అనిల్‌ జాదవ్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం బోథ్ ఎమ్మెల్యే, మాజీ నేరడిగొండ జెడ్పీటీసీగా పని చేశారు.అనిల్‌ జాదవ్‌ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బోథ్ శాసనసభ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గా గెలిచాడు.[1][2]

అనిల్ జాదవ్
అనిల్ జాదవ్

పదవీ కాలం
3 డిసెంబర్ 2023 – ప్రస్తుతం
ముందు రాథోడ్ బాపూరావు
నియోజకవర్గం బోథ్ నియోజకవర్గం

పదవీ కాలం
    2023- ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 1971
రాజుర గ్రామం, నేరడిగొండ మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ ఇండియా
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు రామారావు,యశోద బాయి
జీవిత భాగస్వామి హరి ప్రియా
సంతానం ఆర్యన్ జాదవ్, ఛత్రపతి జాదవ్
నివాసం నేరడిగొండ,మండలం నేరడిగొండ,ఆదిలాబాద్ తెలంగాణ,ఇండియా
మతం హిందూ మతం

అనిల్ జాదవ్ 1971లో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం,రాజురా (ధోబిగూడ) తాండాలో జాదవ్ రామారావు పోలిష్ పటేల్, యోశోద బాయి అను లంబాడీ గిరిజన దంపతులకు జన్మించారు.

రాజకీయ జీవితం

మార్చు

అనిల్ జాదవ్ టీఆర్ఎస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి బోథ్ నియోజకవర్గం నుండి 2009, 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత బీఆర్‌ఎస్ పార్టీలో చేరి[3] 2019లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో నేరడిగొండ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యునిగా గెలిచాడు.[4]

అనిల్‌ జాదవ్‌ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుపై 22800 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టాడు.[5][6]

అనిల్ కాంగ్రెస్ టికెట్‌పై 2009లో 33,900 ఓట్లు (29.2 శాతం ఓట్లు), 2014లో  35,877 ఓట్లు (25.90 శాతం ఓట్లు) సాధించగా,  2018లో స్వతంత్ర అభ్యర్థిగా 28,206 ఓట్లు (17.99 శాతం ఓట్లు) సాధించాడు.

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (22 August 2023). "పాతకొత్తల మేళవింపుతో జాబితా". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  2. "ADB: జెడ్పీటీసీ పదవికి అనిల్ జాదవ్ రాజీనామా." Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-12-07. Retrieved 2024-05-01.
  3. Sakshi (21 March 2019). "ఆదిలాబాద్‌లో మారుతున్న రాజకీయ 'రంగులు'". Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.
  4. Sakshi (10 May 2019). "రసవత్తరంగా రెండో దశ!". Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.
  5. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  6. News, Sira (2024-04-30). "Anil Jadhav: ఆధ్యాత్మికతో మాన‌సిక ప్ర‌శాంత‌త : ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్". SIRA NEWS. Retrieved 2024-05-01. {{cite web}}: |last= has generic name (help)