సహాయం:దిద్దుబాటు ఘర్షణ

ఈ పేజీ దిద్దుబాటు ఘర్షణల గురించి చర్చిస్తుంది. దిద్దుబాటు ఘర్షణ అంటే ఏంటో అర్థం చేసుకునేందుకు, కింది సన్నివేశాన్ని పరిశీలించండి:

  • రవి ఒక పేజీ లోని "మార్చు" లింకును నొక్కాడు.
  • బాబు కూడా అదే పేజీ లోని "మార్చు" లింకును నొక్కాడు.
  • రవి తను చెయ్యదలచిన మార్పుచేర్పులు చేసేసి "పేజీ భద్రపరచు" నొక్కి పేజీని భద్రపరచాడు. అంటే పేజీ రవి చేసిన మార్పులతో భద్రమైంది.
  • ఇప్పుడు బాబు తను చెయ్యదలచిన మార్పుచేర్పులు పూర్తి చేసి, "పేజీ భద్రపరచు" నొక్కాడు. ఇప్పుడు బాబుకు "దిద్దుబాటు ఘర్షణ" పేజీ కనిపిస్తుంది.

దిద్దుబాటు ఘర్షణ పేజీ ఎలా ఉంటుంది మార్చు

రవికి సంబంధించిన కూర్పు యొక్క పూర్తి పేజీ పైన కనిపిస్తుంది. బాబు చేసేది విభాగం దిద్దుబాటు అయినా ఇది కనిపిస్తుంది.

కింద, బాబు సమర్పించబోయే టెక్స్టు కనిపిస్తుంది. ఇది బాబు పూర్తి పేజీని దిద్దుబాటు చేసి ఉంటే బాబుకు చెందిన పూర్తి పేజీ కూర్పు, లేదా బాబు విభాగాన్ని మాత్రమే మార్చి ఉంటే, సదరు విభాగపు కూర్పు.

మధ్యలో రెండు టెక్స్టుల మధ్య గల తేడాలు కనిపిస్తాయి. బాబు దిద్దుబాటు చేస్తున్న విభాగానికి సంబంధించి బాబు చేసిన మార్పులు, రవి చేసిన మార్పులు ఇక్కడ కనిపిస్తాయి. ఒకవేళ ఇద్దరూ ఒకేలా మార్పులు చేసి ఉంటే అవి కనిపించవు. ఇతర విభాగాలకు చెందిన పూర్తి టెక్స్టు కనిపిస్తుంది.

బాబు పైనున్న టెక్స్టులో దిద్దుబాట్లు చేసి, భద్రపరుచు నొక్కవచ్చు. బాబు చేస్తున్నది విభాగం దిద్దుబాటు అయిన పక్షంలో, ఇది ఆ విభాగపు కొత్త కూర్పుగా భావించబడుతుంది. అంచేత ఇతర విభాగాలకు డూప్లికేటు కూర్పులు తయారవుతాయి. ఒకవేళ భద్రపరచే ముందు బాబు మిగతా విభాగాలను తొలగిస్తే ఇలా జరగదు. (ఇది సాఫ్టువేరులో ఉన్న లోపం. త్వరలో సరి చేస్తారు). ఉత్తమమైన మార్గం ఏంటంటే బాబు తన కొత్త టెక్స్టును క్లిప్ బోర్డు లోకి కాపీ చేసుకుని, దిద్దుబాటును రద్దు చేసి, మళ్ళీ వ్యాసపు మార్చు లింకు నొక్కి, తన దిద్దుబాటును భద్రపరచడం.

ఒక్కోసారి, సిస్టము నెమ్మదిగా ఉన్నపుడు సభ్యుడు చేసిన మార్పులు భద్రపరచడంలో ఆలస్యం కావచ్చును. ఈ లోగా అదే సభ్యుడు మళ్ళీ మరో మార్పు చేసి, మళ్ళీ భద్రపరుచు నొక్కితే తనతో తానే దిద్దుబాటు ఘర్షణ తెచ్చుకున్నట్టు అవుతుంది. ఈ కేసులో పైన కనిపించేది ముందు చేసిన దిద్దుబాటు కాదు, పాత టెక్స్టు. అంటే ముందు చేసిన దిద్దుబాటును సిస్టము గమనించింది గానీ, దాన్నింకా భద్రపరచలేదన్నమాట. ఓ క్షణం తరువాత, మీరు దిద్దుబాటు ఘర్షణ పేజీ చూస్తూ ఉండగా, మొదటి దిద్దుబాటును భద్రపరుస్తుంది. అంటే అప్పుడు పైన కనిపిస్తున్న టెక్స్టు ప్రస్తుత కూర్పు కాదన్నమాట.

దిద్దుబాటు ఘర్షణను పరిష్కరించడం మార్చు

బాబు చేసినవి చిన్న మార్పులే అయితే, రవి చేసినవి పెద్ద మార్పులు అయితే, బాబు రవి కూర్పులోనే తన దిద్దుబాట్లు చేసి, రెంటినీ విలీనం చెయ్యవచ్చు. దిద్దుబాటు సారాంశంలో "దిద్దుబాటు ఘర్షణ ద్వారా" అని చేరిస్తే, రవికీ, ఇతరులకూ కూడా బాబు చేసిన పని తెలుస్తుంది. ఈ విలీనం చేసే క్రమంలో తేడాలేమన్నా జరిగాయేమోనని రవి చూసుకోవచ్చు.

బాబు చేసినవి పెద్ద మార్పులై, రవి చేసినవి చిన్న మార్పులు అయితే, తన కూర్పులోనే పని చెయ్యవచ్చు. ఒక పద్ధతి ఏంటంటే.. కింద ఉన్న టెక్స్టును కాపీ చేసి, పైన ఉన్న టెక్స్టులో పెట్టడం. సముచితమైన దిద్దుబాటు సారాంశాన్ని ఇవ్వాలి. ఆ తరువాత బాబు పేజీ చరితాన్ని చూసి, రవి చేసిన మార్పులేవో నిర్ధారించుకుని, మరోసారి దిద్దుబాటు చేసి, వాటిని తన కూర్పులో కూడా చేర్చవచ్చు.

బాబూ, రవీ ఇద్దరూ పెద్ద మార్పులే చేసి ఉంటే, అది పెద్ద సమస్యే. అప్పుడు ఇలా చెయ్యవచ్చు. బాబు తన మార్పు చేర్పులను భద్రపరచాలి. ఆ తరువాత రవి, బాబు ఇద్దరూ కలిసి, ఏది మంచి కూర్పో నిర్ణయించుకోవాలి.

రవి చేసిన మర్పులను రద్దు చేస్తూ బాబు తన మార్పుచేర్పులను భద్రపరచి ఊరుకోకూడదు. పొరపాట్లు జరుగుతాయి, కానీ అది అలవాటు కాకూడదు.

తార్కిక దిద్దుబాటు ఘర్షణలు మార్చు

(దిద్దుబాటు ఘర్షణ సందేశం చూపించే యంత్రాంగానికి అందని దిద్దుబాటు ఘర్షణలను "తార్కిక దిద్దుబాటు ఘర్షణ" అంటారు.) కొంతమంది తమ దిద్దుబాట్లను వికీ ఎడిటరులో చెయ్యరు. వ్యాసాన్ని బయటి ఎడిటరులోకి కాపీ చేసుకుని, అనేక మార్పుచేర్పులు చేసి, మొత్తం వ్యాసాన్ని మళ్ళీ వికీ ఎడిటరులోకి కాపీ చేసి, భద్రపరుస్తారు. ఈ లోపు మరెవరైనా వ్యాసంలో మార్పులు చేసి ఉంటే అవి రద్దయ్యే అవకాశం ఉంది. ఈ విషంగా బయటి ఎడిటరులో దిద్దుబాటు చేసేవారు ఇలా చెయ్యాలి:

  • వ్యాసాన్ని ఏ వికీ ఎడిట్ పెట్టె నుండి కాపీ చేసుకున్నారో, దిద్దుబాట్ల తరువాత, మళ్ళీ అదే ఎడిట్ పెట్టెలోకే పేస్టు చేసి, భద్రపరచండి. లేదా
  • పేజీ చరితాన్ని చూసి, మార్పులను విలీనం చెయ్యండి.

పొరపాట్లు మార్చు

విలీనం చేసటపుడు కొన్నిసార్లు పొరపాట్లు జరగవచ్చు. బాబు విలీనం చేసే సమయంలో రవి చేసిన మార్పులు వెనక్కిపోవచ్చు. ఈ తార్కిక ఘర్షణలు వెంటనే తెలిసిపోయేవి కావు. అలాంటి సందర్భాల్లో ఇద్దరూ కలిసి సమస్యను పరిష్కరించుకోవాలి.

రవి ఏదైనా చిన్న మార్పు చేసాడనుకుందాం. బాబు పొరపాటున దాన్ని వెనక్కు తీసికెళ్ళాడనుకుందాం. తాను చేసిన చిన్న మార్పులను రక్షించుకునేందుకో, లేదా బాబు చేసిన పొరపాటుకు అతన్ని శిక్షించే ఉద్దేశ్యంతోనో బాబు చేసినవి పెద్ద మార్పులని కూడా చూడకుండా రవి మళ్ళీ వెనక్కు తీసుకెళ్ళ కూడదు. అది ఎంత మాత్రమూ సమ్మతం కాదు. మరీ ముఖ్యంగా, వీళ్ళిద్దరి దిద్దుబాట్ల తరువాత వేరే సభ్యులు కూడా మరి కొన్ని దిద్దుబాట్లు చేసిన సందర్భంలో అసలు చెయ్యనే కూడదు.

ఇలాంటి సందర్భంలో రవి ఇలా చెయ్యాలి: బాబు చేసిన పెద్ద మార్పులను అలాగే ఉంచి, తాను మొదట చేసిన మార్పులను మళ్ళీ బాబు కూర్పులో చేసి భద్రపరచాలి. దిద్దుబాటు సారాంశంలో రవి ఈ సంగతిని రాయాలి, ఇలాగ: "బాబు పొరపాటున రద్దు చేసిన గత మార్పులను మళ్ళీ చేసాను". బాబు రవికి సారీ చెబితే సరిపోతుంది..

బాబు అదే పొరపాటు మళ్ళీ చేస్తే, రవి స్నేహపూర్వకంగా ఆ పొరపాటును ఎత్తిచూపి, భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. కొత్తవారి విషయంలో మరింత అనునయంగా ఉండాలి. దిద్దుబాటు ఘర్షణ అనేది పాతవారికే తొందరగా కొరుకుడు పడని విషయం మరి.

వెనక్కి తీసుకుపోవడం మార్చు

పేజీని పూర్వపు కూర్పుకు తీసుకుపోయేటపుడు, లేదా పాత కూర్పులో కొత్త మార్పులు చేసి భద్రపరచేటపుడు దిద్దుబాటు ఘర్షణ సందేశం కనిపించదు. సరిగ్గా అదే సమయంలో ఇతర సభ్యులు కూడా మార్పులు జరిపితే, అది కూడా ఆటోమాటిగ్గా రద్దవుతుంది. దీన్ని నివారించేందుకు, పాత కూర్పు టెక్స్టును కొత్త కూర్పు ఎడిట్ పెట్టెలోకి కాపీ చేసుకుని దిద్దుబాట్లు చేసుకోవాలి.

నివారణ మార్చు

దిద్దుబాటు ఘర్షణలు చిరాకెత్తిస్తాయి. దిద్దుబాటు అలవాట్లను కాస్త మార్చుకుని ఈ ఘర్షణలను తగ్గించవచ్చు. ఉదాహరణకు ఇటీవలి కాలంలో దిద్దుబాట్లు జరగని పేజీలను ఎంచుకుని ఇద్దుబాట్లు చెయ్యడం.

అనేక చిన్నచిన్న మార్పులు చేసే బదులు ఒకే పెద్ద మార్పు చెయ్యడం. దీనితో మీ వలన ఇతరులకు దిద్దుబాటు ఘర్షణలు తలెత్తే అవకాశం తగ్గుతుంది. కానీ మీకు ఘర్షణలు తలెత్తే అవకాశం పెరుగుతుంది. "సరిచూడు" లింకు కొంత వరకు ఉపయోగపడుతుంది.