గ్రీన్‌విచ్ ఆగ్నేయ లండన్ లోని ఉన్న ప్రాంతం. చేరింగ్ క్రాస్ నుండి 5.5 కి.మీ. దూరంలో ఉంది. గ్రీన్‌విచ్ రేఖ భూమి మీద ప్రపంచమంతటికీ సమయాన్ని నిర్ధారిస్తుంది. ఇది ఇంగ్లాండులో ఒక జిల్లా కేంద్రం. ఇది థేమ్స్ నది ఒడ్డున ఉంది. 0 డిగ్రీ రేఖాంశం ఈ గ్రీన్‌విచ్‌ గుండా పోతుంది. అంచేత దీన్ని గ్రీన్‌విచ్ రేఖాంశం అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌విచ్ మెరిడియన్‌కు, గ్రీన్‌విచ్ మీన్ టైమ్ కూ ప్రసిద్ధి చెందింది.

గ్రీన్‌విచ్

గ్రీన్‌విచ్ మీన్ టైమ్ మార్చు

గ్రీన్‌విచ్ పార్క్ నుండి ఒక దృశ్యం. క్వీన్ హౌస్, నేషనల్ మారిటైమ్ మ్యూజియం ముందుభాగంలో చూడవచ్చు.

.

 
రాయల్ అబ్సర్వేటరీ ఆక్టగన్ గదిపై ఉన్న టైం బాల్

గ్రీన్‌విచ్ లోని రాయల్ అబ్సర్వేటరీ వద్ద ఉన్న మీన్ సోలార్ టైమును గ్రీన్‌విచ్ మీన్ టైం (జిఎమ్‌టి) గా వ్యవహరిస్తారు. ప్రపంచం లోని ఇతర ప్రాంతాల్లో వాటి రేఖాంశాలను బట్టి జిఎమ్‌టి కంటే ముందు, జిఎమ్‌టికి వెనుక అని వ్యవహరిస్తారు. ఏస్టరాయిడ్ 2830 కు గ్రీన్‌విచ్ అని పేరు పెట్టారు.[1]

ప్రపంచ వారసత్వ ప్రదేశం మార్చు

మారిటైం గ్రీన్‌విచ్
ప్రపంచ వారసత్వ ప్రదేశం
 
థేమ్స్ నది ఒడ్డున ఉన్న పాత రాయల్‌ నావల్ కాలేజి, యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్‌విచ్ భవనాలు
స్థానంయునైటెడ్ కింగ్‌డమ్
CriteriaCultural: i, ii, iv, vi
సూచనలు795
శాసనం1997 (21st సెషన్ )
విస్తరణ2008
ప్రాంతం109.5 hectares (271 acres)
Buffer zone174.85 hectares (432.1 acres)
భౌగోళిక నిర్దేశకాలు 51°29′1″N 0°0′21″W / 51.48361°N 0.00583°W / 51.48361; -0.00583

1997 లో మారిటైం గ్రీన్‌విచ్‌ను ప్రపంచ్ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ఇక్కడున్న చారిత్రిక ప్రసిద్ధి గల, వాస్తుశిల్ప కళకు ఉన్న ప్రశస్తి కలిగిన భవనాలకు గాను ఈ గుర్తింపు లభించింది.

మూలాలు మార్చు

  1. Dictionary of Minor Planet Names Lutz D. Schmadel (Springer 2003) ISBN 3-540-00238-3

వెలుపలి లంకెలు మార్చు