భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ సంస్థ

భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ (Indian Science Congress Association) భారతదేశానికి చెందిన శాస్త్రీయ సంస్థ. 1914లో కలకత్తా ప్రధానకేంద్రంగా ఏర్పడింది. దేశంలోని శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలను ప్రోత్సహించాలనేది ఈ సంస్థ ఉద్దేశం. ఇది ప్రతియేటా జనవరి మొదటి వారంలో దేశం లోని ఏదేని ఒక పట్టణంలో సమావేశ మౌతుంది. మొదటి జాతీయ సైన్స్ సమావేశం 1914లో జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 2008లో జరిగిన విశాఖపట్నం సమావేశంతో కలిపి 95 సమావేశాలు జరిగాయి. ఈ సమావేశం ఆంధ్ర ప్రదేశ్లో జరగడం ఇది 9 వ పర్యాయం.

100వ భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్లోని వలేడిక్టరి సభ

లక్ష్యాలు మార్చు

  • దేశంలో శాస్త్ర పురోగతికి, విస్తృతికి కృషిచేయడం,
  • ప్రతి సంవత్సరం దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో సమావేశాలు నిర్వహించడం,
  • శాస్త్రాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం,
  • సమావేశ కార్యక్రమాన్ని, చిరు పుస్తకాలను, కార్యకలాపాలను ప్రచురించడం.

ప్రారంభం మార్చు

20 వ శతాబ్దపు ప్రారంభంలో బ్రిటీష్ పాలన కాలంలో రసాయన శాస్త్రవేత్తలైన జె.ఎల్.సిమన్‌సన్, పి.ఎస్.మెక్‌మోహన్ అనే ఇద్దరు బ్రిటీషర్ల చొరవ ఫలితంగా భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ రూపుదిద్దుకొంది. బ్రిటీష్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్ తరహాలో భారతదేశంలోనూ ఒక సంస్థను ఏర్పాటు చేయాలనే సంకల్పం వారిరువురినీ పురికొల్పింది. వారి కృషి ఫలితంగా ఏర్పడిన సదస్సు ఏటా సమావేశాలను నిర్వహిస్తూ 95 వసంతాలను గడిపి శతకం దిశగా దూసుకుపోతోంది.

వార్షిక సమావేశాలు మార్చు

ప్రతియేటా జనవరి 3న దేశంలోని ఏదో ఒక ప్రాంతంలోిది సమావేశం కావడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. ఈ సమావేశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తాడు. దేశ విదేశాల నుంచి అనేక శాస్త్రవేత్తలు దీనిలో పాల్గొంటారు. ఈ సమావేశానికి ప్రముఖ వ్యక్తి లేదా శాస్త్రవేత్త అధ్యక్షత వహిస్తాడు. 1914లో జరిగిన తొలి సమావేశానికి కలకత్తా (నేటి కోల్కత) విశ్వవిద్యాలయం కులపతి అశుతోష్ ముఖర్జీ అధ్యక్షత వహించాడు. 1976లో వాల్తేర్లో జరిగిన సమావేశానికి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ అధ్యక్షత వహించాడు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1947లో అధ్యక్షత వహించాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, శాంతి స్వరూప్ భట్నాగర్, మహలనోబిస్, కస్తూరీ రంగన్]], ఎం.జి.కె.మీనన్, పి.సి.రాయ్ మొదలగు ప్రముఖులు కూడా అధ్యక్షత వహించినవారే. 1973లో ఈ సమావేశపు వజ్రోత్సవ సమావేశాలు, 1988లో ప్లాటినం జూబ్లీ సమావేశాలు జరిగాయి. స్వాతంత్ర్యం తరువాత విదేశీ శాస్త్రవేత్తల భాగస్వామ్యం పెరిగింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ మొదలగు దేశాల శాస్త్ర సంస్థలు ఈ సమావేశాలకు ప్రతినిధులను, శాస్త్రవేత్తలను పంపుచున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు మార్చు

95 సంవత్సరాల సైన్స్ కాంగ్రెస్ చరిత్రలో 9 పర్యాయాలు ఆంధ్రప్రదేశ్లో నిర్వహింపబడ్డాయి. తొలి సారిగా 1937లో హైదరాబాదులో నిర్వహింపగా, స్వాతంత్ర్యానంతరం 1954, 1967లలో మళ్ళీ హైదరాబాదే వేదిక అయింది. 1976లో విశాఖపట్నంలోనూ, 1979లో హైదరాబాదులో, 1983లో తిరుపతిలో నిర్వహించగా, 1998, 2006 మళ్ళీ హైదరాబాదులో జరిగింది. 2008లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదిక అయింది. మొత్తంపై ఆంధ్రప్రదేశ్‌లో మూడు పట్టణాలలో మాత్రమే సైన్స్ కాంగ్రెస్ సదస్సులు జరిగాయి. హైదరాబాదులో అత్యధికంగా 6 సార్లు సమావేశాలు జరగగా, విశాఖపట్నంలో 2 సార్లు, తిరుపతిలో ఒక సారి జరిగింది.

భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులు మార్చు

సదస్సు సంవత్సరం వేదిక అధ్యక్షుడు
1 వ 1914 కోల్‌కత అశుతోష్ ముఖర్జీ
2 వ 1915 చెన్నై బెన్నర్‌మన్
3 వ 1916 లక్నో సిడ్నీ జే బురార్డ్
4 వ 1917 బెంగుళూరు ఆల్ఫ్రెడ్ గిబ్స్ బోర్న్
5 వ 1918 లాహోర్ గిల్బర్ట్ వాకర్
6 వ 1919 ముంబాయి లియోనార్డ్ రోజర్స్
7 వ 1920 నాగ్పూర్ ప్రఫుల్ల చంద్ర రాయ్
8 వ 1921 కోల్కత రాజెన్ ముఖర్జీ
9 వ 1922 చెన్నై మిడిల్‌మిస్
10 వ 1923 లక్నో మోక్షగుండం విశ్వేశ్వరయ్య
11 వ 1924 బెంగుళురు నెల్సన్ అన్నండాలే
12 వ 1925 వారణాసి మార్టిన్ ఫాస్టర్
13 వ 1926 ముంబాయి ఆల్బెర్ట్ హొవార్డ్
14 వ 1927 లాహోర్ జగదీశ్ చంద్ర బోస్
15 వ 1928 కోల్కత జె.ఎన్.సిమ్మన్సెన్
16 వ 1929 చెన్నై సి.వి.రామన్
17 వ 1930 అలహాబాదు క్రిస్టోఫర్
18 వ 1931 నాగ్పూర్ సీమొర్ సెవెల్
19 వ 1932 బెంగుళూరు లాలా శివరామ్ కాశ్యప్
20 వ 1933 పాట్నా లూయిస్ ఫెర్మర్
21 వ 1934 ముంబాయి మేఘనాథ్ సాహా
22 వ 1935 కోల్కత జే.బి.హట్టన్
23 వ 1936 ఇండోర్ ఉపేంద్రనాథ్ బ్రహ్మాచారి
24 వ 1937 హైదరాబాదు టి.ఎస్.వెంకటరామన్
25 వ 1938 కోల్కత జేమ్స్ హాప్‌వుడ్ జీన్స్
26 వ 1939 లాహోర్ జే.సి.ఘోష్
27 వ 1940 చెన్నై బీర్బల్ సహాని
28 వ 1941 వారణాసి ఆర్దేశిర్ దలాల్
29 వ 1942 వదోదర డి.ఎన్.వాడియా
30 వ 1943 కోల్కత డి.ఎన్.వాడియా
31 వ 1944 ఢిలీ సత్యేంద్రనాథ్ బోస్
32 వ 1945 నాగ్పూర్ శాంతి స్వరూప్ భట్నాగర్
33 వ 1946 బెంగుళూరు అప్జల్ హుస్సేన్
34 వ 1947 ఢిలీ జవహర్‌లాల్ నెహ్రూ
35 వ 1948 పాట్నా రామ్ నాథ్ చోప్రా
36 వ 1949 అలహాబాదు కే.ఎస్.కృష్ణన్
37 వ 1950 పూనే మహలనోబిస్
38 వ 1951 బెంగుళూరు హోమీ జహంగీర్ భాభా
39 వ 1952 కోల్కట జే.ఎన్.ముఖర్జీ
40 వ 1953 లక్నో డి.ఎం.బోస్
41 వ 1954 హైదరాబాదు సుందర్‌లాల్ హోరా
42 వ 1955 వదోదర శిశిర్ కుమార్ మిత్ర
43 వ 1956 ఆగ్రా ఎం.ఎస్.కృష్ణన్
44 వ 1957 కోల్కత బి.సి.రాయ్
45 వ 1958 చెన్నై ఎం.ఎస్.థాకర్
46 వ 1959 ఢిల్లీ ఏ.ఎల్.ముదలియార్
47 వ 1960 ముంబాయి పి.పారిజ
48 వ 1961 రూర్కీ ఎన్.ఆర్.ధార్
49 వ 1962 కటక్ బి.ముఖర్జీ
50 వ 1963 ఢిల్లీ దౌలత్ సింగ్ కొటారి
51 వ 1964 కోల్కత హుమాయున్ కబీర్
52 వ 1965 కోల్కత హుమాయున్ కబీర్
53 వ 1966 చండీగర్ బి.ఎన్.ప్రసాద్
54 వ 1967 హైదరాబాదు టి.ఆర్.శేషాద్రి
55 వ 1968 వారణాసి ఆత్మారాం
56 వ 1969 ముంబాయి ఏ.సి.బోస్
57 వ 1970 ఖరగ్‌పూర్ ఎల్.సి.వర్మన్
58 వ 1971 బెంగుళూరు బి.పి.పాల్
59 వ 1972 కోల్కత డబ్ల్యూ.డి.వెస్ట్
60 వ 1973 చండీగర్ ఎస్.భాగ్యవంతం
61 వ 1974 నాగ్పూర్ ఆర్.ఎస్.మిశ్రా
62 వ 1975 ఢిల్లీ అసీమా ఛటర్జీ
63 వ 1976 వాల్తేర్ ఎం.ఎస్.స్వామినాథన్
64 వ 1977 భువనేశ్వర్ హోమీ సేత్నా
65 వ 1978 అహ్మదాబాదు ఎస్.ఎం.సిర్కార్
66 వ 1979 హైదరాబాదు ఆర్.సి.మెహ్రోత్ర
67 వ 1980 జాదవ్‌పూర్ ఏ.కే.సాహ
68 వ 1981 వారణాసి ఏ.కే.శర్మ
69 వ 1982 మైసూరు ఎం.జి.కె.మీనన్
70 వ 1983 తిరుపతి బి.రామచంద్రరావు
71 వ 1984 రాంచీ ఆర్.పి.బాంభా
72 వ 1985 లక్నో ఏ.ఎస్.పైంటల్
73 వ 1986 ఢిల్లీ టి.ఎన్.ఖోశూ
74 వ 1987 బెంగుళూరు అర్చన శర్మ
75 వ 1988 పూనే సి.ఎన్.ఆర్.రావ్
76 వ 1989 మధురై ఏ.పి.మిత్ర
77 వ 1990 కోచ్చి యశ్‌పాల్
78 వ 1991 ఇండోర్ డి.కె.సిన్హా
79 వ 1992 వదోదర వసంత్గొవారికెర్
80 వ 1993 గోవా ఎస్.జెడ్.ఖాసిం
81 వ 1994 జైపూర్ పి.ఎన్.శ్రీవాస్తవ
82 వ 1995 కోల్కత ఎస్.సి.పక్రాషి
83 వ 1996 పాటియాలా యు.ఆర్.రావ్
84 వ 1997 ఢిల్లీ ఎస్.కే.జోషి
85 వ 1998 హైదరాబాదు పి.రామారావు
86 వ 1999 చెన్నై మంజు శర్మ
87 వ 2000 పూనె ఆర్.ఏ.మార్‌షెల్కర్
88 వ 2001 ఢిల్లీ ఆర్.ఎస్.పరోడా
89 వ 2002 లక్నో ఎస్.కే.కతియార్
90 వ 2003 బెంగుళూరు కృష్ణస్వామి కస్తూరిరంగన్
91 వ 2004 చండీగర్ ఆసిస్ దత్త
92 వ 2005 అహ్మదాబాదు ఎన్.కే.గంగూలీ
93 వ 2006 హైదరాబాదు ఐ.వి.సుబ్బారావు
94 వ 2007 అన్నామలైనగర్ హర్ష్ గుప్తా
94 వ 2008 విశాఖపట్నం

104వ సమావేశం 2017 జనవరి 3to7 ప్రవేశం: తిరుపతి {శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ} అధ్యక్షా వహించినది: నారాయణస్వామి బి

105వ సమావేశం 2018 మార్చి 16 to 20 ప్రదేశం: మణిపూర్ {ఇంపాల్ యూనివర్సిటీ} అధ్యక్షత వహించినది: అచ్యుత్ సమంత్

106 సమావేశం 2019 ప్రవేశం: పంజాబ్ {జలంధర్} అధ్యక్షత వహించినది: రంగప్ప

107 వ సమావేశం ప్రదేశం: బెంగళూరు కర్ణాటక


108 వ సమావేశం 2021 జనవరి 3 to 7 ప్రవేశం పూణే అధ్యక్షత వహించినది: విజయలక్ష్మి సక్సేనా