అజయ్ కానూ అలియాస్ రవి బీహార్‌లో పీపుల్స్‌వార్ అగ్ర నాయకుడు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈయన ఆంధ్ర ప్రదేశ్కి చెందిన వాడు. జహానాబాద్, అద్వాల్, గయ, పాట్నా జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహించేవాడు. అనేకమంది పోలీసు సిబ్బందిని అతడు హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. అతడిపై రూ.2,50,000 రివార్డు ఉండేది. 2003లో పోలీసులు అతణ్ని పట్టుకుని బీహార్‌లోని బ్యూర్ జైలులో ఉంచారు. అదే సమయంలో అగ్రకులాల ప్రైవేటు సైన్యం 'రణబీర్ సేన' నాయకుడు బర్మేశ్వర్ కూడా అరెస్టయి అదే జైలులో ఉన్నాడు. బర్మేశ్వర్‌కు రాచమర్యాదలు చేసిన జైలు అధికారులు కానూను చిత్రహింసలు పెట్టారని, అతడికి సంకెళ్లు వేసి బంధించి ఉంచుతున్నారని అప్పట్లో పత్రికల్లో వార్తలు వచ్చాయి. కానూ బ్యూర్ జైలులో ఉన్న సమయంలో ఆ జైలులో అలజడి చెలరేగింది. పీపుల్స్‌వార్ సానుభూతిపరులైన ఖైదీలు అధికారులపై ఒకసారి తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత నాగేంద్రసింగ్ అనే జైలరు హత్యకు గురయ్యారు. దీని వెనుక కానూ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కానూను బ్యూర్ నుంచి భాగల్పూర్ జైలుకు, అక్కణ్నుంచి జహానాబాద్ జిల్లా జైలుకు మార్చారు. అయినా ఫలితం లేకపోయింది. నక్సలైట్లు నవంబర్ 13, 2005న జహానాబాద్ జిల్లా జైలుపై భారీఎత్తున దాడి చేసి అతణ్ని విడిపించుకుపోయారు.

బయటి లింకులుసవరించు