దుమ్ములగొండి లేదా హైనా (ఆంగ్లం: Hyena) ఒక రకమైన మాంసాహారి అయిన క్షీరదము. ఇది ఆసియా, ఆఫ్రికా ఖండాలలో కనిపించే జంతువు. ఈ జాతిలో నాలుగు రకాలైన ఉపజాతులున్నాయి. అవి చారల హైనా , బ్రౌన్ హైనా (ప్రజాతి Hyaena), మచ్చల హైనా (ప్రజాతి Crocuta), ఆర్డ్‌వుల్ఫ్ (ప్రజాతి Proteles).2010 జూన్ లో దక్షిణ ఇండియాలో వీటి జాడ కనిపించినది.

Hyenas
కాల విస్తరణ: Early Miocene to Recent
మచ్చల హైనా
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Family:
హైనిడే

Gray, 1821
జీవిస్తున్న ప్రజాతులు
Synonyms
  • Protelidae Flower, 1869

వీటిలో చారలహైనా భారతదేశపు అడవులలో ఉంటుంది. మిగిలినవి ఆఫ్రికా దేశపు అడవులలోను, మైదానాలలోను కానవస్తాయి. వీటిలో ఆర్డ్‌వుల్ఫ్ తప్పించి మిగిలిన హైనాలు వేటలో మంచి సామర్థ్యం కలిగినవి. చనిపోయిన జంతువుల మాంసాన్ని తింటాయి (scavengers). హైనా సైజుతో పోలిస్తే వాటి దవడ ఎముకలు చాలా బలమైనవి. వాటి జీర్ణకోశంలో ఆమ్లపూరితమైన స్రావాలు ఎక్కువ గనుక జంతువుల మాంసం దాదాపు పూర్తిగా, అంటే మాసం, చర్మం, పళ్ళు, కొమ్ములు, ఎముకలతో సహా తిని జీర్ణం చేసేసుకోగలవు. (వెండ్రుకలు, గిట్టలు మాత్రం తిరిగి కక్కేస్తాయి). వాటి జీర్ణకోశంలో స్రవించే స్రావాలు బాక్టీరియాను నిరోధించగలవు గనుక మరణించిన జంతువుల మాంసాన్ని హైనాలు సుబ్బరంగా తినేస్తాయి.

వీటిల్లో ముఖ్యంగా మచ్చల హైనాలు గుంపులుగా, చాలా తీవ్రంగా వేటాడుతాయి. ఆర్డ్‌వుల్ఫ్ మాత్రం ఎక్కువగా చెదపురుగులలాంటి కీటకాలను తింటుంది గనుక వీటికి మిగిలిన హైనాలలాంటి వేటాడే శక్తి, అవయవసంపద తక్కువ.

వెలుపలి లింకులు మార్చు