జటాయువు రామాయణంలో అరణ్యకాండలో వచ్చే ఒక పాత్ర (గ్రద్ద). ఇతను శ్యేని, అనూరుల కొడుకు. సంపాతి ఈతని సోదరుడు. దశరథుడు ఇతడి స్నేహితుడు. రావణుడు సీతని ఎత్తుకుని వెళ్తున్నపుడు జటాయువు అతనితో వీరోచితంగా పోరాడి రెక్కలు పోగొట్టుకుంటాడు, ఓడిపోతాడు. చివరకు రాముడికి సీతాపహరణ వృత్తాంతం చెప్పి ప్రాణాలు విడుస్తాడు. జటాయువు త్యాగానికి చలించిన శ్రీరాముడు స్వయంగా రాముడే జటాయువుకి దహన సంస్కారాలు చేస్తాడు .

రావణాసుsరుడు జఠాయువు రెక్కలు నరికి వేయుట (రవివర్మ చిత్రం)

జటాయువుతో సంబంధమున్న ప్రాంతాలు మార్చు

పురాణం ప్రకారం జటాయువు తన రెక్కలు తెగిన తర్వాత కేరళ లోని కొల్లాం జిల్లాకు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాడాయమంగళం అన్ని ప్రదేశంలో రాళ్ళపైన పడింది. ఇంతకు మునుపు ఈ ప్రదేశాన్ని జటాయుమంగళం అని పిలిచేవారు. ఇక్కడే కేరళ ప్రభుత్వం ఒక థీమ్ పార్కును నిర్మిస్తుంది. ఖమ్మం జిల్లా భద్రాచల సమీపంలోని ఏటపాక గ్రామంలో జటాయువు మందిరం ఉంది.[1] ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనంతపురం జిల్లాలోని లేపాక్షి లో జటాయువు అంత్యక్రియలు రాముడు పూర్తి చేశాడని స్థలపురాణం

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-21. Retrieved 2014-07-15.
"https://te.wikipedia.org/w/index.php?title=జటాయువు&oldid=3886765" నుండి వెలికితీశారు