చార్లెస్ బాన్నర్‌మన్

చార్లెస్ బాన్నర్‌మన్ (జూలై 3, 1851 - ఆగష్టు 20, 1930) (Charles Bannerman) ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. కుడిచేతి బ్యాట్స్‌మెన్.

చార్లెస్ బాన్నర్‌మన్

జననం మార్చు

1851, జూలై 3 న జన్మించిన చార్లెస్ బాన్నర్‌మన్ (Charles Bannerman) ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. కుడిచేతి బ్యాట్స్‌మెన్ అయిన బాన్నర్‌మన్ దేశవాళి క్రికెట్‌లో న్యూ సౌత్‌వేల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లాండులో జన్మించిన బాన్నర్‌మన్ కుటుంబం న్యూసౌత్‌వేల్స్ కు వలస పోవడంతో సిడ్నీ క్రికెట్ క్లబ్‌లో చేరి అక్కడే ప్రొఫెషనల్; క్రీడాకారుడిగా మారినాడు.[1]

తొలి టెస్టులో తొలి బంతిని ఎదుర్కొన్న ఘనత మార్చు

టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి బంతిని ఎదుర్కొన్న ఘనత పొందినది చార్లెస్ బాన్నర్‌మెన్. 1877 మార్చిలో మెల్బోర్న్లో జరిగిన టెస్ట్‌లో ఇంగ్లాండుకు చెందిన ఆల్ఫ్రెడ్ షా (ఇతడు టెస్ట్ క్రికెట్‌లో బంతిని బౌలింగ్ చేసిన తొలి బౌలర్) వేసిన బంతిని ఎదుర్కొని ఆ ఘనతను పొందినాడు. అంతేకాదు ఆ టెస్ట్ క్రికెట్‌లో శతకాన్ని పూర్తిచేసిన తొలి బ్యాట్స్‌మెన్ కూడా ఇతడే. 165 పరుగులు చేసి గాయం వల్ల రిటర్డ్‌హర్ట్ అయ్యాడు. ఆ ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా సాధించిన 245 పరుగులలో ఇతని వాటా 67.35%. పూర్తి అయిన ఒక ఇన్నింగ్సులో ఒకే బ్యాట్స్‌మెన్‌కు సంబంధించి ఇంతవాటా ఉండటం కూడా ఆస్ట్రేలియాకు సంబంధించి ఇది రికార్డు. మొత్తం 3 టెస్టులు ఆడిన బాన్నర్‌మన్ 59.75 సగటుతో 239 పరుగులు సాధించాడు.

అంపైరింగ్ విధులు మార్చు

1887 నుంచి 1892 వరకు బాన్నర్‌మన్ 12 టెస్టులకు అంపైరింగ్ విధులను నిర్వహించాడు.

మరణం మార్చు

79 సంవత్సరాల వయస్సులో 1930, ఆగష్టు 20 న మరణించాడు.

మూలాలు మార్చు

  1. http://www.adb.online.anu.edu.au/biogs/A030086b.htm |title=Bannerman, Charles (1851 - 1930)|accessdate=2008-02-02 |author=M. Z. Forbes |work=Australian Dictionary of Biography, Volume 3 |publisher=MUP |year=1969 |pages=pp 86-87