దుప్పి

దుప్పిని (Chital or Spotted Deer) మచ్చల జింక లేదా యాక్సిస్ డీర్ అని కూడా పిలుస్తారు.

దుప్పిని (Chital or Spotted Deer) మచ్చల జింక లేదా యాక్సిస్ డీర్, చుక్కల దుప్పి అని కూడా పిలుస్తారు. ఇది భారత ఉపఖండానికి చెందిన జింక జాతి . 1777లో జర్మన్ ప్రకృతి శాస్త్రవేత్త జోహన్ క్రిస్టియన్ పాలీకార్ప్ ఎర్క్స్‌లెబెన్ దీనిని మొదటిసారిగా వర్ణించాడు. ఇది శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారతదేశంలో కనిపిస్తుంది. ఇవి పాకిస్తాన్‌ లోని కొన్ని ప్రాంతాలలో కూడా చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇవి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు.[2] రామాయణంలో మారీచుడు చుక్కల దుప్పి (బంగారు లేడి) గా మారి రాముని చేత చంపబడ్డాడు.[3][4]

చుక్కల దుప్పి
మగ దుప్పి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
ఆర్టియోడాక్టిలా
Family:
సెర్విడే
Subfamily:
సెర్వినే
Genus:
యాక్సిస్
Species:
ఎ. ఆక్సిస్
Binomial name
ఆక్సిస్ ఆక్సిస్
జోహాన్ క్రిస్టియన్ పాలికార్ప్ ఎర్క్స్‌లెబెన్, 1777
చుక్కల దుప్పి వివరాలు

వివరణ మార్చు

దీని చర్మం గోధుమ రంగులో తెల్లటి మచ్చలతో ఉంటుంది. అందుకే దీనిని మచ్చల జింక అంటారు. దీని పొత్తికడుపు దిగువ భాగం తెలుపు రంగులో ఉంటుంది. ఈ జింక జాతికి చెందిన మగవాటికి మాత్రమే కొమ్ములు ఉంటాయి. ఈ కొమ్ములు సంవత్సరానికి ఒకసారి రాలిపోతాయి. దీని కొమ్ములు రెండున్నర అడుగుల పొడవు వరకు పెరుగుతాయి, అవి మూడు కోణాలుగా ఉంటాయి. మచ్చల జింకలు మూడు అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. వాటి శరీర పొడవు 1 -1.5 మీ (3.25 - 5 అడుగులు), తోక పొడవు 10 - 25 సెం.మీ (4 - 10 అంగుళాలు) మధ్య ఉంటుంది. వీటి బరువు సుమారు 85 కిలోల వరకు ఉంటుంది. మగ జింకలు బక్స్ కంటే పెద్దవిగా ఉంటాయి. ఇవి 8 నుండి 14 సంవత్సరాల వరకు జీవిస్తాయి.[5] ఇవి ప్రధానంగా ఉదయం, సాయంత్రం, రాత్రి సమయంలో చురుకుగా ఉంటాయి, రోజులో అత్యంత వేడిగా ఉండే సమయాల్లో విశ్రాంతి తీసుకుంటాయి. వీటి గర్భధారణ కాలం 210 - 225 రోజులు. మగవి ఆడ దుప్పిల కంటే పెద్దవిగా ఉంటాయి.

నివాసం మార్చు

దుప్పి ఆవాసాలు భారతదేశంలో 8-30° ఉత్తర అక్షాంశంలో, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో కనిపిస్తాయి. ఇవి రాజస్థాన్, గుజరాత్, సముద్ర మట్టానికి 1,100 మీటర్ల ఎత్తులో ఉన్న హిమాలయాల (ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, నేపాల్, ఉత్తర పశ్చిమ బెంగాల్, సిక్కిం, భూటాన్, పశ్చిమ అస్సాంలోని అటవీ ప్రాంతాలు) పాదాల దగ్గర ఉన్న బాభర్- తెరాయ్ ప్రాంతంలో ఉన్నాయి. భారత ద్వీపకల్పంలోని ఇతర అటవీ ప్రాంతాలలో ఇవి అప్పుడప్పుడు కనిపిస్తాయి. బంగ్లాదేశ్‌లో ఇవి ఇప్పుడు సుందర్‌బన్ లో మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే ఇవి మధ్య, ఈశాన్య, ఆగ్నేయ ప్రాంతాలలో అంతరించిపోయాయి. ఇవి బహిరంగ గడ్డి భూములు, పాక్షిక-సతత హరిత అడవులలో గుంపులుగా కనిపిస్తాయి. పొడవాటి గడ్డి, పొదలు లభించే అడవులలో ఇవి ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. నక్కలు, పులులు, సింహాలు వీటిని ప్రధానంగా ఆహారం కోసం వేటాడతాయి. ఇవి వేటాడే జంతువులను చూడగానే పారిపోతాయి.[6]

ఆహారం మార్చు

ఇవి ఏడాది పొడవునా గడ్డిని తింటాయి, ఎక్కువగా చిగుళ్ళను తింటాయి.

ఇవి కూడ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Duckworth, J.W., Kumar, N.S., Anwarul Islam, Md., Hem Sagar Baral & Timmins, R.J. (2008). Axis axis. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 8 April 2009. Database entry includes a brief justification of why this species is of least concern.
  2. "இயற்கையைத் தேடும் கண்கள் 25: கூச்சம் இழந்த புள்ளி மான்கள்!". Hindu Tamil Thisai. 2018-11-03. Retrieved 2023-05-23.
  3. "Why did Sita want the spotted deer in Ramayana?". Quora. Retrieved 2023-05-23.
  4. "(P) The Golden Deer (from the Ramayana) – Heart Of Hinduism". Retrieved 2023-05-23.
  5. "Preliminary study of the behavior and ecology of axis deer on Maui, Hawaii". www.hear.org. Archived from the original on 2023-08-16. Retrieved 2023-05-23.
  6. "Chital: The Animal Files". www.theanimalfiles.com. Retrieved 2023-05-23.
"https://te.wikipedia.org/w/index.php?title=దుప్పి&oldid=4051008" నుండి వెలికితీశారు