అనంతపురం జిల్లా తెలుగు కథారచయితలు

తెలుగు కథ
తెలుగు కథా సాహిత్యం
కథ
తెలుగు కథా రచయితలు
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు
మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు
వేలూరి శివరామశాస్త్రి కథలు
కాంతం కథలు
చలం కథలు
మా గోఖలే కథలు
నగ్నముని విలోమ కథలు
అమరావతి కథలు
అత్తగారి కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
మా పసలపూడి కథలు
దర్గామిట్ట కథలు
కొ.కు. కథలు
మిట్టూరోడి కథలు
ఇల్లేరమ్మ కథలు
ఛాయాదేవి కథలు
మధురాంతకం రాజారాం కథలు
కా.రా. కథలు
బలివాడ కాంతారావు కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
రా.వి. శాస్త్రి కథలు
ముళ్ళపూడి వెంకటరమణ కథలు
కేతు విశ్వనాధరెడ్డి కథలు
ఇంకా ... ...
తెలుగు సాహిత్యం

మనిషి పరిణామక్రమంలో కథప్రాధాన్యత అనన్యసామాన్యం. రాతి యుగపు మనిషి సంఙలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాలవారీగా ప్రాంతాలవారీగా భాష రూపాంతరం చెందుతూ ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖిక కథల ప్రచారప్రయాణం ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష లిపిరూపం సంతరించుకోవడంతో కథాప్రయాణం వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కథ ప్రచారంలో ఉన్నప్పటికి ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజానీకానికి సైతం చేరువ అయ్యింది. మన జీవితంలో కథ ఒక భాగమయ్యింది. ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో కథకులు ఉద్భవించారు. తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో అనంతపురం జిల్లా ఒకటి. ఈ జిల్లా చాలామంది తెలుగు కథకులకు జన్మనిచ్చింది. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్ఠులుగా పేరుపొందారు. వర్తమాన కాలంలో వందలాదిమంది కథారచయితలుగా రాణిస్తున్నారు.

చిలుకూరి దేవపుత్ర
గుత్తి రామకృష్ణ
సింగమనేని నారాయణ

అనంతపురం జిల్లాలో జన్మించిన తెలుగు కథా రచయితల జాబితాసవరించు

క్ర.సం. రచయిత పేరు పుట్టిన సంవత్సరం కలం పేరు పుట్టిన ఊరు పుట్టినజిల్లా
1 బాలకొండ ఆంజనేయులు 01-జూలై-57 అనంతపురం అనంతపురం
2 బద్వేలి రమేష్ 15-సెప్టెంబరు-52 అనంతపురం అనంతపురం
3 భజంత్రీ వెంకటేశ్వర్లు 01-జూన్-60 మంగలి, భజంత్రీ హిందూపురం అనంతపురం
4 చిలుకూరి దేవపుత్ర 24-ఏప్రిల్-52 చిత్రాదేవి కాల్వపల్లి అనంతపురం
5 చిలుకూరి దీవెన 08-మే-86 అనంతపురం అనంతపురం
6 ఇసికేల ఉదయ కుమార్ 16-జూన్-68 కడప అనంతపురం
7 గుర్రాల రవికృష్ణ 03-ఆగస్టు-63 అనంతపురం అనంతపురం
8 గుత్తి రామకృష్ణ 15-జూలై-15 అనంతపురం అనంతపురం
9 గోవిందప్పగారి రామాంజనేయులు 01-అక్టోబరు-63 జి.ఆర్. మహర్షి, సత్య, శ్రీకాంత్ అనంతపురం అనంతపురం
10 గాజుల వెంకటకృష్ణ 10-ఫిబ్రవరి-65 గోరంట్ల అనంతపురం
11 బండి నారాయణస్వామి 03-జూన్-53 స్వామి అనంతపురం అనంతపురం
12 సింగమనేని నారాయణ 1943 మరూరు బండమీదపల్లి అనంతపురం

ఇవి కూడా చూడండిసవరించు

వెలుపలి లింకులుసవరించు