అంకుల్ (2018)
అంకుల్ 2018 లో విడుదల అయిన తెలుగు సినిమా. జాయ్ మాథ్యూ, సజయ్ సెబాస్టియన్ నిర్మించిన ఈ చిత్రానికి గిరీష్ దామోదర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మమ్ముట్టి, కార్తీక మురళీధరన్ నటించారు.[1] ఇది మలయాళ సినిమా "అంకుల్ (మై డాడ్'స్ ఫ్రెండ్)" కు అనువాదం.
అంకుల్ | |
---|---|
దర్శకత్వం | గిరీష్ దామోదర్ |
రచన | జాయ్ మాథ్యూ |
స్క్రీన్ ప్లే | జాయ్ మాథ్యూ |
నిర్మాత | జాయ్ మాథ్యూ సజయ్ సెబాస్టియన్ |
తారాగణం | మమ్ముట్టి, కార్తీక మురళీధరన్, ముత్తుమణి |
ఛాయాగ్రహణం | అళగప్పన్ ఎన్. |
సంగీతం | బిజిబాల్ |
నిర్మాణ సంస్థలు | ఎస్.జె ఫిల్మ్స్, అబ్రా మూవీస్ |
విడుదల తేదీ | 27 ఏప్రిల్ 2018 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- మమ్ముట్టి
- ముత్తుమణి
- కార్తీక మురళీధరన్
- జాయ్ మాథ్యూ
- సురేష్ కృష్ణ
- గణపతి ఎస్. పొదువాల్
- మేఘనాథన్
- కైలాష్
- జెన్నిఫర్ ఆంటోనీ
కథ
మార్చుశ్రుతి ఊటీలోని కాలేజీలో చదువుతుంది. అక్కడ స్ట్రైక్‌ల కారణంగా కాలేజ్ మూసివేస్తారు. అప్పుడు ఆమె హైదరాబాద్ లోని తన ఇంటికి తిరిగి వెళ్లాలనుకుంటుంది. అనుకోకుండా ఆమె, తన తండ్రి స్నేహితుడైన కృష్ణకుమార్ (కెకె)ని కలుస్తుంది. ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెపుతాడు. వేరే దారి లేక ఆమె అయిష్టంగానే అతనితో వెళ్తుంది. ఈ 6 గంటల ప్రయాణంలో, శృతి అతన్ని "అంకుల్" అని పిలుస్తుంది.ఈ ట్రిప్ అంతటా అనుమానాస్పద కాల్స్, అనుమానాస్పద వ్యక్తులతో మాట్లాడటం వలన శ్రుతి భయపడుతుంది.[2] వాళ్ళు వెళ్లే దారిలో ఉన్న సరస్సును చూడాలని అని శృతి అనుకుంటుంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటుండగా వాళ్ళను అక్కడి గ్రామస్తులు పోలీసులకు అప్పచెపుతారు. ఆ తరువాత ఏమి జరుగుతుంది వాళ్ళు ఎలా ఇంటికి వెళ్లారు అనేది మిగతా కథ.[3]
పాటలు
మార్చు- ఎదో హాయ్ తాకెను నన్ను
మూలాలు
మార్చు- ↑ "Uncle teaser: This Mammootty film promises to be an engaging thriller". The Indian Express. 2018-04-11. Retrieved 2022-07-01.
- ↑ "Uncle movie review: Mammootty is badly miscast in this film". The Indian Express. 2018-04-27. Retrieved 2022-07-01.
- ↑ Uncle Movie Review {4/5}: Mammootty’s Uncle is an engaging tale, retrieved 2022-07-01