స్టాప్ మోషన్ యానిమేషన్

స్టాప్ మోషన్ యానిమేషన్ ఒక్కొక్క కదలికని ఆపుతూ (frame-by-frame) చిత్రీకరణ (Stop motion). ఇది ఒక యానిమేషన్ విధానం. ఒక వస్తువును కొంచెం కదిపి, ఆపి, ఫొటో తీసి, మళ్ళీ కొంచెం కదిపి, ఫొటో తీసి .. ఇలా చేస్తూ సాధించే సాంకేతిక ప్రక్రియే "స్టాప్ మోడన్ యానిమేషన్". ఇలా చేసిపుడు ఆ వస్తువు నిజంగా కదులుతున్న ఎఫెక్ట్ వస్తుంది. ఈ టెక్నిక్‌ను క్లే యానిమేషన్‌లో సాధారణంగా వాడుతారు. ఎందుకంటే మెత్తని మట్టి బొమ్మల అవయవాలను కొంచెం కొంచెంగా కదపడం సులభం.

స్టాప్ మోషన్ విధానంలో నాణెం కదలికల చిత్రం
Mary and Gretel (1916)


పిల్లల చిత్రాలు, టెలివిజన్ రూపకాలలో ఇలాంటి టెక్నిక్ సర్వ సాధారణం. "గంబీ" (Gumby) అనేది ఈ తరహా చిత్రాలలో ప్రసిద్ధిచెందింది. కొన్ని టెక్నిక్‌లలో ఆ మట్టిబొమ్మ షేపు ఒకో ఫ్రేములోను మారుతుంది. దీనిని "freeform" clay animation అంటారు. మరొక విధానంలో బొమ్మ షేపులు పెద్దగా మారవు. దీనిని "character" clay animation అంటారు.

ఉపకరణాలు

  • బంక మట్టి (China clay)
  • బొమ్మలు (Toys)
  • వస్తువులు (Objects)
  • కాగితం (Paper)
  • పెన్సిల్ (Pencil)
  • కలం (Pen)
  • రంగులు (Color)
  • చిత్రీకరణకి కావలసిన బల్ల (Drawing Table)
  • తుడిపివేతకి కావలసిన రబ్బర్ (Eraser)
  • యానిమేషన్ పరిజ్ఞానం, చిత్రీకరణ తెలిసిన నిపుణులు (Knowledge in Animation & Art)
  • కథ (Story)
  • మాటలు (Dialogues)
  • పాటలు (Songs)
  • సంగీతం (Music)
  • కూర్పరి(Editor)
  • దర్శకుడు లేదా దర్శకురాలు (Director)
  • కెమేరా (Camera)
  • విడుదల చేసే ప్రింట్ (Release print)

ఇతర ఉపకరణాలు

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు