బలోచిస్తాన్ విమోచన సైన్యం

బలోచిస్తాన్ విమోచన సైన్యం దిద్దుబాటు (Balochistan Liberation Army) పాకిస్తాన్ లోని బలోచీ గిరిజన జాతుల విమోచన కోసం పోరాడుతోంది. పాకిస్తాన్ లో సింధీయులు, పంజాబీయులు నివసించే ప్రాంతాలు మాత్రమే కొంత వరకు అభివృద్ధి చెందాయి. గిరిజన ప్రాంతాలు, ముఖ్యంగా బలోచీ భాష మాట్లాడే ప్రాంతాలు చాలా వెనుకబడి ఉండడం వల్ల ఆ ప్రాంతాలలో తిరుగుబాటు ఉద్యమాలు బలపడ్డాయి. బలోచిస్తాన్ విమోచన సైన్యం నవంబరు 2007 వరకు బాలాచ్ మర్రి నాయకత్వంలో పనిచేసింది.