డేనియెల్ వెట్టోరీ

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, కోచ్
(డానియెల్ వెట్టోరీ నుండి దారిమార్పు చెందింది)

డేనియల్ లూకా వెట్టోరి (జననం 1979, జనవరి 27) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, కోచ్, న్యూజీలాండ్ జాతీయ క్రికెట్ జట్టు తరపున ఆడాడు. న్యూజీలాండ్ తరఫున టెస్ట్ క్రికెట్ క్యాప్ గెలిచిన 200వ ఆటగాడు.

డేనియల్ వెట్టోరి
వెట్టోరి (2011)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డేనియల్ లూకా వెట్టోరి
పుట్టిన తేదీ (1979-01-27) 1979 జనవరి 27 (వయసు 45)
ఆక్లాండ్, న్యూజీలాండ్
మారుపేరుమార్తా, హ్యారీ పాటర్[1]
ఎత్తు6 ft 3 in (1.91 m)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 200)1997 6 February - England తో
చివరి టెస్టు2014 26 November - Pakistan తో
తొలి వన్‌డే (క్యాప్ 101)1997 25 March - Sri Lanka తో
చివరి వన్‌డే2015 29 March - Australia తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.11
తొలి T20I (క్యాప్ 25)2007 12 September - Kenya తో
చివరి T20I2014 5 December - Pakistan తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1996/97–2014/15Northern Districts
2003Nottinghamshire
2006Warwickshire
2008–2010Delhi Daredevils
2009/10Queensland
2011–2012Royal Challengers Bangalore
2011/12–2014/15Brisbane Heat
2014–2015Jamaica Tallawahs
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 113 295 174 365
చేసిన పరుగులు 4,531 2,253 6,695 3,549
బ్యాటింగు సగటు 30.00 17.33 29.62 20.16
100లు/50లు 6/23 0/4 9/34 2/10
అత్యుత్తమ స్కోరు 140 83 140 138
వేసిన బంతులు 28,814 14,060 41,258 17,628
వికెట్లు 362 305 565 387
బౌలింగు సగటు 34.36 31.71 31.82 30.98
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 20 2 33 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 3 0 3 0
అత్యుత్తమ బౌలింగు 7/87 5/7 7/87 5/7
క్యాచ్‌లు/స్టంపింగులు 58/– 88/– 98/– 121/–
మూలం: ESPNcricinfo, 2016 13 February

క్రికెట్ రంగం మార్చు

1997 ఫిబ్రవరిలో 18 సంవత్సరాల వయస్సులో టెస్టు క్రికెట్‌లో న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. 2007 - 2011 మధ్యకాలంలో న్యూజీలాండ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. 112 టెస్ట్ క్యాప్‌లు, 291 వన్డే క్యాప్‌లతో న్యూజీలాండ్‌లో అత్యధికంగా ఆడిన టెస్ట్ క్రికెటర్, వన్ డే ఇంటర్నేషనల్ క్రికెటర్ గా నిలిచాడు. బౌలింగ్ ఆల్ రౌండర్ గా టెస్ట్ క్రికెట్ చరిత్రలో 300 వికెట్లు తీయడంతోపాటు 3,000 పరుగులు చేసిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు.

స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. వెట్టోరి 2015 క్రికెట్ ప్రపంచ కప్ తర్వాత క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.[2]

కెప్టెన్సీ మార్చు

2007లో కెప్టెన్‌గా మారడానికి ముందు, వన్డే క్రికెట్‌లో న్యూజీలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రారంభ ట్వంటీ20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో న్యూజీలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.[3] ఆ తర్వాత అన్ని ఫార్మాట్‌లలో జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.[4]

2011 ప్రపంచ కప్ తర్వాత వన్డే ఇంటర్నేషనల్, ట్వంటీ 20 ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 క్రికెట్ ప్రపంచ కప్ కోసం వన్డే జట్టులోకి తిరిగి పిలిపించబడ్డాడు.[5] ఆ సమయానికి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. 2014 నవంబరులో పాకిస్తాన్‌తో చివరి టెస్ట్ మ్యాచ్ జరిగింది.

కోచింగ్ కెరీర్ మార్చు

2014 నుండి 2018 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. 2019 జూలైలో, యూరో టీ20 స్లామ్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి సీజన్‌లో డబ్లిన్ చీఫ్స్‌కు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యాడు.[6] తర్వాత టోర్నమెంట్ రద్దు చేయబడింది. అదే నెలలో, బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్ అయ్యాడు.[7] 2021 ఆగస్టులో కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ బార్బడోస్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యాడు.[8] వెట్టోరి ఆస్ట్రేలియాకు సహాయకుడిగా, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.[9]

2023 ఆగస్టులో, వెట్టోరి సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు.[10]

మూలాలు మార్చు

  1. "Vettori confident of fruitful outing". Deccan Herald. 2 April 2012.
  2. "New Zealand's Daniel Vettori retires from international cricket". BBC Sport. BBC Sport. 31 March 2015. Retrieved 31 March 2015.
  3. Leggat, David (10 August 2007). "Vettori for captain as Fleming hits 145". The New Zealand Herald. Retrieved 27 August 2009.
  4. "Changing of the guard for Black Caps". TVNZ. 12 September 2007. Archived from the original on 8 October 2012. Retrieved 27 August 2009.
  5. Grant Elliott in, Jimmy Neesham out for New Zealand | Cricket.
  6. "Eoin Morgan to represent Dublin franchise in inaugural Euro T20 Slam". ESPN Cricinfo. Retrieved 19 July 2019.
  7. "Bangladesh appoint Langeveldt, Vettori as bowling coaches". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 27 July 2019.
  8. Muthu, Deivarayan (27 August 2021). "Daniel Vettori: Barbados Royals 'lucky' to have 'total cricketer' Glenn Phillips". ESPNcricinfo. Retrieved 28 September 2023.
  9. Harvey, Kerry (5 January 2023). "Daniel Vettori says 'We're pretty, pretty desperate for a win' in the T20 Black Clash". Stuff.
  10. "Daniel Vettori named new Sunrisers Hyderabad head coach". ESPNCricinfo. Retrieved 7 August 2023.

బాహ్య లింకులు మార్చు