అద్దూరి సీతారాంరెడ్డి

తెలంగాణకు చెందిన మాజీ న్యాయమూర్తి

జస్టిస్‌ అద్దూరి సీతారాంరెడ్డి, (1928, మార్చి 20 - 2022, నవంబరు 17) తెలంగాణకు చెందిన మాజీ న్యాయమూర్తి. హైకోర్టు న్యాయమూర్తిగా, లోకాయుక్త జస్టిస్‌గా, ఎమ్మెల్సీగా పనిచేశాడు.[1] 1978 నుండి 1990 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తిగా తన సేవలందించాడు.[2]

అద్దూరి సీతారాంరెడ్డి
అద్దూరి సీతారాంరెడ్డి
జననం(1928-03-20)1928 మార్చి 20
మరణం2022 నవంబరు 17(2022-11-17) (వయసు 94)
జాతీయతభారతీయుడు
వృత్తిహైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఎమ్మెల్సీ
జీవిత భాగస్వామిమనోరమదేవి
పిల్లలునలుగురు అమ్మాయిలు (అనితారెడ్డి, కవితారెడ్డి, మహితారెడ్డి, కీర్తిరెడ్డి)
తల్లిదండ్రులు
  • చిన్నారెడ్డి (తండ్రి)
  • వెంకట్రామమ్మ (తల్లి)

జననం, విద్య

మార్చు

సీతారాంరెడ్డి 1928, మార్చి 20న చిన్నారెడ్డి - వెంకట్రామమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్‌లో జన్మించాడు. నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తిచేసిన సీతారాంరెడ్డి, లండన్‌లో న్యాయవిద్యను అభ్యసించాడు.[3]

వ్యక్తిగత జీవితం

మార్చు

సీతారాంరెడ్డికి 1958లో మనోరమదేవితో వివాహం జరిగింది. వారికి నలుగురు అమ్మాయిలు (అనితారెడ్డి, కవితారెడ్డి, మహితారెడ్డి, కీర్తిరెడ్డి).

వృత్తిజీవితం

మార్చు

ప్రముఖ న్యాయవేత్త పాల్కీవాలా వద్ద న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. ఉస్మానియా గ్రాడ్యుయేట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్నాడు. 1960-1968 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పనిచేశాడు. 1958-1970 వరకు ఉస్మానియ న్యాయ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశాడు. 1960-1968 మధ్యకాలంలో మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ ఆఫ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా, 1988-1973 మధ్యకాలంలో ఐఎల్‌ఆర్‌ (ఆంధ్రప్రదేశ్‌) సిరీస్‌లో ఎడిటర్‌గా, 1974-1978 మధ్యకాలంలో మెంబర్‌ ఆఫ్‌ బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా కొనసాగాడు. 1974 అక్టోబరులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్‌గా, 1978 నవంబరు 10న ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, 1990 వరకు పనిచేశాడు. 1990-1995 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తాలో న్యాయమూర్తిగా, 1989 -1996 మధ్యకాలంతో ఆర్‌బీవీఆర్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశాడు.[4]

హైదరాబాదు, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం 36లోని కావూరిహిల్స్‌లో నివాసమున్నాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జూబ్లీహిల్స్‌ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2022, నవంబరు 17న మరణించాడు.[5]

మూలాలు

మార్చు
  1. ABN (2022-11-18). "ఉమ్మడి ఏపీ విశ్రాంత లోకాయుక్త జస్టిస్‌ సీతారాంరెడ్డి కన్నుమూత". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-17. Retrieved 2022-11-21.
  2. telugu, NT News (2022-11-18). "లోకాయుక్త మాజీ జస్టిస్‌ సీతారాంరెడ్డి మృతి". www.ntnews.com. Archived from the original on 2022-11-18. Retrieved 2022-11-21.
  3. "జస్టిస్‌ సీతారాంరెడ్డి కన్నుమూత". Sakshi. 2022-11-18. Archived from the original on 2022-11-21. Retrieved 2022-11-21.
  4. "విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీతారాంరెడ్డి కన్నుమూత". EENADU. 2022-11-18. Archived from the original on 2022-11-18. Retrieved 2022-11-21.
  5. "Justice Seetharam Reddy : ఉమ్మడి ఏపీ విశ్రాంత లోకాయుక్త జస్టిస్‌ సీతారాంరెడ్డి కన్నుమూత". Sakshi Education. 2022-11-18. Archived from the original on 2022-11-21. Retrieved 2022-11-21.