అనీస్ అహ్మద్
అనీస్ మజిద్ అహ్మద్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు నాగపూర్ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.
అనీస్ అహ్మద్ | |||
జౌళి, మైనారిటీ సంక్షేమం, క్రీడలు & యువజన సంక్షేమం, ఉపాధి & స్వయం ఉపాధి, మాజీ సైనికుల సంక్షేమ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2008 – 2009 | |||
పశుసంవర్ధక, మత్స్య & పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2004 – 2008 | |||
ఉన్నత & సాంకేతిక విద్య శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2001 – 2004 | |||
పదవీ కాలం 1995 – 2009 | |||
ముందు | బాజీరావ్ యశ్వంత్ నారాయణ్ | ||
---|---|---|---|
తరువాత | వికాస్ కుంభారే | ||
నియోజకవర్గం | నాగపూర్ సెంట్రల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నాగ్‌పూర్ , మహారాష్ట్ర, భారతదేశం | 1962 జూన్ 20||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (1982 - 2024 అక్టోబర్ 27) (2024 నవంబర్ 2 - ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | వంచిత్ బహుజన్ అఘాడి (2024 అక్టోబర్ 28 - 2024 నవంబర్ 2) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
రాజకీయ జీవితం
మార్చుఅనీస్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1990 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాగపూర్ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి, ఆ తరువాత 1995 నుండి 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికై 2001 నుండి 2004 వరకు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మంత్రివర్గంలో ఉన్నత & సాంకేతిక విద్య శాఖ మంత్రిగా, 2004 నుండి 2008 వరకు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య & పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రిగా, 2008 నుండి 2009 వరకు అశోక్ చవాన్ మంత్రివర్గంలో జౌళి, మైనారిటీ సంక్షేమం, క్రీడలు & యువజన సంక్షేమం, ఉపాధి & స్వయం ఉపాధి, మాజీ సైనికుల సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.
అనీస్ అహ్మద్ ఆ తరువాత 2009 ఎన్నికలలో పోటీ చేయలేదు, తిరిగి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోగా, 2019 శాసనసభ ఎన్నికలలో టికెట్ దక్కలేదు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో 2024 అక్టోబర్ 27న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి,[1] వంచిత్ బహుజన్ అఘాడిలో చేరి,[2] అక్టోబర్ 29న నాగ్‌పూర్ కలెక్టరేట్‌లో వంచిత్ బహుజన్ అఘాడి (విబిఎ) అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లగా సమయం మించి పోవడంతో ఆయన నామినేషన్‌ను అధికారులు అంగీకరించలేదు.[3] అనీస్ అహ్మద్ 2024 నవంబర్ 2న తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4]
మూలాలు
మార్చు- ↑ The Times of India (28 October 2024). "Former minister Anees Ahmed resigns from Congress, to contest from Nagpur Central". Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.
- ↑ The Hindu (28 October 2024). "Ex-Congress Minister Anees Ahmed joins VBA, to contest from Nagpur Central seat" (in Indian English). Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.
- ↑ The Times of India (30 October 2024). "Congress veteran limps his way to file nomination in Nagpur, but misses deadline by 2 minutes". Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.
- ↑ The Economic Times (2 November 2024). "Ex-minister Anees Ahmed returns to Congress after failing to file nomination as VBA candidate". Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.