షింటో మతం

(షింటో మతము నుండి దారిమార్పు చెందింది)

షింటో (జపనీస్ భాషలో 神道) జపాన్ దేశంలో ఉద్భవించిన ఒక మతం. మత పండితులు దీనిని తూర్పు ఆసియా మతాల కింద వర్గీకరించారు. ఈ మతానుయాయులు దీన్ని పూర్తి దేశీయ మతంగానూ, ప్రకృతి మతం గానూ పరిగణిస్తారు. వీరినే షింటోయిస్టులు అని కూడా అంటారు. ఈ మతాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక సంస్థ ఏమీ లేదు. దీన్ని అనుసరించే వారిలో చాలా వైవిధ్యం కనిపిస్తూ ఉంటుంది.

జపాన్‌లోని హిరోషిమా ప్రిఫెక్చర్‌లోని ఇట్సుకుషిమా మందిరానికి టోరి గేట్‌వే. టోరి షింటో పుణ్యక్షేత్రాల ప్రవేశద్వారం గుర్తుగా ఉంది.

ఈ మతంలో బహుళ దేవతలను ఆరాధిస్తారు. ఈ పదానికర్థం "దేవతల మార్గం" అని. బౌద్ధం నుంచి ఈ మతాన్ని వేరుగా గుర్తించటానికి ఆరవ శతాబ్దంలో ఈ పదం సృజింపబడింది. ఇది చైనా భాష నుండి వచ్చిన పదం. దైవమార్గం "డౌ". దీనికి జపాను నామం "కమి". అయితే ఈ "కమి"లో దేవతలు లేరు. పైనున్న వారికి, ఉన్నత జీవులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. పితర, ప్రకృతి పూజ ఈ మతానికి ముఖ్య లక్షణం. ఇది సర్వ జీవవాద, ప్రాక్తన బహుదేవతా వాదాల నుండి పుట్టింది. ఈ విషయంలో ఇది వేదమతాన్ని పోలి ఉంది. ప్రకృతి శక్తుల ఆరాధన, సర్వజీవ భావం రెండీంటికి సమానమే. ప్రకృతిలో అదృశ్య శక్తులు, దేవతలు ఉన్నారని భావించి, వాటిని పూజించారు. ఈ అదృశ్య శక్తిని "మాన" అంటారు. ఇది ఒక రమైన విద్యుచ్ఛక్తి లాంటికి. ఇదే "కమి" ఈ విశ్వ ప్రకార్యాలను వ్యక్తులుగా భావించి ఆ వ్యక్తులను దేవతలను చేసి పూజించారు. సృష్టిని గురించిన వారి భావానను చూస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది.

నిర్వచనం మార్చు

షింటో మతానికి సార్వజనికమైన, ప్రామాణికమైన నిర్వచనం లేదు.[1] కానీ రచయితలు జోసెఫ్ కాలి, జాన్ డౌగిల్ ప్రకారం షింటో అనేది ప్రకృతిలోని ప్రతి వస్తువులో అంతర్గతంగా ఉండే కమీ ను విశ్వసించడమే.[2]

మూలాలు మార్చు

  1. Bocking 1997, p. viii; Rots 2015, p. 211.
  2. Cali & Dougill 2013, p. 13.

ఆధార గ్రంథాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=షింటో_మతం&oldid=4154500" నుండి వెలికితీశారు