అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలుసవరించు
- హైదరాబాదు కార్పోరేషన్‌లోని కొన్ని భాగాలు
- ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంతం
ఎన్నికైన శాసనసభ్యులుసవరించు
Year | A. C. No. | అసెంబ్లీ నియోజిక వర్గము | Type of A.C. | గెలిచిన అభ్యార్ది పేరు | Gender | Party | Votes | Runner UP | Gender | Party | Votes |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2014 | 59 | అంబర్ పేట్ | GEN | జి.కిషన్ రెడ్డి | పురుష | భారతీయ జనతా పార్టీ | 81430 | ఆదెల సుధాకర్ రెడ్డి | పురుష | తెలంగాణ రాష్ట్ర సమితి | 18832 |
2009 | 59 | అంబర్ పేట్ | GEN | జి.కిషన్ రెడ్డి | పురుష | భారతీయ జనతా పార్టీ | 59134 | మహమ్మద్ ఫరీదుద్దిన్ | పురుష | భారతీయ జాతీయ కాంగ్రెస్ | 31891 |
2009 ఎన్నికలుసవరించు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున జి.కిషన్ రెడ్డి పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి ఫరీదుద్దీన్ పోటీచేశాడు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జి, కిషన్ రెడ్డి తన సమిప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి ఫరీదుద్దీన్ పై 27వేలకుపైగా ఓట్ల మెజారిటీతో[2] విజయం సాధించి రెండో పర్యాయమ్ శాసనసభలో అడుగుపెట్టాడు.
నియోజకవర్గ ప్రముఖులుసవరించు
జి.కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత.1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి 2010 మార్చి 6న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2009లో అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికై వరుసగా రెండోపర్యాయం రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.