ధనిష్ఠ నక్షత్రము

ధనిష్ఠానక్షత్రము గుణగణాలు మార్చు

ధనిష్ఠా నక్షత్ర అధిపతి కుజుడు, ఇది రాక్షస గణము, రాశ్యాధిపతి శని, జంతువు సింహము. ఈ రాశిలో జన్మించిన వారు మంచి బుద్ధికుశలత కలిగి ఉంటారు. వీరి తెలివి తేటలను సరిగా ఉపయోగిస్తే శాశ్వత కీర్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నత శీఖరాలను సునాయాసంగా అందుకుంటారు. అండగా నిలబడే శక్తివంతమైన వ్యక్తులు జీవితంలో ప్రతి సంఘటనలో ఆదుకుంటారు. అధికారులుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. వీరి అధికార వైఖరి, మెండి తనం కారణంగా విమర్శలను ఎదుర్కొనవలసిన పరిస్థితి అడుగడుగునా ఎదురౌతుంది. అనవసరమైన విషయాలను గోప్యంగా ఉంచే ఆత్మీయులను దూరం చేసుకుంటారు. ధనం పొదుపు చేయాలని ప్రయత్నిస్తారు. కాని అది ఆచరణ సాధ్యం కాదు. అందరికీ సాయం చేస్తారు. డబ్బు చేతిలో నిలవదు. స్థిరాస్థుల రుపములోనె నిలబడతాయి. మేధావులుగా భావిస్తారు కాని ఆత్మియులకు చెప్పకుండా చేసే పనులు నష్టం కలిగిస్తాయి. దుష్టులకు భాగస్వామ్యం అప్పచెప్తారు. అందు వలన నష్తపోతారు. మధ్యవర్తి సంతకాల వలన, కోర్టు తీర్పుల వలన నష్టపోతారు. పైసాకు చెల్లని వ్యక్తులను నెత్తికి ఎక్కించు కుని అందలం ఎక్కించి కష్టాలు కొని తెచ్చుకుంటారు. చదువు, సంస్కారం ఉపయోగపడి మంచి అధికారిగా రాణిస్తారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉంటే పురోగమనం సాధించ వచ్చు. సంతానాన్ని అతి గారాబం చేస్తే చేదు అనుభవాలు ఎదురౌతాయి. పెంపకంలో లోపాలు ఉన్నా సంతానం బాగుపడి కుంటుంబానికి ఖ్యాతి తెస్తారు. గురు, శని, బుధ, మహర్ధశలు, శుక్రదశ యోగిస్తాయి.

నక్షత్రములలో ఇది 23వ నక్షత్రము.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి
ధనిష్ఠ కుజుడు రాక్షస పురుష సింహం జమ్మి మధ్యనాడి అష్ట వసువు 1,2 మకరం 3,4 కుంభం

ధనిష్ఠ నక్షత్ర జాతకుల తారా ఫలాలు మార్చు

తార నామం తారలు ఫలం
జన్మ తార మృగశిర, చిత్త, ధనిష్ఠ శరీరశ్రమ
సంపత్తార ఆర్ద్ర, స్వాతి, శతభిష ధన లాభం
విపత్తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర కార్యహాని
సంపత్తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర క్షేమం
ప్రత్యక్ తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి ప్రయత్న భంగం
సాధన తార అశ్విని, మఖ, మూల కార్య సిద్ధి, శుభం
నైత్య తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ బంధనం
మిత్ర తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ సుఖం
అతిమిత్ర తార రోహిణి, హస్త, శ్రవణం సుఖం, లాభం

ధనిష్థానక్షత్రము నవాంశ మార్చు

ఈ నక్షత్ర జాతకలకు పేరు పెట్టేటప్పుడు ప్రారంభంలోగా -గా - గి - గీ - గు - గూ - గె - గే వంటి అక్షరాలు ఉండటం శ్రేయస్కరం. ఉదాహరణకు, గాంగేయ, గార్గ, గంగాధర, గీర్వాణి వంట పేర్లు పట్టవచ్చు

చిత్రమాలిక మార్చు

ఇతరవనరులు మార్చు