మంగమ్మగారి మనవడు

ఇది 1984 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. భార్గవ్ ఆర్ట్స్ పతాకం మీద కొన్ని చిత్రాలు (మనిషికో చరిత్ర, చిలిపిమొగుడు, ముక్కుపుడక) నిర్మించిన ఎస్.గోపాలరెడ్డి, తమిళంలో విజయవంతమైన భారతీరాజా చిత్రం 'మణ్ వాసనై' (మట్టి వాసన) ను తెలుగులో బాలకృష్ణను కథానాయకునిగా పునర్నిర్మించారు. తాతమ్మ కల (బాలనటునిగా బాలకృష్ణ తొలిచిత్రం) కాంబినేషన్ గుర్తు చేస్తూ భానుమతి, బాలకృష్ణ తాతమ్మగా ఈ చిత్రంలో నటించారు.

మంగమ్మ గారి మనవడు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం యస్.గోపాలరెడ్డి
తారాగణం భానుమతి రామకృష్ణ,
నందమూరి బాలకృష్ణ,
సుహాసిని
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ సెప్టెంబరు 9, 1984
భాష తెలుగు

చిత్ర కథ మార్చు

భానుమతి (మంగమ్మ) కొడుకు కొడుకు బాలకృష్ణ. కూతురు అనిత, అల్లుడు గోకినేని రామారావు, మనవరాలు సుహాసిని. అల్లుడు వై.విజయతో ఉండటం మంగమ్మకు నచ్చదు. రెండు కుటుంబాలకు సయోధ్య లేదు. మనవడు, మనవరాలికి ఒకరంటే ఒకరికి ఇష్టం. పొరుగు గ్రామంలో మోతుబరి ఏలేశ్వరంరంగాకు మంగమ్మ అంటే పడదు. ఐతే రెండు ఊర్లకు ప్రతీ సంవత్సరం ఎడ్ల పందాలు జరుగుతుంటాయి. గోకిన రామారావు తగిన మత్తులో తన ఎద్దును లొంగదీసినవాడికి తన కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తానని పందెం వేస్తాడు. మొసం చేసి పందెంలో ఎద్దును ఓడిస్తారు. పందెంలో ఓదిపోయిన గోకిన రామారావు ఆత్మ హత్య చేసుకుంటాడు. పెళ్ళి ఏర్పాటులో ఉన్న బాలకృష్ణ పై పొరుగూరి వ్యక్తులు దాడి చేస్తారు. బాల కృష్ణ ఆచూకి దొరకక మరణించాడనుకుంటారు. కొంతకాలానికి మిలటరీ దుస్తులతో బాలకృష్ణ వేరే అమ్మాయితో తిరిగి వస్తాడు.ఆఅమ్మాయి ఎవరు, బాలకృష్ణ ఎలా బ్రతికాడు వంటి వివరాలతో కథ ముగింపుకొస్తుంది.

వివరాలు మార్చు

భానుమతి, బాలకృష్ణ, గొల్లపూడి, సుహాసిని, వై.విజయ, అనిత, యేలెశ్వరం రంగా, గోకిన రామారావు, బాలాజీ మొదలయిన వారు నటించారు. గణేష్ పాత్రొ సంభాషణలు గోదావరి మాందలకంలో సాగాయి. భానుమతి పాత్ర సంభాషణ లలో అనేక సామెతలు చొప్పించారు. వై. విజయ సంభాషణలు కూడా పాత్రోచితంగా సాగాయి. ( సెడగొట్ల వంశం మాది సెడ్డపేరే లేదు వంటివి) కోడి రామకృష్ణ ఈ చిత్రం తరువాత భార్గవ్ ఆర్ట్స్ కు పర్మినెంటు దర్శకునిగా మారారు. తమిళ చిత్రంలో పొయెటిక్ నేచరు (చిత్రం పేరులోనూ, చిత్రీకరణలోనూ) లోపించి, హీరోదాత్తత (హీరోఇజం) ఎక్కువైనా తెలుగులో ఈ చిత్రం విజయవంతమయ్యింది. చిత్రంలో ఎక్కువ భాగం, గోదావరి జిల్లాలలో, కడియం, కడిపిలంక, ఉండ్రాజవరం, పట్టిసీమ లలో చిత్రీకరణ జరుపబడింది.

పాటలు మార్చు

  • 'శ్రీ రఘురామా సీతారామా రావాలయా నీ రాజ్యం' (భానుమతి, 'వైష్ణవ జనతో' భజన్ ఆధారితం )
  • 'వంగతోట కాడా వళ్ళూ జాగ్రత్తా', రచన: సీ. నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • 'చందురుడూ నిన్ను చూసి ', రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల
  • 'గుమ్మా చూపూ నిమ్మముల్లూ', రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ
  • 'శ్రీ సూర్యనారాయణా మేలుకో', రచన: సి నారాయణ రెడ్డి గానం. భానుమతి రామకృష్ణ, వాణి జయరాం
  • 'దంచవె మెనత్తా కూతురా', ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల , రచన : సి. నారాయణా రెడ్డి