తాడేపల్లిగూడెం

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండల నగరం

మూస:Infobox India AP City తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన ఒక . నగరం ఇది జిల్లాలో ఒక ముఖ్య వాణిజ్య కేంద్రం.

చరిత్ర మార్చు

 
రెండవ ప్రపంచయుద్ధ కాలములో బ్రిటీషు పాలకులు నిర్మించిన తాడేపల్లిగూడెం విమానాశ్రయం రన్వే
 
రన్వేపై సూచించిన నిర్మాణ తేదీ

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీషు వారు యుద్ధ విమానాలను నిలిపేందుకు అణువుగా తాడేపల్లిగూడెంలో 2 కి.మీ పొడవున్న రన్ వేను నిర్మించారు. నాలుగయిదు {ఈస్ట్ కోస్ట్ హైబ్రీడ్స్, ఎస్.ఆర్.కె.నర్సరీ లాంటి} పెద్ద నర్సరీలు ఉన్నాయి.

భౌగోళికం మార్చు

జిల్లా కేంద్రం భీమవరానికి 33 కి.మీ.ల దూరంలో ఉంది. కోస్తాలో ముఖ్యపట్టణాలు ఏలూరు 50 కి.మీ.దూరంలో, విజయవాడ 100 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. రాజమండ్రి 45 కి.మీ. దూరంలో ఉంది.

జనగణన గణాంకాలు మార్చు

2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 1,04,032. 2001 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా వివరాలు మొత్తం జనాభా 103,906.అందులో మగవారు 49%,ఆడవారు 51%,సగటు అక్షరాస్యత శాతం 61%.

పరిపాలన మార్చు

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

విద్య మార్చు

ఇక్కడ 6 ఇంజనీరింగ్ కాలేజిలు, 4 ఎం.బి.ఎ కాలేజిలు, 4 ఎం.సి.ఎ కాలేజిలు ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ క్యాంపస్, డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన విద్యాసంస్థలు:

రవాణా మార్చు

దస్త్రం:AP City TadepalliGudem RlyStn views.JPG
తాడేపల్లిగూడెం రైల్వేస్టేషను

జాతీయ రహదారి 16 ఈ పట్టణం నడిబొడ్డు గుండా వెళుతుంది. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషను హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో వుంది. దగ్గరలోని విమానాశ్రయం రాజమహేంద్రవరం లో వుంది.

వ్యాపారం మార్చు

రాష్ట్రంలో మామిడి, బెల్లం, పప్పు దినుసులు, ఉల్లిపాయలు వ్యాపారానికి ముఖ్య కేంద్రం.

పరిశ్రమలు మార్చు

పట్టణంలో గొయంకా ఫుడ్ ఫ్యట్స్ ‍‍‍‍ఫెర్టిలైజర్స్ (3 ఏఫ్) కర్మాగారం, చాక్ పీసుల తయారీ, కొవ్వత్తుల తయారీ పరిశ్రమలు, బియ్యపు మిల్లులు, బెల్లం తయారీ కేంద్రాలు ఉన్నాయి. పట్టణానికి దగ్గరగా బెల్లం తయారీ కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అతి పెద్ద ధాన్యం నిలువ చేసే ఎఫ్.సీ.ఐ. గిడ్డంగులున్నాయి.

సంస్కృతి మార్చు

సాహిత్యం మార్చు

ప్రముఖ న్యాయవాది చామర్తి సుందర కామేశ్వరరావు (ప్లీడరు బాబ్జిగా ప్రఖ్యాతుడు), పత్రికా సంపాదకుడు, రచయిత మారేమండ సీతారామయ్య 1972 అక్టోబరు 2న గాంధీ జయంతి నాడు తెలుగు సాహితీ సమాఖ్యను స్థాపించారు. ప్రతీ నెలా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం, మధుమంజరి మాసపత్రిక, వార్షిక పత్రికగా వెలువరించడం, కొన్ని పుస్తకాలను ప్రచురించడం తెలుగు సాహితీ సమాఖ్య ద్వారా చేశారు. సంస్థ ద్వారా విశ్వనాథ సత్యనారాయణ, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి,శ్రీశ్రీ వంటి ప్రముఖ కవిపండితులతో సాహిత్య కార్యక్రమాలు చేశారు. చామర్తి సుందర కామేశ్వరరావు, మారేమండ సీతారామయ్య, గూడవల్లి నరసింహారావు, వేమూరి గోపాలకృష్ణమూర్తి , జంధ్యాల వేంకటేశ్వరశాస్త్రి "శాంతిశ్రీ", ఎన్.వి.ఎస్.రామారావు, రసరాజు, లాల్ అహ్మద్, తదితరులు సంస్థ అభివృద్ధికి కృషిచేశారు.యద్దనపూడి సూర్యనారాయణమూర్తి , మామిడి వెంకటేశ్వరరావు, వాజపేయయాజుల సుబ్బయ్య ,యద్దనపూడి వెంకటరత్నం, తదితరులు సంగీత, సాహిత్యాది లలిత కళలను అభివృద్ధి చేయడానికి నడిపిన లలితకళాసమితి కొన్నాళ్ళు కొనసాగి ఆగిపోయింది.

పర్యాటక ఆకర్షణలు మార్చు

అవతార్ మెహెర్ బాబా సెంటరు ఉంది. తాడేపల్లిగూడెం గ్రామ దేవత బలుసులుమ్మ

ప్రముఖ వ్యక్తులు మార్చు

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు