ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్

(న్యాయపాఠశాల పునాదులు)

ఫిఖహ్
అహ్‌కామ్
పండిత బిరుదులు

మజహబ్ లేదా సున్నీ న్యాయపాఠశాల. ఇస్లామీయ న్యాయశాస్త్రాన్ని షరియా అంటారు. షరియా యొక్క మూలాధారం ఖురాన్, సున్నహ్ లు. "వివిధ న్యాయశాస్త్రాల అవలంబీకులైననూ, పరస్పరవైరుధ్యంలేకుండా ఒకే మస్జిద్ లో ప్రార్థనలు చేసెదరు. సున్నీ ముస్లింల న్యాయపాఠశాలలు నాలుగు, వారి స్థాపకులు:

ఈ పాఠశాల అవలంబీకులకు "హనఫీ"లు అంటారు. ఈ పాఠశాలను స్థాపించినవారు "అబూ హనీఫా" (తారీఖు. 767). ఇతను ఇరాక్లో జన్మించాడు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, మధ్యాసియా ఇరాక్, టర్కీ, జోర్డాన్, లెబనాన్, సిరియా, పాలస్తీనా లోని ముస్లింలు ఈ పాఠశాలను అవలంబిస్తారు.

  • మాలికి పాఠశాల (స్థాపకులు: మాలిక్ ఇబ్న్ అనస్ మరణం 795) మహమ్మదు ప్రవక్త ఆఖరు సహాబాలను చూసిన ఇతను తన ఆలోచనలను మదీనాలో ప్రవేశపెట్టాడు. ఈ పాఠశాల సున్నీ ముస్లింలలో అధికారికమైన పాఠశాల. ఇతని నిర్వచనాన్ని 'మువత్తా' లో గ్రంథస్తమయింది. ఈ పాఠశాల అవలంబీకులు ఆఫ్రికా ఖండం అంతటా దాదాపు వ్యాపించియున్నారు.
  • షాఫయీ పాఠశాల (స్థాపకులు : ముహమ్మద్ ఇబ్న్ ఇద్రీస్ అష్-షాఫయీ మరణం 820). ఇతను ఇరాక్, ఈజిప్టులలో బోధించాడు. ప్రస్తుతం ఇండోనేషియా, దక్షిణ ఈజిప్టు, మలేషియా, యెమన్ ముస్లింలు ఈ పాఠశాలను అవలంబిస్తారు. ఇతను మహమ్మదు ప్రవక్త యొక్క సున్నహ్ ను అమితంగా ప్రాధాన్యతనిచ్చాడు, ఇవన్నియూ హదీసులనుండి గ్రహింపబడినవి. ఈ హదీసులే షరియాకు మూలం.
  • హంబలి పాఠశాల (స్థాపకులు: అహ్మద్ బిన్ హంబల్)

అహ్మద్ ఇబ్న్ హంబల్ (మరణం : 855) బాగ్దాదులో జన్మించాడు. ఇతను షాఫయీ నుండి ఎన్నో విషయాలను అభ్యసించాడు. ఈ పాఠశాలావంబీకులు అరేబియన్ ద్వీపకల్పంలో మెండు.

పై నాలుగు పాఠశాలలన్నియూ వైవిధ్యంగలవి, గాని సున్నీముస్లింలు వీటిన సాధారణంగా సమాన దృష్టితో చూస్తారు.

మజ్ హబ్ విషయంలో సందేహం తలెత్తుతుంది. మజ్ హబ్ అనగా పాఠశాల, మతము గాదు. ముస్లిం సముదాయాలలో ఈ నాలుగు పాఠశాలలు సాధారణంగా కానవస్తాయి. సున్నీ ముస్లింలు ఈ మజ్ హబ్ లను సమాన దృష్టితో చూసిననూ, ఏదో ఒక మజ్ హబ్ ను నిర్దిష్టంగా నిష్టగా పాటించవలెనని బోధిస్తారు. వీటన్నిటికీ మూలం ఖురాన్, హదీసులు మాత్రమేనని మరువగూడదు.

ఇవీ చూడండి మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మజహబ్&oldid=3596659" నుండి వెలికితీశారు