సట్లెజ్ నది ఉపనదులలో ఒకటైన బియాస్ నది (Beas River) హిమాచల్ ప్రదేశ్ ప్రాతంలోని హిమాలయాలలోని రోటంగ్ కనుమలో ఉద్భవించింది. 470 కిలోమీటర్లు ప్రవహించి అమృత్ సర్కు దక్షిణాన హరికె పటాన్ వద్ద సట్లెజ్ నదిలో సంగమిస్తుంది. ఈ నది నీరు సింధూజలాల ఒప్పందం ప్రకారం భారత్-పాకిస్తాన్లు వాడుకుంటాయి. ప్రాచీన కాలంలో ఈ నది విపాస నదిగా పిలువబడింది.

2022లో బియాస్ నది

అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క తూర్పు సరిహద్దు ఈ నది కావడం వల్ల చరిత్రలో కూడా ఈ నది ప్రసిద్ధిచెందినది. క్రీ.పూ.326 లో విశ్వవిజేతగా పేరుగాంచిన అలెగ్జాండర్ ఈ నది దాటి భారతదేశం లోకి ప్రవేశించలేడు.

బయటి లింకులు మార్చు