ధాన్యంలో గింజకు ఉండే రక్షణ కవచాన్ని పొట్టు అంటారు.

A: వరిగింజ పొట్టుతో
B: తవుడుపొరవున్నబియ్యపుగింజ
C:బియ్యపుగింజబీజాంకురంతో
D: బియ్యపుగింజ with bran పాలిష్‌తవుడుతో
E:Musenmai (Japanese:無洗米), "Polished and ready to boil rice", literally, non-wash rice
(1) :పొట్టు
(2) :తవుడు
(3) :పాలిష్‌తవుడు
(4) :బీజాంకురం
(5) :బియ్యం
Rice chaff
Spikelets of a hulled wheat, einkorn
బాయిలరు ముందు పెద్ద గుట్టగా నిల్వవుంచిన వరిపొట్టు
బాయిలరు ఫర్నెష్ లో దహింపబడుతు, ఉష్ణశక్తిని విడుదలచేస్తున్నవరిపొట్టు

ఈ పొట్టును మనుషులు గాని జంతువులు గాని తినడానికి పనికిరాదు.

దీనికి తొందరగా మండే లక్షణం ఉంటుంది.

దీనిని ఎక్కువగా కొలిమిలోను, ల్యాండ్రీలలోను తొందరగా నిప్పు రాజేయడానికి ఉపయోగిస్తారు.

బట్టీలలో ముఖ్యంగా ఇటుక బట్టీలలో ఇటుకలను కాల్చేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఇంటి ముందర మరసమట్టిని తోలుకుని దానిని చదర పెట్టిన తరువాత ఆ మట్టి కాళ్ళకు అంటుకోకుండా దానిపై ఈ పొట్టును ముఖ్యంగా వరి పొట్టును చలుతారు.

ధాన్యాన్ని మిల్లుకు వేసి ఆడించినప్పుడు గింజ కన్నా పొట్టు చాలా తేలిక కనుక గాలి ద్వారా పొట్టు బయటికి నెట్టబడుతుంది.

ధాన్యాన్ని రోటిలో వేసి దంచినప్పుడు చెరుగుట ద్వారా పొట్టును వేరు చేస్తారు.

వరి ధాన్యంలో పొట్టు25-30% వరకు వుండును.

మల్చింగ్ మార్చు

మల్చింగ్ కోసం వరి పొట్టును ఉపయోగిస్తారు.

ఆటలు మార్చు

వరి పొట్టు మెత్తగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పొట్టు ఎత్తుగా విశాలంగా ఉన్న చోట పిల్లలు ఎగిరి గెంతులు వేస్తూ ఆడుకుంటారు.

జాగ్రత్తలు మార్చు

పొట్టుకు దురద కలిగించే లక్షణం ఉన్నందు వలన పొట్టులో ఆడకపోవడమే మంచిది. ఒకవేళ ఆడవలసి వస్తే పొట్టులో ఇతర వస్తువులు ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి.

మామూలుగా గేదెలు పొట్ట్టు తినవు కాని గడ్డి లేదా ఇతర దాణా ద్వారా గేదె కడుపులోకి ఈ పొట్టు చేరినపుడు గేదె మరణించే అవకాశం ఉంది అందువలన గేదె సంచరించే ప్రదేశాలలో గమనించండి.

పూర్వం గేదెలు పొట్టు తిన్నప్పుడు నాటు వైద్య విధానంలో కొబ్బరిని దంచి తినిపించడం ద్వారా గేదె నెమరేసుకునేలా చేయడం, కుంకుడు కాయ రసాన్ని తాగించడం ద్వారా వాంతి వచ్చేలా చేయడం ద్వారా గేదెను ప్రాణాపాయం నుండి రక్షించేవారు.

 

వరిపొట్టు-ఇంధనంగా వినియోగము మార్చు

40-50 సంవత్సరాల క్రితము పరిశ్రమలలోని బాయిలరులలో కలప, రాక్షసిబొగ్గు (coal), ఫర్నెస్‍ఆయిల్‍ వంటివి ఇంధనంగా వినియోగించేవారు. కలప వాడకం వలన చెట్లను నరకడం వలన ఆరణ్యసంపద తరగిపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని బాయిలర్‍లలో కలప వాడకాన్ని నిషేధించారు. రాక్షసిబొగ్గు, ఫర్నెస్‍ ఆయిల్‍ వంటి శిలాజ ఇంధనాలు పునరుత్ప్పత్తి కాని ఇంధనాల వాడకాన్ని తగ్గించుటకై (లేనిచో శిలాజ ఇంధననిల్వలు అతికొద్దికాలంలోనే హరించుకపొయ్యే ప్రమాదమున్నది) ప్రత్యామ్నాయ ఇంధన వాడకం పై దృష్టిసారించడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తులనుండి ఉత్పన్నమయ్యే వ్యర్ధాలు/ఉపౌత్పత్తుల (agro waste) ను ఇంధనాలుగా వాడటం ప్రారంభించారు.

ధాన్యాలను, అపరాలను మిల్లింగ్‍చెయ్యగా వచ్చు వరిపొట్టు, వేరుశనగకాయలపొట్టు, కందికాయలపొట్టు, సొయాగింజలకాయలపొట్టు, మొక్కజొన్నలకాళి కంకులు వంటి వాటి వాడకం బాయిలరు ఇంధనంగా వాడటం క్రమంగా పెరిగింది. అంతేకాదు రంపరుపొట్టు, పత్తిగింజల పొట్టును కూడా బాయిలరు ఇంధనంగా వాడుచున్నారు. వరిని ప్రధానంగా పండించు ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‍, పంజాబులలో తగిన ప్రమాణంలో రైసు మిల్లింగ్‍ వలన వరిపొట్టు ఉత్పత్తి అవుతున్నందున ఈ రాష్ట్రాలలో వరిపొట్టు/ఊకను బాయిలర్‍ ఇంధనంగా వాడటం మొదలైనది. ఆంధ్రప్రదేశ్‍లోని మిని పవర్‍ప్లాంట్‍ (2-5 మెగావ్యాట్‍ విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యమున్న) లలో వరిపొట్టును ఇంధనంగా వాడుచున్నారు. బాయిల్డ్‍ రైసుమిల్లువారు తమ మిల్లులలోని బాయిలర్‍లకు వారి మిల్లులో ఉత్పత్తి అవుచున్న పొట్టునే ఇంధనంగా వినియోగిస్తారు. వరిఊక/పొట్టు యొక్క సాంద్రత (bulk density) చాలా తక్కువగా వుండటం వలన తక్కువ భారంవున్న పొట్టు ఎక్కువ ప్రాంతం అక్రమించును. ఒక ఘనమీటరు నీటి బరువు 1000 కేజిలుండగా, ఒక ఘనమీటరు పొట్టు భారం 80-100 కేజిలు మాత్రమే వుండును. కొంచెం దగ్గరిగా నొక్కిన పొట్తు భారం110-120 కీజిల వరకు వచ్చును. అందుచే పొట్టును నిల్వచేయుటకు ఎక్కువ స్థలం అవసరం. అందుచే పరిశ్రమలలో వరిపొట్టును ఇంధనంగా వాడు పరిశ్రమలవారు బాయిలరు షెడ్‍ముందు భాగంలో, పెద్దబయలు ప్రదేశంలోఅధికభాగం పొట్టును నిల్వవుంచెదరు. కొద్దిపాటి వరిపొట్టును చిన్న షెడ్‍లో నిల్వచేయుదురు. ఈ చిన్నషెడ్‍లోని ఊకను వర్షకాలంలో, వర్షం పడునప్పుడు బాయిలర్‍కు వాడెదరు.

వరిపొట్టు యొక్క భౌతిక,రసాయనిక లక్షణాలు మార్చు

బల్క్ సాంద్రత 0.080-0.12
తేమశాతం 9-12%
ఫైబరు 20-28%
సాండ్/సిలికా 19-22%
మొత్తంకార్బను 37-39%
ఫిక్స్ డ్‍కార్బన్ 15-16
హైడ్రొజన్ 4-5%
ఆక్సిజన్ 35-36%
నైట్రొజన్ 0.5%
సల్ఫర్ 0.1%
వొలటైల్స్ 64-66%
ఉష్ణశక్తి.కి.కెలరిలు 2900-3200కి.కెలరిలు/కెజి

వరిపొట్టు/ఊక ఇతర ఉపయోగాలు మార్చు

  • వరి పొట్టు ఉష్ణనిరోధక గుణం కలిగివున్నది.ఈ కారణంచే వరిపొట్టు ఊష్ణనిరోధకంగా (insulator) పనిచెయును. అందుచే పెద్ద ఐస్‍గడ్దలను దూరప్రాంతాలకు రవాణాచెయ్యునప్పుడు వరిపొట్టుతో కప్పి రవాణా చేయుదురు.తోపుడుబళ్ళలో కూల్‍డ్రింక్స్, చెరకురసంతీసి అమ్మేవారు గతంలో ఐస్ గడ్డలను వరిపొట్టులో కప్పివుంచెవారు.ప్రస్తుతం థెర్మొకొల్‍ బాక్సులలో ఐస్‍ను నిల్వచేస్తున్నారు.
  • ఇప్పటికి చిన్నహోటల్‍లలో, డాబా హొటల్‍లలో వరిపొట్టును ఇంధనంగా వినియోగిస్తున్నారు.
  • ఉక్కు పరిశ్రమలలో ఫర్నేష్ (Furnace) నుండి బయటకు వచ్చు స్టీల్‍దిమ్మలు, బీమ్‍లు, ప్లేట్స్ల ఉష్ణోగ్రత900-1000<0C కలిగి వుండి, బయటకు వచ్చినప్పుడు గాలిలో వేగంగాఉపరితలం (surface) చల్లబడటం వలన స్టిల్ ఉపరితలంకఠినత్వం (hardness) పొందును.అందుచే 5-10% కార్బన్‍వున్న వరిపొట్టు బూడిదను (husk ash) బయటకు వచ్చిన స్టీల్‍దిమ్మెలపై వెంటనే చల్లడం వలన స్టీల్‍నెమ్మదిగా చల్లబడును.
  • వరిపొట్టుబూడిదలో సిలికా 80% వరకు వుండును (తెల్లగా కాలిన బూడిదలో).వరిపొట్టుబూడిదలోని సిలికా స్పటికరూపంలో వుండును.అందుచే వరిపొట్టుబూడిదలోని సిలికానుండి సొలార్‍సెల్ గ్లాస్‍తయారికి, సోడియం సిలికెట్ తయారికి వినియోగిస్తారు.
  • వరిపొట్టును తక్కువశాతంఆక్సిజంతో (దహింపబడుటకు అవసరమైన ఆక్సిజన్‍కన్న తక్కువగా) అ సంపూర్ణదహనక్రయ (combustion) జరిపిన కర్బన్‍అధికంగా వున్న బూడిద ఏర్పడును.ఈ కార్బన్‍ను ఫిల్టరు మీడియాగా పరిశ్రమలలో కొన్నింటిని ఫిల్టరుచేయుటకు వినియోగిస్తారు.
  • వరిపొట్టునుండి ఫర్‍ఫురల్ (Furfural) ఉత్పత్తిచేస్తారు.
  • గ్రామాలలో పేడనుండి పిడకలను చేయున్నప్పుడు వరిపొట్టునుకూడా కలిపి పిడకలుచేయుదురు.

ఇవి కూడా చూడండి మార్చు

తవుడు

"https://te.wikipedia.org/w/index.php?title=పొట్టు&oldid=2888352" నుండి వెలికితీశారు