అనుపమ గౌడ

కన్నడ సినిమా, టివి నటి.

అనుపమ గౌడ, కన్నడ సినిమా, టివి నటి.

అనుపమ గౌడ
జననం (1991-03-20) 1991 మార్చి 20 (వయసు 33)
జాతీయత భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2003 - ప్రస్తుతం

జననం మార్చు

అనుపమ 1991, మార్చి 21న కర్ణాటక రాష్ట్రంలో జన్మించింది.

కళారంగం మార్చు

అనుపమ గౌడ 2003లో వచ్చిన లంకేష్ పత్రిక సినిమాలో బాలనటిగా తన సినిమా కెరీర్‌ని ప్రారంభించింది.[1] 2015లో వచ్చిన నగరి సినిమాలో ప్రధాన పాత్రను పోషించడానిముందు హల్లి దునియా అనే రియాలిటీ షోతో టెలివిజన్‌లోకి ప్రవేశించింది.[2] 2017 చివరలో, బిగ్ బాస్ కన్నడ ఐదవ సీజన్‌లో పాల్గొన్న తర్వాత అనుపమకి గుర్తింపు వచ్చింది.[2] కన్నడ కోగిలే టెలివిజన్ షోతో యాంకర్‌గా అరంగేట్రం చేసింది.[3] అక్క టెలివిజన్ ధారావాహికలో ద్విపాత్రాభినయం చేయడానికి ముందు చి.సౌ. సావిత్రి సీరియల్ లో నటించింది.[4] 2018లో, కార్తీక్ జయరామ్‌తో కలిసి ఆ కరాల రాత్రి చిత్రంలో నటించి, నటనకు ప్రశంసలు అందుకుంది.[5] రాఘవేంద్ర రాజ్‌కుమార్, ఆర్జే రోహిత్ నటించిన త్రయంబకం (2019) సినిమాలో జర్నలిస్టు పాత్రలో నటించింది.[6] నటుడు విజయ్ రాఘవేంద్రతో కలిసి 8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కోసం కన్నడ భాషా అవార్డులను హోస్ట్ గా చేసింది.[2]మజా భారత్‌కి యాంకర్‌గా కూడా పనిచేసింది.[7]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2003 లంకేష్ పత్రికే బాలనటి
2015 నగరి
2018 ఆ కరాళ రాత్రి మల్లిక
2019 త్రయంబకం నమన
2020 బెంకియల్లి అరలిద హూవు సుకన్య

టెలివిజన్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
హల్లీ దునియా
2010-2019 చి.సౌ. సావిత్రి
2014-2017 అక్కా దేవిక, భూమిక ద్విపాత్రాభినయం
2017-2018 బిగ్ బాస్ కన్నడ పోటీదారు 98వ రోజున ఎలిమినేట్
2017 మజా భరత యాంకర్
2021 రాజా రాణి యాంకర్
2021-2022 నాన్నమ్మ సూపర్ స్టార్ యాంకర్

అవార్డులు, నామినేషన్లు మార్చు

సంవత్సరం అవార్డు వర్గం సినిమా ఫలితం మూలాలు
2019 8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ తొలి కన్నడ నటి ఆ కరాళ రాత్రి గెలుపు [8]

మూలాలు మార్చు

  1. "Anupama Gowda: I look up to Deepika Padukone and Alia Bhatt - Times of India". The Times of India.
  2. 2.0 2.1 2.2 Yerasala, Ikyatha (August 21, 2019). "No limits for this SIIMA award winner!". Deccan Chronicle.
  3. "Anupama Gowda: Anchoring is my job; acting is my passion - Times of India". The Times of India.
  4. SM, Shashiprasad (June 28, 2018). "AKka girl's got a filmi agenda". Deccan Chronicle.
  5. "You can't categorise my role in Aa Karaala Ratri: Anupama Gowda - Times of India". The Times of India.
  6. "Anupama Gowda to play a journalist in 'Thriyambakam' - Times of India". The Times of India.
  7. "I've quit anchoring as it was affecting my career as an actor: Anupama Gowda - Times of India". The Times of India.
  8. "SIIMA Awards 2019: Vijay, Yash, Keerthi, KGF win big, here's full winners list". Deccan Chronicle. August 16, 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=అనుపమ_గౌడ&oldid=3793650" నుండి వెలికితీశారు