ఉస్తాద్ గులాం అలి హిందీ: ग़ुलाम अली (డిసెంబరు 5, 1940) పాకిస్థాన్కు చెందిన ప్రముఖ గజల్ గాయకుడు. ఈయన భారతీయ గాయకుడు "బడే గులాం అలిఖాన్" (గులాం అలి శిష్యుడు) గానీ లేదా చోటే గులాం అలి (ఖ్యాల్ బచోన్ ఘరానా లోని పాకిస్థానీ గాయకుడు) గానీ కాదు.

గులాం అలి
చెన్నై లో గులాం అలి
వ్యక్తిగత సమాచారం
జననం (1940-12-05) 1940 డిసెంబరు 5 (వయసు 83)
కాలెకి, సియాల్‌కోట్ జిల్లా
బ్రిటిష్ ఇండియా(ప్రస్తుతం పాకిస్థాన్)
సంగీత శైలిగజల్
వృత్తిగాయకుడు
వాయిద్యాలుహార్మోనియం
క్రియాశీల కాలం1960 నుండి ప్రస్తుతం వరకు

ఈ కాలంలో ప్రముఖ గజల్ గాయకులలో ఈయన ఒకరు. ఆయన గజల్ తో హిందూస్థానీ క్లాసికల్ సంగీతమును కలిపి పాడే శైలిలో మార్పులు ఒకే విధంగా ఉంటాయని గుర్తించారు. ఆయన పాకిస్థాన్, భారతదేశం, బంగ్లాదేశ్, యు.ఎస్.ఎ దక్షిణ ప్రాంతం, యునైటెడ్ కింగ్‌డం, మధ్య తూర్పు దేశాలలో ప్రసిద్ధ గాయకుడు. 1982 లో నికాహ్ చిత్రానికి గానూ ఇతను ఆలపించిన చుప్కే చుప్కే రాత్ దిన్ అనే గజల్ సంగీతప్రియుల హృదయాలను దోచుకున్నది.

వార్తలలో గులాం అలి మార్చు

భారత్ లో ఇక సంగీతప్రదర్శన చేయను మార్చు

2015 నవంబరు డిసెంబరు నెలలో ఇతడు భారతదేశంలో సంగీత ప్రదర్శనలు చేయవలసి ఉంది. కానీ ఇతని పర్యటను మనదేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం ఇతడిని బాధించింది. భవిష్యత్తులో భారత్ లో ఎలాంటి సంగీత కచేరి కార్యక్రమాలను నిర్వహించబోనని ఇతడు స్పష్టం చేశాడు. భారత రాజకీయాలు తనను తీవ్రంగా బాధించాయని చెప్పాడు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తాను ఇక కచేరి కార్యక్రమాలను భారత్ లో ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించనని చెప్పాడు. 2015లో ఆయన లక్నో, ఢిల్లీలో నవంబరు 25న ఒకటి, డిసెంబరు 3న మరొకటి సంగీత కచేరి నిర్వహించాల్సి ఉంది. అయితే, వాటిని ఇప్పటికే రద్దు చేసుకున్నట్లు తెలిపాడు.తాను నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకోవడం ద్వారా భారత్ లో కొన్ని పార్టీలు లబ్ధిపొందాలని ప్రయత్నించే తీరు తనను ఇబ్బంది పెట్టిందని అందుకే తాను ఈ నిర్ణయానికి వచ్చానని చెప్పాడు[1].

మూలాలు మార్చు

  1. "హర్ట్ అయ్యాను.. ఇక భారత్ లో నో." సాక్షి (దినపత్రిక). 2015-11-04. Retrieved 2015-11-04.

ఇతర లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=గులాం_అలి&oldid=3948273" నుండి వెలికితీశారు