నల్లేరు
నల్లేరు మొక్క.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
సిస్సస్
Species:
సి. క్వాడ్రాంగ్యులారిస్
Binomial name
సిస్సస్ క్వాడ్రాంగ్యులారిస్

నల్లేరు (లాటిన్ Cissus quadrangularis) ద్రాక్ష కుటుంబానికి చెందిన తీగ మొక్క. ఇది సాధారణముగా పశువులకు మేతగా ఉపయోగిస్తారు. భారత, శ్రీలంక ప్రాంతానికి చెందిన ఈ మొక్క ఆఫ్రికా, అరేబియా, ఆగ్నేయాసియాలలో కూడా కనిపిస్తుంది. ఇది బ్రెజిల్, అమెరికా సంయుక్త రాష్ట్రాల దక్షిణ ప్రాంతానికి ఎగుమతి చేయబడింది.

లక్షణాలు మార్చు

  • రసయుతమైన చతుర్థకోణయుత కాండంతో నులితీగ సహాయంతో ఎగబ్రాకే పొద.
  • అండాకారంలో గాని, మూత్రపిండాకారంలో గాని ఉన్న సరళ పత్రాలు.
  • నిశ్చితగుచ్ఛాలలో అమరి ఉన్న లేత గోధుమ రంగు పుష్పాలు.
  • ఎరుపు రంగు మృదు ఫలాలు.

వైద్యంలో మార్చు

నల్లేరు భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతున్నది. నల్లేరును ఆయుర్వేద వైద్యంలో విరిగిన ఎముకలు త్వరగా కట్టుకోవడానికి, ఉపయోగిస్తారు. దగ్గు, కోరింత దగ్గు, శ్లేష్మము తగ్గటానికి నల్లేరును రొట్టె , తేనె, వడియాలలో కలిపి వాడుతారు. సిద్ధ వైద్య విధానంలో నల్లేరు విరిగిన ఎముకలను తిరిగి అతికించడానికి ఉపయోగించబడుతుంది, అందుకే దీనికి అస్థిసంహారక (ఎముకలను రక్షించేది) అనే పేరువచ్చింది. బంగ్లాదేశ్ లోని గారో తెగ వారు నల్లేరును విరిగిన ఎముకలను కట్టడానికి ఉపయోగిస్తారు.[1]

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. Mia, Md. Manzur-ul-Kadir; Kadir, Mohammad Fahim; Hossan, Md. Shahadat; Rahmatullah, Mohammed (Jan–Apr 2009). "Medicinal plants of the Garo tribe inhabiting the Madhupur forest region of Bangladesh". American-Eurasian Journal of Sustainable Agriculture. 3 (2): 165–171.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=నల్లేరు&oldid=3718756" నుండి వెలికితీశారు