సమగ్ర దృశ్యంను ఇంగ్లీషులో పనోరమ (panorama) అంటారు.

పనోరమ అనే పదం గ్రీకు పదం. దీని అర్ధం మొత్తం దృష్టి (కనుచూపు).

పనోరమ అనగా భౌతిక, అంతరిక్ష ఏదైనా చిత్రాన్ని ఏ కోణంలోనైనా విశాలంగా చిత్రించగలగడం.

వర్ణ చిత్రమైన, రేఖా చిత్రమైనా, చాయాచిత్రమైనా మనకు కావలసినంత పరిమాణంలో మనం చిత్రించాలనుకున్నంత ప్రదేశాన్ని ఒకే చిత్రంలో బంధించగలిగే ఈ విధానాన్ని పనోరమ లేక సమగ్ర దృశ్యం అంటారు.

ఈ పనోరమ విధానంలో ఎత్తు, వెడల్పులను ఎన్ని డిగ్రీల కోణంలో నైన బంధించగలిగే ఈ విధానంతో మనిషి చుట్టూ తిరుగుతూ, తలని పైకి కిందకి తిప్పుతూ ఎన్నో సార్లు చూసే ఈ దృశ్యాన్ని ఈ పనోరమ చిత్రంలో ఒకేసారి బంధించవచ్చు.

కొత్తగా వచ్చిన పనోరమ ఆప్షన్ ఉన్న కెమెరాలతో మనిషి లేదా యంత్ర సహాయంతో మనకు కావలసిన కోణంలో పలు చిత్రాలను కెమెరా సూచించిన విధానంలో బంధించడం ద్వారా ఆ కెమెరా ఆ చిత్రాలన్నింటిని ఒక వరసలో పేర్చి మనకు అవసరమైన ఒక సమగ్ర చిత్రాన్ని అందిస్తుంది.

గ్యాలరీ మార్చు

A panorama of Beirut dating back to the 19th century.
A panorama of Tbilisi in 1900s.
A cylindrical projection panorama from multiple images stitched together using PTgui.
A panoramic photo of Byblos Port.[1]
A panoramic photo of the courtyard of the Mosque of Uqba also known as the Great Mosque of Kairouan, Tunisia.
పనోరమ సిటీ కాలేజ్
 
A 360-degree panorama with stereographic projection

మూలాలు మార్చు