భవప్రియ రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగము. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 44వ మేళకర్త రాగము.[1][2] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "భవాని" అని పిలుస్తారు.[3][4][5]

"భవప్రియ" scale with Shadjam at C

రాగ లక్షణాలు మార్చు

ఆరోహణ: స రిగా మ ప ధని స 
(S R1 G2 M2 P D1 N1 S)
అవరోహణ: సని ధ ప మగా రి స
(S N1 D1 P M2 G2 R1 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 8వ మేళకర్త రాగమైన హనుమతోడి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు మార్చు

  • ప్రణతజనమందార - ఝంప - వెంకటమఖి
  • జయంతి శివభవాని - తిస్రేక - ముత్తుస్వామి దీక్షితులు
  • సంచారి - మఠ్య - సుబ్బరామ దీక్షితులు
  • శ్రీకాంత నీ యెద - ఆది - త్యాగరాజు
  • మాం అవశ్రిత - స్వాతి తిరునాళ్
  • సెంతిరు వేళన్ - కోటేశ్వర్ అయ్యర్
  • వెనై తిరుడి - పెరియసామి తూరన్
  • మాధవ మామవ - ఎం.బాలమురళీకృష్ణ

భవానీ రాగంలో ఒక కీర్తన

  • కనికారంబుతో - కళ్యాణి వరదరాజన్

మూలాలు మార్చు

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  3. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  4. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
  5. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras