ట్రాజెడియా ట్రాడోట్టా డాల్ ఫ్రాన్సిస్, డా రాప్‌ప్రెసెంటార్సీ నెల్ రెజియో ఎలెటోరల్ టీట్రో డి డ్రెస్డా, డల్లా కాంపాగ్నియా డి' కామిసి ఇటాలియన్ ఇన్ అట్యులే సర్విజియో డి సువా మేస్టా నెల్ కార్నెవాలే డెల్'అన్నో
  • 1753 - లా మొలుచెయిడ్, ఓ సియా ఐ గెమెల్లి రివాలి
  • 1769 – కన్ఫ్యూటాజియోన్ డెల్లా స్టోరియా డెల్ గవర్నో వెనెటో డి'అమెలోట్ డి లా హౌసేయ్
  • 1772 - లానా కాప్రినా: ఎపిస్టోలా డి అన్ లికంట్రోపో
  • 1774 - ఇస్టోరియా డెల్లె టర్బోలెంజ్ డెల్లా పోలోనియా
  • 1775–78 – డెల్ ఇలియాడే డి ఒమెరో ట్రాడోట్టా ఇన్ ఒట్టావ రిమా
  • 1779 – స్క్రూటినియో డెల్ లిబ్రో ఎలోజెస్ డి ఎమ్. డి వోల్టైర్ పార్ డిఫరెంట్స్ ఆట్యూర్స్
  • 1780 – ఒపుస్కోలి మిసెల్లానీ
  • 1780–81 – లే మెసేజర్ డి థాలీ
  • 1782 - డి అనెడ్డోటి వినిజియాని మిలిటరీ ఎడ్ అమోరోసి డెల్ సెకోలో డెసిమోక్వార్టో సోట్టో ఐ డోగాడి డి జియోవన్నీ గ్రేడెనిగో ఇ డి జియోవన్నీ డాల్ఫిన్
  • 1783 - నే అమోరి నే డోన్నే, ఒవ్వెరో లా స్టాల్లా రిపులిటా
  • 1786 – సోలిలోక్ డి అన్ పెన్సర్
  • 1787 – ఐకోసమెరాన్
  • 1788 – హిస్టోయిరే డి మా ఫ్యూట్ డెస్ జైళ్లు డి లా రిపబ్లిక్ డి వెనిస్ క్యూ ఆన్ అపెల్లె లెస్ ప్లంబ్స్
  • 1790 – సొల్యూషన్ డు ప్రాబ్లెమ్ డెలియాక్
  • 1790 – కరోల్లయిర్ ఎ లా డూప్లికేషన్ డి ఎల్ హెక్సాడ్రే
  • 1790 – ప్రదర్శన జియోమెట్రిక్ డి లా డూప్లికేషన్ డు క్యూబ్
  • 1797 – ఎ లియోనార్డ్ స్నెట్‌లేజ్, డాక్టర్ ఎన్ డ్రోయిట్ డి ఎల్ యూనివర్సిటీ డి గోటింగు, జాక్వెస్ కాసనోవా, డాక్టీర్ ఎన్ డ్రాయిట్ డి ఎల్ యూనివర్సిటీ డి పాడౌ . డ్రెస్డెన్.
  • 1822-29 - హిస్టోయిర్ డి మా వీ మొదటి ఎడిషన్, 12 సంపుటాలలో స్వీకరించబడిన జర్మన్ అనువాదంలో, ఆస్ డెన్ మెమోరెన్ డెస్ వెనిటియనర్స్ జాకబ్ కాసనోవా డి సీన్‌గాల్ట్, ఓడర్ సెయిన్ లెబెన్, వై ఎర్ ఎస్ జు డక్స్ ఇన్ బోహ్‌మెన్ నీడర్‌స్చిరీబ్

మరణం మార్చు

కాసనోవా 1798, జూన్ 4న తన 73 సంవత్సరాల వయస్సులో మరణించాడు. "నేను తత్వవేత్తగా జీవించాను, నేను క్రైస్తవుడిగా చనిపోతాను" అనేవి అతని చివరి మాటలు.[6] కాసనోవా డక్స్ (ప్రస్తుతం చెక్ రిపబ్లిక్‌లోని డచ్‌కోవ్)లో ఖననం చేయబడ్డాడు.

మూలాలు మార్చు

  1. "Giacomo Casanova | Italian adventurer". Encyclopædia Britannica.
  2. "CASANOVA, Giacomo in "Dizionario Biografico"".
  3. Zweig, Paul (1974). The Adventurer. New York: Basic Books. p. 137. ISBN 978-0-465-00088-3.
  4. History of My Life. Everyman's Library. 2006. ISBN 0-307-26557-9.
  5. Casanova (2006), page xix.
  6. Masters 1969, p. 284.