అనాస అనేది పుట్టినప్పటి నుండి సంవత్సరము వరకూ పసి పిల్లలు పడే బాధ. దీనిని ఆంగ్లంలో బేబీ కోలిక్ ( Baby colic ) అంటారు. ఇందులో పొట్ట అనాస, ఎండు అనాస, ముడ్డి అనాస అను మొదలగు రకాలున్నాయి. అనాస ఇబ్బంది ఉన్న పసి పిల్లలు విపరీతంగా ఏడుస్తారు. ఆ సమయాల్లో ఎటువంటి అల్లోపతి మందులు వాడినా పనిచేయవు. అటువంటప్పుడు పిల్లలకు అనాస లక్షణం ఉందని తల్లిదండ్రులు గుర్తించాలి. ఈ రోజుల్లో 90% పిల్లలకు అనాస పుట్టిన క్రొత్తలో ఉంటుంది. అల్లోపతి వైద్యంలో దీనికి సరియైన మందులు లేకపోవడం ఆశ్చర్యం. అయితే ఆయుర్వేదంలో దీనికి మందు ఉంది. తరతరాల నుండి దీనికి మందు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఇవ్వబడుచున్న,, ఏలూరులో పవర్ పేట, వినాయక గుడి రోడ్డులో కూడా, అనసా రకాన్ని బట్టి మందు ఇస్తారు. సాధారణంగా డోసుల కోసం 2, 3 సార్లు ఆయుర్వేద వైద్యుల వద్దకు వెళ్ళవలసి ఉంటుంది. మొట్ట మొదటి సారి ఈ మందు కోసం వెళ్ళేటప్పుడు పిల్లలను తీసుకువెళ్ళవలసి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలవారు ఎక్కువగా ఈ అనాస మందు పై ఆధారపడతారు. అల్లోపతి వైద్యులు అనాస మందుని రిఫర్ చేయరు. పిల్లల్లో వచ్చే అనాస అవస్థ తగ్గించుటకు సాధారణంగా శత పుష్పం గింజలు ఉపకరిస్తాయి.

లింకులుసవరించు