తూర్పు వెళ్ళే రైలు

తూర్పు వెళ్లే రైలు 1979లో విడుదలైన ఒక తెలుగు సినిమా. భారతీరాజా తమిళచిత్రం 'కిళక్కు పోగుం రైల్' (கிழக்கே போகும் ரயில், 1978) చిత్రానికి తెలుగురూపం ఈ సినిమా. బాపు రమణ ల అనుసృజన. బాలసుబ్రహ్మణ్యం సంగీతదర్శకునిగా పనిచేసారు.

తూర్పు వెళ్ళే రైలు
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
నిర్మాణం పి.పేర్రాజు
తారాగణం మోహన్ (నటుడు),
జ్యోతి,
రాళ్ళపల్లి
సంగీతం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం
నేపథ్య గానం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ
గీతరచన ఆరుద్ర
సంభాషణలు ముళ్ళపూడి వెంకటరమణ
నిర్మాణ సంస్థ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు మార్చు

ఈ సినిమాలో 5 పాటలను ఆరుద్ర రచించారు.[1]

  1. ఏమిటిదీ, ఏమిటిదీ ఏదో ఏదో తెలియనిదీ ఎప్పుడు కలగనిది - రచన: ఆరుద్ర - గానం: పి.సుశీల
  2. కన్నె మా చిన్నారి కాపాడవమ్మా నిండుగా మావూరు నిలబెట్టవమ్మా - రచన: ఆరుద్ర - గానం: పి.సుశీల బృందం
  3. కో అంటే కోయిలమ్మా కోకో కోఅంటే కోడిపుంజు కొక్కరకో రచన జాలాది -గానం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  4. చుట్టూ చెంగావి చీరా కట్టాలే చిలకమ్మ (గులామ్ అలీ గజల్ ఆధారంగా) - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం.
  5. నీటి బొట్లు నీటిబొట్లు పాటల కన్నీటిబొట్లు
  6. వస్తాడే నారాజు వస్తాడే ఒక రోజు రావలిసిన వేళకే వస్తాడే - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి. శైలజ
  7. వేగుచుక్క పొడిచింది వేకువ కాబోతూంది - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం (టైటిల్ నేపథ్య గీతం)
  8. సందెపొద్దు అందాలున్న చిన్నదీ, ఏటిమీద తాలాడుతున్నదీ - రచన జాలాది - గానం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

విశేషాలు మార్చు

  • ఈ చిత్రం ద్వారా "జ్యోతి" అనే నటి పరిచయమయ్యింది.

మూలాలు మార్చు

  1. కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.

బయటి లింకులు మార్చు