హెలీనా బ్లావట్‌స్కీ

హెలీనా బ్లావట్‌స్కీ (ఆగస్టు 12, 1831 - మే 8, 1891) లేదా మేడమ్ బ్లావట్‌స్కీ రష్యా దేశానికి చెందిన మార్మికురాలు. ఈమె మరికొంతమందితో కలిసి 1875 లో దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించింది. ఈమె రష్యా సమాజంలోని కులీన వర్గంలో జన్మించింది. ఈమె చాలావరకు సొంతంగానే చదువుకుంది. బాల్యంలో ఆ సామ్రాజ్యం అంతా తిరిగింది. టీనేజిలో ఉండగానే పాశ్చాత్య మార్మికత వైపు ఆకర్షితురాలైంది. ఆమె తరువాత వెల్లడించిన వివరాల ప్రకారం 1849లో యూరప్, అమెరికా, భారతదేశాల్లో పర్యటించింది. ఈపర్యటనల్లో ఆమె పురాతన ఆధ్యాత్మిక వేత్తలను కొంతమందిని కలిసినట్లు పేర్కొనింది. వారు ఆమె టిబెట్ లో షిగట్సే కు వెళ్ళి ఆధ్యాత్మిక, తాత్విక, విజ్ఞానశాస్త్ర రహస్యాలను గ్రహించమని ఆదేశించారు.

హెలీనా బ్లావట్‌స్కీ
1877 లో బ్లావట్‌స్కీ
జననంఎలీనా పెట్రోవా వాన్ హాన్
12 August [O.S. 31 July] 1831
Yekaterinoslav, Yekaterinoslav Governorate, Russian Empire
మరణం1891 మే 8(1891-05-08) (వయసు 59)
లండన్, England
యుగం
  • ఆధునిక తత్వశాస్త్రం
    • 19వ శతాబ్దపు తత్వశాస్త్రం
ప్రాంతంరష్యన్ తత్వశాస్త్రం
తత్వ శాస్త్ర పాఠశాలలుదివ్యజ్ఞాన సమాజం
ప్రధాన అభిరుచులు
  • మార్మికత
  • మత తత్వం
సంస్థలుదివ్యజ్ఞాన సమాజం
ప్రసిద్ధ ప్రసిద్ధ ఆలోచనలు
ప్రభావితులు
ప్రభావితమైనవారు

ఆమె సమకాలికులైన విమర్శకులు, తర్వాత ఆమె జీవిత చరిత్ర రాసిన వారు ఈమె పేర్కొన్న ప్రపంచ పర్యటనలు అన్నీ లేదా కొన్ని కల్పితమై ఉండచ్చని, ఆ సమయంలో ఆమె యూరప్ లోనే ఉందని పేర్కొన్నారు. 1870 దశకంలో ఆమె ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించింది.

మూలాలు మార్చు

  1. Edward Bulwer-Lytton, The Coming Race, Introduction by David Seed, Wesleyan University Press, 2007, p. xlii.
  2. Brian Stableford, The A to Z of Fantasy Literature, Scarecrow Press, 2009, "Blavatsky, Madame (1831–1991)".
  3. Carlson, Maria (2015). No Religion Higher Than Truth: A History of the Theosophical Movement in Russia, 1875–1922. p. 33. ISBN 978-0-691-60781-8.