అఖిలేష్ యాదవ్
అఖిలేష్ యాదవ్ (pronunciation (help·info) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అఖిలేష్ యాదవ్ 2022 ఎన్నికల్లో కర్హాల్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు.
అఖిలేష్ యాదవ్ | |||
| |||
సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు[1]
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1 జనవరి 2017 | |||
ముందు | ములాయం సింగ్ యాదవ్ | ||
---|---|---|---|
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర 21వ ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 15 మార్చి 2012 – 19 మార్చి 2017 | |||
గవర్నరు | రామ్ నాయక్ అజిజ్ క్కురేషి బన్వారి లాల్ జోషి | ||
ముందు | మాయావతి | ||
తరువాత | యోగి ఆదిత్యనాథ్ | ||
లోక్ సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 మే 2019 | |||
ముందు | ములాయం సింగ్ యాదవ్ | ||
నియోజకవర్గం | అజంగఢ్ | ||
పదవీ కాలం 2000 – 2012 | |||
ముందు | ములాయం సింగ్ యాదవ్ | ||
తరువాత | డింపుల్ యాదవ్ | ||
నియోజకవర్గం | కన్నౌజ్ | ||
శాసనమండలి సభ్యుడు
| |||
పదవీ కాలం 2012 – 2018 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సైఫాయి, ఇటావా జిల్లా, ఉత్తర ప్రదేశ్,భారతదేశం | 1973 జూలై 1||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | సమాజ్‌వాది పార్టీ | ||
జీవిత భాగస్వామి | డింపుల్ యాదవ్ | ||
సంతానం | 3 | ||
నివాసం | 1 విక్రమాదిత్య మార్గ్ , లక్నో, ఉత్తర ప్రదేశ్[2] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జననం, విద్యాభాస్యం
మార్చుఅఖిలేష్ యాదవ్ 1973 జూలై 1న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఇటావా జిల్లా, సైఫాయ్ గ్రామంలో ములాయం సింగ్ యాదవ్, మాల్తీ దేవి దంపతులకు జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం ఇటావాలోని సెయింట్ మేరీస్ స్కూల్‌లో తరువాత రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ మిలిటరీ స్కూల్‌లో పదవ తరగతి పూర్తి చేసి, మైసూరు విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీని ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ నుండి ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు.
వివాహం
మార్చుఅఖిలేష్ యాదవ్ 1999 నవంబరు 24న డింపుల్ యాదవ్‌ను వివాహం చేసుకున్నాడు. వారికీ ఇద్దరు కుమార్తెలు అదితి, టీనా ఒక కుమారుడు అర్జున్ ఉన్నారు.[3]
రాజకీయ జీవితం
మార్చుఅఖిలేష్ యాదవ్ 2000లో లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో సమాజ్ వాదీ పార్టీ తరపున కన్నౌజ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి, గెలిచి తొలిసారి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన తరువాత 2004లో రెండోసారి, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ & ఫిరోజాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల నుండి పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించాడు. అఖిలేష్ ఆ తర్వాత ఫిరోజాబాద్ సీటుకు రాజీనామా చేశాడు.
అఖిలేష్ యాదవ్ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ గెలుపులో కీలకంగా పనిచేశాడు. సమాజ్‌వాదీ పార్టీ 224 సీట్లు గెలుచుకొని ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిరావడంతో ఆయన 2012 మే 3న కన్నౌజ్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసి 2012 మార్చి 15న రాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాడు. ఆయన 2012 మే 5న ఉత్తర ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అఖిలేష్ యాదవ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో అజంగఢ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి నాలుగోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[4]
అఖిలేష్ యాదవ్ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కర్హల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, ఎస్‌పీ శాసనసభపక్షనేతగా, ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[5] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికై[6] ఆ తరువాత జూన్ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు.[7][8]
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (29 September 2022). "ఎస్పీ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ ఎన్నిక". Archived from the original on 1 October 2022. Retrieved 1 October 2022.
- ↑ "CM moves to new residence at Vikramaditya Marg". Daily Pioneer. 8 October 2016. Retrieved 5 April 2017.
- ↑ Free Press Journal (30 May 2019). "The love-story of Akhilesh and Dimple Yadav: A drama made for the movies" (in ఇంగ్లీష్). Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
- ↑ TV9 Telugu (17 January 2022). "తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయ యాత్ర సాగిస్తున్న అఖిలేష్ యాదవ్ ప్రస్థానం..!". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (26 March 2022). "యూపీ ప్రతిపక్ష నేతగా అఖిలేష్ యాదవ్.. ఎస్పీ సమావేశంలో కీలక నిర్ణయం." Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Economic Times (6 June 2024). "Bullish Wins & Bearish Losses: Here are the key contests and results of 2024 Lok Sabha polls". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ The Hindu (12 June 2024). "Akhilesh Yadav resigns as MLA from U.P. Assembly, will represent Kannauj in Lok Sabha" (in Indian English). Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ Andhrajyothy (12 June 2024). "అసెంబ్లీకి రాజీనామా చేసిన అఖిలేష్ యాదవ్, అయోధ్య ఎంపీ". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.