ప్రధాన మెనూను తెరువు

అంతర్జాతీయ అణు శక్తి మండలి

అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (International Atomic Energy Agency or IAEA) ప్రపంచంలో అణు శక్తిని శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలాని చెప్పే సంస్థ మరియు అణు ఆయుధాలతో పాటుగా సైనిక వాడకాలను నియంత్రించే సంస్థ. 1957 జూలై 29న IAEAను స్వయం ప్రతిపత్తి కల సంస్థగా స్థాపించారు. స్వయం ప్రతిపత్తిగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఒడంబడికతో నియమించినప్పటికీ, IAEA చట్టం[1] ప్రకారం ఐక్యరాజ్య సర్వసభ్య మండలికి మరియు భద్రతా మండలికి జవాబుదారీగా ఉండవలసిందే.


Flag of IAEA.svg
The IAEA flag
Org typeOrganization
AcronymsIAEA
Headజపాన్Yukiya Amano
StatusActive
Established1957
HeadquartersAustria Vienna, Austria
Websitewww.iaea.org

IAEA ప్రధాన కార్యాలయం వియన్నా, ఆస్ట్రియాలో ఉంది. IAEAకి రెండు ప్రాంతీయ భద్రతా కార్యాలయాలు ఉన్నాయి, అవి టొరంటొ, ఆన్టారియో, కెనడాలో మరియు టోక్యో, జపాన్ లో ఉన్నాయి. IAEAకు రెండు అనుసంధాన కార్యాలయాలు కూడా ఉన్నాయి. అవి న్యూయార్క్ నగరం, న్యూ యార్క్‌లో మరియు జెనివ, స్విట్జెర్లాండ్లో ఉన్నాయి. వాటితోపాటుగా IAEAకి మూడు పరిశోధనాశాలలు ఉన్నాయి, అవి వియన్నా మరియు సైబర్స్డార్ఫ్ ఆస్ట్రియాలో ఇంకా మొనాకోలో ఉన్నాయి.

IAEA ప్రభుత్వాలతో మమేకమై శాస్త్రీయంగా మరియు సాంకేతికంగా ప్రపంచవ్యాప్తంగా అణు పరిజ్ఞానాన్ని మరియు అణు శక్తి శాంతియుత వాడకం కోసం పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకునెందుకు ఒక వేదికలా పాటుపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అణు పరిజ్ఞాన శాంతియుత వినియోగాన్ని పెంపొందించడంలో IAEA అనుసరించే పద్ధతులను ప్రోత్సహిస్తున్నాయి. అంతే కాకుండా అంతర్జాతీయంగా అణు పరిజ్ఞానం మరియు అణు పదార్ధాల దుర్వినియోగం నించి కాపాడతుంది మరియు అణు భద్రతను (అణు ధార్మిక రక్షణ కలుపుకొని) మరియు అణు భద్రతా ప్రమాణాలను వాటి పరిపాలను పెంపొందిస్తుంది.

IAEA మరియు దాని యొక్క పూర్వ సంచాలాకులు అయిన మహమ్మద్ ఎల్ బరాడేలకు సంయుక్తంగా నోబెల్ శాంతి పురస్కారం 2005 అక్టోబరు 7న బహుకరించారు. IAEA ప్రస్తుత ముఖ్య సంచాలాకులు యుకియ అమనో.

చరిత్రసవరించు

 
వియన్నా ఆస్ట్రియాలో 1979 నుండి IAEA ప్రధాన కార్యాలయం

1953లో అమెరికా రాష్ట్రపతి ద్వ్యట్ డి. ఐసన్ హోవర్ ఐక్యరాజ్యసమితి సమావేశంలో తన ప్రఖ్యాత ఆటమ్స్ ఫర్ పీస్ ఉపన్యాసంలో అణు శక్తి కట్టడిని మరియు శాంతియుత ప్రయోజనాల విస్తరణను నియంత్రించడానికి ఒక అంతర్జాతీయ వ్యవస్థను రూపొందించాలాని ప్రతిపాదించారు.[2] సెప్టెంబరు 1954లో, అమెరికా అణు శక్తి లేదా అణు ఆయుధాలలో వాడె ఫిస్సైల్ పదార్ధాలను అధీనంలో ఉంచే అంతర్జాతీయ సంస్థను రూపొందించాలాని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది. ఈ సంస్థ ఒక "అణు నిధిని" ఏర్పరుస్తుంది.

అన్ని విధాలా శాంతియుత అణు దృష్టి కోణాలను తెలియచేయడానికి ఒక అంతర్జాతీయ సాంకేతిక సమ్మేళనాన్ని ఏర్పాటు చేసింది. నవంబరు 1954 కల్లా సోవియట్ యూనియన్ ఏ విధమైన అంతర్జాతీయ అణు పదార్థాల నిధిని ఒప్పుకోదని తెలిసింది. కానీ అణు లావాదేవీలు ఒక క్లియరింగ్ హౌస్ ద్వారా సాధ్యం అవ్వచ్చు అని తెలిపింది. ఆగస్టు 8 నుండి 1955 ఆగస్టు 20లో అణు శక్తి శాంతియుత ఉపయోగాల గురించి ఐక్యరాజ్యసమితి ఒక అంతర్జాతీయ సమ్మేళనాన్ని జెనివ, స్విట్జెర్లాండ్లో నిర్వహించింది. 1956లో IAEA చట్టాలను రూపొందించడానికి సమావేశం జరిగింది. 1957లో జరిగి సమావేశంలో IAEA చట్టాల రూపకల్పన పూర్తి చేసారు.

1986 ప్రథమార్ధంలో చెర్నోబిల్, ఉక్రెయిన్ లో అణు రియాక్టర్ పేలుడు మరియు సంభవించిన విపత్తు కారణంగా IAEA అణు భద్రతను పెంచడానికి తన ప్రయత్నాలను ద్విగినీకృతం చేసింది.

పూర్వ యు.ఎస్.శాసన సభ్యుడు డబ్లు.స్టర్లింగ్ కోల్ IAEA ప్రథమ ముఖ్య సంచాలాకునిగా సేవలు అందించారు. కోల్ గారు ఒక పర్యాయం మాత్రమే సేవలు అందించారు. అటుపిమ్మట IAEAను నలుగు దశాబ్దాలపాటు ఇద్దరు స్వీడన్ దేశస్తులు పాలించారు. వైజ్ఞానికులు అయిన సిగ్వార్డ్ ఎక్లాండ్ 1961 నించి 1981 వరకు పరిపాలించారు. పూర్వ స్వీడన్ విదేశాంగ మంత్రి అయిన హన్స్ బ్లిక్స్ 1981 నుంచి 1997 వరకు సేవలు అందించారు. బ్లిక్స్ వారసునిగా ఈజిప్ట్‌కు చెందిన మహమ్మద్ ఎల్ బరాది డైరెక్టర్ జనరల్ పదవిని చేపట్టారు అయన నవంబరు 2009[3] వరకు సేవలు అందించారు.

2005లో ఎల్ బరాది మరియు IAEAలు సంయుక్తంగా నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారు. ఎల్ బరాది తన స్టాక్ హోం పురస్కార ఉపన్యాసంలో చెప్పింది ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆయుధాలను రూపొందించే వ్యయంలో ఒక్క శాతం మొత్తంతో ప్రపంచం మొత్తానికి ఆహారం అందించచ్చు అని పేర్కొన్నారు. ఒకవేళ స్వీయ వినాశం నుంచి మనము తప్పించుకోవాలి అనుకుంటే అణు ఆయుధాలకి సంఘంలో చోటు ఉండకూడదు మరియు వాటికి మన భద్రతలో కూడా చోటు ఉండకూడదు[4].

2009 జూలై 2న జపాన్‌కి చెందిన యుకియ అమనో సౌత్ ఆఫ్రికాకు చెందిన అబ్దుల్ సమాద మింటి మరియు స్పెయిన్ కు చెందిన లుఇస్ ఇ.ఎచావర్రిని ఓడించి IAEA డైరెక్టర్ జెనరల్ గా ఎన్నుకోబడ్డారు[5]. 2009 జూలై 3న యుకియ అమనో IAEA సర్వసభ్య సమావేశంలో గవర్నర్ మండలి జయజయ ధ్వానాల ద్వారా ఆయన ఎన్నికను ఆమోదించింది. ఆయన 2009 డిసెంబరు 1న పని ప్రారంభించారు[6]. [7][8]

నిర్మాణము మరియు పనితీరుసవరించు

 
IAEA ప్రధాన కార్యాలయాలు

సాధారణసవరించు

సభ్య దేశాల అవసరాలు మరియు ఆసక్తి, వ్యూహాత్మక ఆలోచన మరియు దృష్టి పొందుపరిచిన IAEA చట్టాలకు లోబడి పనిచేస్తుంది. IAEA పనితీరును శాసించే మూడు ముఖ్య స్తంభాలు: భద్రత మరియు రక్షణ; విజ్ఞానం మరియు సాంకేతికత; భద్రత చర్యలు మరియు సోదా.

IAEA ఒక స్వయం ప్రతిపత్తి కల సంస్థ. దీనిని ఐక్యరాజ్యసమితి నియంత్రిన్చనప్పటికీ, సమితి మరియు భద్రత మండలికి జవాబు చెప్పవలసి ఉంటుంది. చాలా మటుకు అంతర్జాతీయ సంస్థల వలె కాకుండా IAEA తన యొక్క చాలా మటుకు పనిని భద్రత మండలితో కలసి పనిచేస్తుంది కానీ ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామజిక మండలితో కాదు. IAEA నిర్మాణము మరియు పనితీరు, దాని ప్రారంభ దస్తావేజులు మరియు చట్టాల పైన ఆధారపడి ఉంటుంది. (కింద చూడండి) IAEA మూడు ముఖ్య భాగాలుగా పనిచేస్తుంది:నిర్వహక మండలి, సాధారణ సభ, మరియు సచివాలయం.

2004లో IAEA క్యాన్సర్ చికిత్స కొరకు ఒక కార్యక్రమం (PACT) అభివృద్ధి పరిచింది. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకనుగుణంగా అణుధార్మిక చికిత్సను అమలుపరచుట, మెరుగుపరచుట లేదా విస్తృత పరచే కార్యక్రమాలు చేపడుతుంది. క్యాన్సర్ బాధితుల[9] జీవితాలను రక్షించడానికి మరియు వారి బాధను తగ్గించడానికి సభ్య దేశాలనించి డబ్బులు సేకరించి వారికి సహాయం చేస్తారు.

"అణు పరిజ్ఞానం, సంకేతికతలను భద్రత, రక్షణ మరియు శాంతియుత వాడకం" కోసమే IAEA మనుగడ సాగిస్తుంది (పిల్లర్స్ 2005). మూడు రకాలైన పద్ధతుల ద్వారా IAEA తమ కార్యక్రమాలను అమలు చేస్తుంది: అణు పరిజ్ఞాన ప్రదేశాలను తనిఖి చేసి అవి శాంతియుత ప్రయోజనాలకే వాడబడుతున్నాయి అని నిర్ధారించడం, సమాచారం ఇచ్చిపుచుకోవడం మరియు భద్రత మరియు రక్షణ ప్రమాణాలను అభివృద్ధి పరచడం, అణు పరిజ్ఞాన శాంతియుత వాడకం పెంపొందించే వివిధ పరిజ్ఞాన నిధిగా వ్యవహరించటం చేస్తుంది.

IAEA సభ్య దేశాల అణు కర్మాగారాల్లో భూకంప రక్షణ వ్యవస్థ పై సమాచర మరియు అనుభవాలను ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను అమలు చేయటానికి 2008లో IAEA అంతర్జాతీయ భూకంప రక్షణ కేంద్రాన్ని ప్రారంబించింది. ఈ కేంద్రం సభ్య దేశాలకు స్థల ఎంపిక, స్థల పరిశీలన, భౌగోళిక ఆకృతిని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించడానికి సహకరిస్తుంది.

పాలకుల మండలిసవరించు

IAEA విధానాలను తయారు చేసే రెండు వ్యవస్థల్లో పాలకుల మండలి ఒకటి. ఈ మండలిలో 13 మంది సభ్యుల ఎన్నిక, పదవీకాలం పూర్తి అయిన 22 మంది సభ్యులచే సర్వసభ్య సమావేశంలో ఎన్నుకోబడుతుంది. పదవీకాలం పూర్తి అయిన సభ్యలు అణు శక్తి పరిజ్ఞానంలో అగ్రస్థానంలో ఉన్న ప్రాంతాలు నుంచి 10 మందిని నియమిస్తారు, మిగతా ముగ్గురిని అణు పరిజ్ఞానంలో అత్యంత శక్తివంతులు అయిన వారు ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, పశ్చిమ యూరోప్, తూర్పు యూరోప్, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య మరియు దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా, పసిఫిక్, మరియు తూర్పు ప్రాంత దేశాలను ప్రాతినిధ్యం వహించని దేశాల నుంచి నియమిస్తారు. ఈ సభ్యుల పదవీకాలం ఒక సంవత్సరం మాత్రమే. సర్వసభ్య సమ్మేళనం 22 మందిని మిగతా దేశాల నుంచి రెండు సంస్వత్సర పదవీకాలం కోసం ఎన్నుకుంటారు. ప్రతి సంవత్సరం 11 మంది ఎన్నుకోబడతారు. ఈ 22 ఎన్నుకోబడిన సభ్యులు భౌగోళిక భిన్నత్వ ఒడంబడికకు ప్రాతినిధ్యం వహించవలసి ఉంటుంది. ప్రస్తుత మండలి సభ్యలు: ఆఫ్ఘనిస్తాన్, అర్జెంటినా, ఆస్ట్రేలియా, అజెర్బైజాన్, బ్రెజిల్, బుర్కినా ఫాసో, కామెరూన్, కెనడా, చైనా, క్యూబా, డెన్మార్క్, ఈజిప్ట్, ఫ్రాన్సు, జర్మనీ, భారతదేశం, జపాన్, కెన్యా, దక్షిణ కొరియా, మలేసియా, మంగోలియా, నేదర్లాండ్స్, న్యూ జిలాండ్, పాకిస్తాన్, పేరు, రోమానియా, రాస్సియన్ ఫెడరేషన్, దక్షిణ ఆఫ్రికా, స్పైన్, స్విట్జర్లాండ్, టర్కీ, యుక్రెయిన్, యునైటెడ్ కింగ్డం, యునైటెడ్ స్టేట్స్, ఉరుగ్వే, మరియు వెనిజులా (IAEA పాలక మండలి 2009-2010).

ఈ మండలి తమ ఐదు వార్షిక సమావేశాల్లో వీలైనన్ని IAEA యొక్క విడి విధానాలను రూపొందించాల్సిన బాధ్యత కలిగి ఉంటుంది. ఈ మండలి సర్వసభ్య సమ్మేళనం కార్యాచరణను మరియు లెక్కలను తయారు చేయవలసి ఉంటుంది. IAEA ప్రమాణాలను ప్రచురించడం మరియు సర్వసభ్య సభ ఆమోదంతో అధ్యక్షులను నియమించడం దీని ప్రముఖ కర్తవ్యం (IAEA మూల సిద్దాంతాలు 2005 ప్రకారం). మండలి సభ్యులకు ఒక వోటు ఉంటుంది. వ్యయానికి సంబంధించిన వ్యవహారాలకు సభ యొక్క 2/3 వంతు మద్దతు ఉండాలి. మిగతా అన్ని వ్యవహారాలు తక్కువ మద్దత్తు ఉన్న చాలాు. ఈ తక్కువ మద్దత్తు ఉన్న వ్యవహారాలకు ఒడంబడిక చేసుకునే అధికారం ఉంటుంది, తదుపరి సభ యొక్క 2/3ల మద్దత్తు అవసరం ఉండొచ్చు. 2/3ల మంది సభ్యులు హాజరీ ఉండవలసిందే (IAEA పాలకుల మండలి 1989).

సర్వ సభ్య సమ్మేళనంసవరించు

ఈ సర్వసభ్య సమ్మేళనం మొత్తం 151 సభ్య దేశాల కలయిక. పాలక మండలి ఆమోదించిన కర్యకలాపాలు మరియు లెక్కలను ఆమోదించడానికి సంవత్సరానికి ఒక సారి సెప్టెంబరులో సమావేశం అవుతుంది. సర్వసభ్య సమ్మేళనం అధ్యక్షుని నియామకాన్ని ఆమోదిస్తుంది మరియు మండలి సమస్యల పైన నివేదిక కోరుతుంది (చట్టం). ప్రతీ సభ్యునకు ఒక ఓటు ఉంటుంది. బడ్జెట్ కేటాయింపులు, చట్ట సవరణ, మరియు సభ్యుని అధికారాల నియంత్రణకు 2/3 సభ మాదత్తు కావాలి. మిగతా వ్యవహారాలకు సాధారణ మద్దతు ఉంటే చాలు. మండలి వలె సర్వసభ సమ్మేళనం మామూలు మద్దతు వ్యవహారాలను 2/3 మద్దతు అవసరము అయ్యే వాటిగా మర్చాచు. ప్రభావవంతం అయిన సమావేశాలు జరిపే వీలుగా సర్వసభ్య సమ్మేళనం అధ్యక్షున్ని ఎన్నుకుంటుంది. అధ్యక్షుడు ఆ సమయంలోనే సేవలు అందిస్తారు.

సర్వసభ్య సభ యొక్క ముఖ్య కార్యం ప్రస్తుత సమస్యలు మరియు విధనాల గురించి చర్చా వేదికగా ఉండడం. IAEAకు చెందిన ఏ విభాగం అయినా, అధ్యక్షులు, మండలి లేదా సభ్య దేశాలు ఎవరైనా, సమస్యలను సర్వసభ్య సమ్మేళనంలో చర్చించవచ్చు. సభ్య సమ్మేళనం యొక్క ఈ ధర్మం ఐక్యరాజ్యసమితి యొక్క సాధారణ సభతో సమానం.

సచివాలయంసవరించు

సచివాలయం సాధారణ సేవ సిబ్బంది మరియు నిపుణుల ఉండే చోటు. సచివాలయాన్ని డైరెక్టర్ జనరల్ నియంత్రిస్తారు. మండలిలో మరియు సర్వసభ్య సమ్మేళనంలో తీసుకున్న నిర్ణయాలను అమలుపరిచే అధికారం డైరెక్టర్ జనరల్ కు ఉంటుంది.ఈ డైరెక్టర్ జనరల్ ని మండలి ఎంపిక చేస్తుంది మరియు సర్వసభ్య సమ్మేళనం ఆమోదంతో పునర్నియామకం నాలుగు పర్యాయాలు ఎన్నుకోవచ్చు. IAEA విధానాలు అయిన అణు శక్తి, అణు భద్రత మరియు రక్షణ, అణు శాస్త్ర వినియోగం, పరిజ్ఞాన భద్రత, సాంకేతిక సహకారం మరియు నిర్వహణ నిర్వహించడానికి ఈ సంస్థలో ఆరు విభాగాలు ఉంటాయి. ఈ విభాగాల పనితీరును డైరెక్టర్ జనరల్ పర్యవేక్షిస్తారు.

IAEA బడ్జెట్ రెండు భాగాలుగా ఉంటుంది. సాధారణ బడ్జెట్ IAEA సభ్య దేశాలలోని వివిధ కార్యక్రమాల ఖర్చుల కోసం వెచ్చిస్తారు (2009లో 296 మిలియన్ యూరోలు). సాంకేతిక సహకార నిధిని దాతల ద్వారా సేకరిస్తారు, ఇది సాధారణంగా 85 మిలియన్ డాలర్లు ఉంటుంది.

సభ్యత్వంసవరించు

 
IAEA సభ్య దేశాలు

IAEAలో చేరడం చాలా సులభం.[10] మాములుగా ఒక దేశం చేరాలనే కోరికను డైరెక్టర్ జనరల్ కి తెలుపుతుంది, తదుపరి ఆ అభ్యర్ధనను మండలి పరిశీలనకు డైరెక్టర్ సమర్పిస్తారు. ఒకవేళ మండలి ఆమోదం తెలిపినట్లు అయితే సర్వసభ్య సమావేశం కూడా అభ్యర్ధనను ఆమోదిస్తుంది, తదుపరి ఆ దేశం IAEA చట్టాలను అమలు పరుస్తామని ఒప్పందం చేయవలసి ఉంటుంది. ఆ ఒప్పంద ప్రతులను IAEA చట్టాలను ఉంచే ప్రభుత్వం అమెరికా వద్ద దాఖిలా చేయవలసి ఉంటుంది. ఆ దేశం సభ్యురాలిగా పరిగనించబడుతుంది మరియు ఆమోద పత్రం దాఖలా చేయబడుతుంది. అమెరికా IAEAకు సమాచారం ఇస్తుంది, మిగత సభ్యులకు IAEA తెలుపుతుంది.

151 సభ్య దేశాలు IAEAలో నమోదు కాబడి ఉన్నాయి. చాలా మటుకు ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు మరియు హోలీ సి IAEAలో సభ్య దేశాలు.

సభ్యత్వం లేని దేశాలు:

కుక్ ద్వీపం మరియు నియులు ఐక్యరాజ్యసమితి సభ్యులు కారు. న్యూజిలాండ్‌తో ఉన్న అనుబంధం మరియు నియమిత సర్వధికారం వల్ల సభ్యులు కాలేకపోయారు. వీటికి తోడు పరిమిత గుర్తింపు కలిగిన చిన్న రాజ్యాలు (ఐక్యరాజ్యసమితి సభ్యత్వం లేని రాజ్యాలు) IAEA సభ్య దేశాలు కావు. పైన పేర్కొన్న సభ్యులు కాని దేశాలలో నాలుగు దేశాల సభ్యత్వం వాటి అంగీకార పత్రాల దాఖలా అనంతరం ఖరారు అవుతుంది: కేప్ వర్డె, పపువా న్యూ గినియా, రువాండా, మరియు టోగో.

IAEA నించి రెండు దేశాలు తమ సభ్యత్వాలను ఉపసంహరించుకున్నాయి. ఉత్తర కొరియా 1974-1994 వరకు సభ్యత్వం కలిగి ఉంది. ఎప్పుడైతే మండలి చట్టాలను అంగీకరించడం లేదని కనుగొన్నారో అప్పుడు ఉత్తర కొరియా సాంకేతిక సహకారం తాత్కాలికంగా విరమించారు. అప్పుడు ఆ దేశం తమ సభ్యత్వం ఉపసంహరించుకుంది. 1958లో కంబోడియా సభ్యత్వం స్వీకరించి తరువాత 2003లో ఉపసంహరించుకొని మరల 2009లో సభ్యత్వం తీసుకుంది.

డైరెక్టర్ జెనెరల్ జాబితాసవరించు

డబ్లు.స్టెర్లింగ్ కోల్   అమెరికా 1957–1961
సిగ్వార్డ్ ఎక్లాండ్   స్వీడన్ 1961–1981
హన్స్ బ్లిక్స్   స్వీడన్ 1981–1997
మొహమ్మద్ ఎల్ బరాడి   ఈజిప్ట్ 1997 – Nov 2009
యుకియ అమనో   జపాన్ డిసెంబరు 2009 నుండి ప్రస్తుతం వరకు.

వీటిని కూడా చూడండిసవరించు

 • అణు ఉగ్రవాదాన్ని ఎదుర్కునేందుకు ప్రపంచ ప్రయత్నాలు.
 • IAEA పరిధి.
 • అణు పదార్ధాల నిర్వహణ పీఠము.
 • అణు ఆయుధాలను పెంచకుండా ఉండే ఒడంబడిక.
 • బడ్జెట్ కార్యక్రమాలు
 • క్యాన్సర్ చికిత్స కార్యాచరణ
 • అణు ఆయుధాల రక్షణ జాగ్రత్తలు
 • ఐక్యరాజ్యసమితి అణు శక్తి సంఘం
 • అణు శక్తి సంస్థ
 • అంతర్జాతీయ అణు విద్యుత్ సంస్థ
 • అణు పరిశోధనలకు ఐరోపా మండలి
 • అణు వైపరీత్యాలు మరియు అణు ధార్మికత సంఘటనల జాబితా

సూచనలుసవరించు

గమనికలుసవరించు

 1. IAEA చట్టాలు
 2. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ చరిత్ర: మొదటి నలభై సంవత్సరాలు[1], డేవిడ్ ఫిషర్,1997, ISBN 92-0-102397-9
 3. "IAEA గురించి:పూర్వ డైరెక్టర్ జెనరల్," IAEA, http://www.iaea.org/About/dg/former_dgs.html
 4. డైరెక్టర్ జెనెరల్ యొక్క ప్రకటనలు
 5. "Japanese Diplomat Elected U.N. Nuclear Chief". The New York Times. 2009-07-02.
 6. "Amano in the frame for IAEA leadership". World Nuclear News. 2009-07-02. Retrieved 2009-07-02. Cite news requires |newspaper= (help)
 7. "Yukiya Amano says 'very pleased' at IAEA election". The News. 2009-07-02. Retrieved 2009-07-02. Cite news requires |newspaper= (help)[dead link]
 8. "Japan envoy wins UN nuclear post". BBC. 2009-07-02. Retrieved 2009-07-02. Cite news requires |newspaper= (help)
 9. కాన్సర్ చికిత్స కొరకు ప్రణాళిక
 10. IAEA సభ్యత్వ నమోదు విధానం

ఉదహరించిన కార్యక్రమాలుసవరించు

బాహ్య లింకులుసవరించు