పెల్లాగ్రా

విటమిన్ నికోటినిక్ లోపం వల్ల మనుషుల్లో సంభవించే వ్యాధి

పెల్లాగ్రా (Pellagra) విటమిన్ బి వర్గానికి చెందిన నికోటినిక్ ఆమ్లం లేదా నియాసిన్ లోపం వల్ల సంభవించే వ్యాధి[2]. డెర్మటైటిస్, డయారియా, డిమెంషియా లక్షణాలు మూలంగా ఉండటం వలన 3-డి వ్యాధి అని కూడా అంటారు. ఎర్రబడిన చర్మం, డయేరియా, నోటి పుండ్లు లక్షణాలు. సూర్యరశ్మి లేదా ఘర్షణకు గురయ్యే చర్మం యొక్క ప్రాంతాలు సాధారణంగా మొదట ప్రభావితమవుతాయి. కాలక్రమేణా ప్రభావితమైన చర్మం ముదురుగా మారుతుంది. చర్మం గట్టిగా పై పొరలుగా మారవచ్చు లేదా రక్తస్రావం కావచ్చు.[1][3][4]

పెల్లాగ్రా
పెల్లగ్రా చర్మ లక్షణాలు పీలింగ్, ఎరుపు, స్కేలింగ్, సూర్యరశ్మి ప్రాంతాల గట్టిపడటం.
ప్రత్యేకతచర్మవ్యాథి
లక్షణాలుచర్మం యొక్క వాపు, డయేరియా, డెమెంటియా, నోటిలో పుండ్లు [1]
రకాలుప్రాథమిక, సెకండరీ [1]
కారణాలునియాచిన్ సరిపడినంత లేకపోవుట [2]
రోగనిర్ధారణ పద్ధతిలక్షణాల ఆధారంగా[3]
భేదాత్మక నిర్ధారణక్వాషియోర్కోర్, పెమ్ఫిగస్, ఫోటోడెర్మాటిటిస్, పోర్ఫిరియా[3]
చికిత్సనియాచిన్ లేదా నికోటినమైడ్ సప్లెమెంటేషన్.[1]
రోగ నిరూపణబాగవుతుంది (చికిత్స తరువాత), 5 సంవత్సరాలలో మరణం (చికిత్స లేనిచో)[3]
తరచుదనంఅప్పుడప్పుడు (అభివృద్ధి చెందిన ప్రపంచం), సాధారణం (అభివృద్ధి చెందుతున్న ప్రపంచం)[3]

పెల్లగ్రాలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి, ప్రాథమిక, ద్వితీయ. ప్రాథమిక పెల్లాగ్రా తగినంత నియాసిన్, ట్రిప్టోఫాన్ లేని ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది. సెకండరీ పెల్లాగ్రా ఆహారంలో నియాసిన్ ఉపయోగించగల సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల వస్తుంది. మద్యపానం, దీర్ఘకాలిక విరేచనాలు, కార్సినోయిడ్ సిండ్రోమ్, హార్ట్‌నప్ వ్యాధి, ఐసోనియాజిడ్ వంటి అనేక మందుల ఫలితంగా ఇది సంభవిస్తుంది. రోగ నిర్ధారణ సాధారణంగా లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. మూత్ర పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 Ngan, Vanessa (2003). "Pellagra". DermNet New Zealand (in ఇంగ్లీష్). Archived from the original on 9 ఏప్రిల్ 2017. Retrieved 27 ఏప్రిల్ 2020.
  2. 2.0 2.1 "Orphanet: Pellagra". www.orpha.net (in ఇంగ్లీష్). Archived from the original on 17 ఏప్రిల్ 2017. Retrieved 27 ఏప్రిల్ 2020.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 Pitche P (2005). "Pellagra". Sante. 15 (3): 205–08. PMID 16207585.
  4. జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమీ, హైదరాబాదు.