చర్వణకాలు (Molar teeth) క్షీరదాల విషమ దంత విన్యాసంలో ఒక విధమైన దంతాలు. ఇవి మనం ఆహారం తినేటప్పుడు నమిలే దంతాలు. దంతాలు శరీరంలోని బలమైన భాగాలలో ఒకటి. అవి కొల్లాజెన్ వంటి ప్రోటీన్లు, కాల్షియం వంటి నుండి తయారవుతాయి.

చర్వణకాలు
క్రింది దవడలోని జ్ఞాన దంతం తొలగించిన తర్వాత.
శాశ్వత దంతాలు, కుడి వైపు క్రింది దవడలోనివి.
లాటిన్ dentes molares
గ్రే'స్ subject #242 1118
ధమని posterior superior alveolar artery
Dorlands/Elsevier d_08/12285848

చరిత్ర మార్చు

దంతములు మనము తీసుకునే ఆహార పదార్థాలను కూడా నమలడం, జీర్ణం కావడమే స్పష్టంగా మాట్లాడటానికి కూడా మనుషులకు సహాయపడతాయి. దంతాలలో రెండు రకాలుగా విభజిస్తారు .. మొదటిదాన్ని ప్రాధమికంగా పిలుస్తారు . చిన్న పిల్లలలో ఎనిమిది నెలల నుంచి ప్రారంభించి దంతాలు 2 సంవత్సరాల వయస్సులో పెరుగుతాయి, వీటిని పాల పళ్ళు అంటారు, ఇవి 20 వరకు రావచ్చును . రెండవ వాటిని శాశ్వత దంతాలు అంటారు. పాల పళ్ళు ఊడిపోయి తిరిగి ఇవి 6-12 సంవత్సరాల మధ్య పెరిగే దంతాలు, ఇవి 32 శాశ్వత దంతాలతో ఉంటాయి , ఇవి పై దవడ లో 16 పళ్ళు , క్రింది దవడ లో 16 పళ్ళు ఉంటాయి . ఇందులో నాలుగు జ్ఞానం దంతాలు ఉన్నాయి. చాలా పెద్దల దంతాలు 12 ఏళ్ళ వయసులో వస్తాయి. వివేకం దంతాలు 17, 25 సంవత్సరాల మధ్య పెరుగుతాయి. జ్ఞాన దంతములు పెద్దవైన బలమైన పళ్ళు. ఇవి పైన ఆరు, క్రింద ఆరు ఉంటాయి. వీటిలో ప్రధానమైన ఎనిమిది పళ్ళు 6 సంవత్సరాల , 12 సంవత్సరాల గా విభజించబడతాయి, ఎప్పుడు పెరుగుతాయి అనే దాని ఆధారంగా చెప్పవచ్చును . ఈ దంతములలో నాలుగు జ్ఞాన దంతములు ఉంటాయి. ఇవి సాధారణముగా 17-25 సంవత్సరాల మధ్య వస్తాయి. చాల మందికి ఈ జ్ఞాన దంతములు చిగుళ్ళ క్రింద చిక్కుకుంటాయి , దంత వైద్యులు చూసి వీటిని శస్త్ర చికిత్స తో మనిషి నుంచి తీసివేస్తారు.[1][2]

జ్ఞాన దంతములు సగం వరకు మాత్రమే వస్తాయి, లేదా తప్పు స్థితిలో రావడం జరుగుతుంది . జ్ఞాన దంతములు వచ్చే ముందు చిగుళ్లకు నొప్పి రావడం జరుగుతుంది . మనుషులకు పళ్ళ నొప్పి ,ఇన్ఫెక్షన్ ఉంటే దంతవైద్యుడు జ్ఞానం దంతాలను తొలగించాల్సి ఉంటుంది. నమలడానికి ప్రజలకు జ్ఞాన దంతాలు అవసరం లేదు, నోటిలో ఉన్న పళ్లలో ఇవి వెనుకగా ఉన్నందున అవి శుభ్రంగా ఉంచడం కష్టం [3]

మనలో చాలా మంది మన దంతాలను పెద్దగా పట్టించుకోరు. మన దంతాలు ఆహారాన్ని నమలడానికి,జీర్ణించుకోవడంలో సహాయపడటమే కాదు, మొత్తంగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రజలు దంత ఆరోగ్య పరిజ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా, దంతాల పరిశుభ్రత కు అత్యంత ప్రాముఖ్యం ఇవ్వడం తో శరీరము మొత్తం సంరక్షణ లో ఉంటుందని చెప్పవచ్చును [4]

మూలాలు మార్చు

  1. "Teeth Names: Shape and Function of Four Types of Teeth". Healthline (in ఇంగ్లీష్). 2018-05-10. Retrieved 2020-12-01.
  2. "Types of Human Teeth: Structure, Function, Numbers, Sets". MedicineNet (in ఇంగ్లీష్). Retrieved 2020-12-01.
  3. "Teeth names: Diagram, types, and functions". www.medicalnewstoday.com (in ఇంగ్లీష్). 2019-10-23. Retrieved 2020-12-01.
  4. "The 4 Types of Teeth and How They Function | Everyday Health". EverydayHealth.com (in ఇంగ్లీష్). Retrieved 2020-12-01.
  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.