తెలుగు సినిమాలు 1966

ఈ యేడాది 32 చిత్రాలు విడుదల కాగా, యన్టీఆర్‌ 12 చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ నాలుగు చిత్రాల్లోనూ నటించారు. హాస్యప్రధానంగా రూపొందిన జానపద చిత్రం 'పరమానందయ్య శిష్యుల కథ', నాయక, ప్రతినాయక పాత్రలు పోషించి, స్వీయ దర్శకత్వంలో యన్టీఆర్‌ రూపొందించిన 'శ్రీకృష్ణ పాండవీయం', చైల్డ్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిన 'లేత మనసులు' చిత్రాలు సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. "ఆస్తిపరులు, శ్రీకృష్ణతులాభారం, పిడుగురాముడు, మొనగాళ్ళకు మొనగాడు, పొట్టి ప్లీడర్‌, పల్నాటియుద్ధం, కె.విశ్వనాథ్‌ తొలి చిత్రం 'ఆత్మగౌరవం', అక్కినేని తొమ్మిది పాత్రలు పోషించిన 'నవరాత్రి" చిత్రాలు విశేషాదరణ పొందాయి. యన్టీఆర్‌, విఠలాచార్య కలయికలో రూపొందిన 'అగ్గిబరాటా' రికార్డు ఓపెనింగ్స్‌ రాబట్టింది. 'గూఢచారి 116' ఘనవిజయంతో కృష్ణ హీరోగా మంచి గుర్తింపు సంపాదించారు. ఈ యేడాదే 'చిలకా-గోరింక' ద్వారా కృష్ణంరాజు తెరకు పరిచయమయ్యారు. కె.ఎస్.ఆర్.దాస్ 'లోగుట్టు పెరుమాళ్ళ కెరుక'తో దర్శకుడయ్యారు.

  1. అడవి యోధుడు
  2. అడుగుజాడలు
  3. అగ్గిబరాటా
  4. ఆమె ఎవరు? - జగ్గయ్య, జయలలిత
  5. ఆత్మ గౌరవం
  6. ఆస్తిపరులు
  7. ఆటబొమ్మలు
  8. కన్నులపండుగ
  9. కన్నెమనుసులు
  10. కన్నెపిల్ల
  11. కత్తిపోటు
  12. గూఢచారి 116
  13. చిలక గోరింక
  14. జమీందారు
  15. దొంగలకు దొంగ
  16. డాక్టర్ ఆనంద్
  17. నవరాత్రి
  18. నాగ జ్యోతి [1]
  19. పాదుకా పట్టాభిషేకం
  20. పల్నాటి యుద్ధం (1966 సినిమా)
  21. పరమానందయ్య శిష్యులకథ
  22. పెళ్ళిపందిరి
  23. పిడుగురాముడు
  24. పొట్టి ప్లీడరు
  25. భక్త పోతన(1966 సినిమా)
  26. భీమాంజనేయ యుద్ధం
  27. మనసే మందిరం
  28. మంగళసూత్రం
  29. మోహినీ భస్మాసుర
  30. మా అన్నయ్య
  31. రంగులరాట్నం
  32. లోగుట్టు పెరుమాళ్ళకెరుక
  33. లేత మనసులు
  34. విజయశంఖం
  35. శకుంతల
  36. శ్రీమతి
  37. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణుకథ
  38. శ్రీకృష్ణ తులాభారం (1966) - జమున, ఎన్.టి.ఆర్.
  39. శ్రీకృష్ణ పాండవీయం
  40. సంగీత లక్ష్మి
  41. హంతకులొస్తున్నారు జాగ్రత్త

మూలాలు మార్చు

  1. "Naga Jyothi (1966)". Indiancine.ma. Retrieved 2021-05-20.


తెలుగు సినిమాలు  
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |