రెండు అమావాస్యల మధ్య వ్యవధిని గాని రెండు పున్నమిల మధ్య వ్యవధిని గాని చంద్ర మాసముగా వ్యవహరిస్తారు.

భూమి చుట్టూ చంద్రుడు తిరిగే కక్ష్య, ఒకసారి తిరిగితే అది చాంద్రమాసం

వివరణ మార్చు

సూర్యుని చుట్టూ భూమి ఒకసారి పరిభ్రమణం చేసిన కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. కాని ఈ భ్రమణం వల్ల నెలలు ఏర్పడవు. నెలలను కొలవడానికి చంద్ర బ్రమణమే ఆధారం. భూమి చుట్టూ చంద్రుని పరిభ్రమణ కాలాన్ని నెల అంటారు. దాన్నే చాంద్ర మాసమని అంటారు. ఈ విధంగా ఏర్పడిన 12 చంద్రమాసాలు ఒక సంవత్సర కాలానికి సమానం కాదు. సూర్యుడు మేషం, వృషభం, వంటి 12 రాశులలో ఒక్కో రాశిలో ఒక్క నెల సంచరించడాన్ని సౌర మాసం అని అంటారు. సూర్యుడు ఒక రాసి నుండి మరో రాసిలోనికి ప్రవేశించ డాన్ని రాశి సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం ప్రతి నెలలోనూ జరుగుతుంది. కానీ మనం మఖర రాశి సంక్రమణాన్ని మాత్రమే మఖర సంక్రాంతిగా గుర్తిస్తున్నాము. ఒక్కో రాశిలో ఒక నెలపాటు తిరగాల్సిన సూర్యుడు, రెండు నెలల పాటు ఒకే రాశిలో వుండటం వల్ల ఏర్పడేదె అధిక మాసం. అధిక మాసము చంద్ర మానము ద్వారానే వస్తుంది.

మూలాలు మార్చు