అపవాదు
అపవాదు గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించిన 1941 తెలుగు చలనచిత్రం. ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు కోవెలమూడి సూర్యప్రకాశరావు (కె.ఎస్.ప్రకాశరావు) యొక్క తొలి విడుదలైన చిత్రము. ప్రకాశరావు తొలి పాత్ర 1940లో నిర్మించబడిన గూడవల్లి రామబ్రహ్మం సినిమా పత్నిలో నటించినా అది 1942 వరకు విడుదల కాలేదు.
అపవాదు (1941 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గూడవల్లి రామబ్రహ్మం |
---|---|
తారాగణం | కోవెలమూడి సూర్యప్రకాశరావు కళ్యాణం రఘురామయ్య లక్ష్మీరాజ్యం రావు బాలసరస్వతి ఎస్.వరలక్ష్మి |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
గీతరచన | బసవరాజు అప్పారావు |
నిర్మాణ సంస్థ | కస్తూరి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చురెవెన్యూ ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తున్న ప్రకాశ్ తన భార్య కమల, చెల్లెలు కాంతం, కొడుకు కిట్టూతో కలిసి ఆనందంగా జీవనం సాగిస్తుంటాడు. వెంకయ్య, ఆయన భార్య అనసూయ వీరి పొరుగువారు. అనసూయ ప్రకాశ్ స్నేహితుడైన కామరాజును మోహిస్తుంది. కానీ కామరాజు ఆమెను తిరస్కరిస్తాడు. అనసూయ స్థానిక రౌడీ అయిన మంగపతిని ఉపయోగించుకొని కామరాజుపై ప్రతీకారం తీర్చుకోవటానికి కుట్రపన్నుతుంది. ఈ కుట్రలో భాగంగా కమలకు కామరాజుకు అక్రమ సంబంధముందన్న పుకార్లు పుట్టిస్తారు. పర్యవసానంగా కమల ఆత్మహత్యాప్రయత్నం చేస్తుంది. కామరాజు రత్నం సహాయంతో తను కమలకు వ్రాసానని చెప్పబడుతున్న ఉత్తరంలోని దస్తూరీ, అనసూయ దస్తూరీ ఒకే విధంగా ఉన్న విషయాన్ని కనుగొంటాడు. చివరికి నిజం బయటికొస్తుంది. కమలా, ప్రకాశ్ ఎప్పటిలాగే తిరిగి ఆనందంగా జీవిస్తారు.
పాత్రధారులు
మార్చు- రావు బాలసరస్వతి - కాంతం, ప్రకాశ్ చెల్లెలు
- కోవెలమూడి సూర్యప్రకాశరావు - ప్రకాశ్
- కళ్యాణం రఘురామయ్య - కామరాజు, ప్రకాశ్ స్నేహితుడు
- లక్ష్మీరాజ్యం - కమల, ప్రకాశ్ భార్య
- బాలమణి - రత్నం
- ఆవేటి పూర్ణిమ - అనసూయ, వెంకయ్య భార్య
- ఎస్.వరలక్ష్మి - బొబ్జి
- ఎం.సి.రాఘవన్ - వెంకయ్య
- మద్దలి కృష్ణమూర్తి
- శేషగిరి - మంగపతి
- మాస్టర్ ప్రభాకర్ - కిట్టూ, ప్రకాశ్ కొడుకు
పాటలు
మార్చుఈ సినిమాలో మొత్తం 15 పాటలున్నాయి. వాటినిబసవరాజు అప్పారావు, తాపీ ధర్మారావు, కొసరాజు రాఘవయ్య వ్రాశారు.[1]
- అదుగదుగో పొగ బండీ ఇదుగిదిగో పోగబండీ - రచన: కొసరాజు రాఘవయ్య
- అయ్యల్లారా అమ్మల్లారా అయ్యల్లారా అన్నల్లారా - రచన: కొసరాజు రాఘవయ్య
- ఈమానుపైనుండి - ఆర్. బాలసరస్వతీ దేవి, కె.రఘురామయ్య - రచన: బసవరాజు అప్పారావు
- ఎన్ని చిన్నెలు నేర్చాడమ్మ కమలమ్మ నీ కొడుకు - రచన: కొసరాజు రాఘవయ్య
- కులుకుచు దూర భారమునకున్ పయనంబగు (పద్యం) - రచన: కొసరాజు రాఘవయ్య
- తరణమే రాకుండునా జగదీశు కరుణయే - రచన: తాపీ ధర్మారావు
- తెలిసినదేమో తెలియనిదేమో తెలియక ఉండుము - రచన: కొసరాజు రాఘవయ్య
- నా నీటు నా గోటు ఓ యస్ ఐయాం బ్యూటిఫుల్ - రచన: తాపీ ధర్మారావు
- పదిమందిలోన పాట పాడుమని బలవంతము - రచన: బసవరాజు అప్పారావు
- పాడవోయీ యీ పాట పచ్చి ఇనుము కూడా - రచన: తాపీ ధర్మారావు
- పానకమ్ములో పుడక నేటికిటు పడవేసితివో - రచన: బసవరాజు అప్పారావు
- రాత్రీ నీకు భయమా పలుకగాదే ఒకసారి - రచన: తాపీ ధర్మారావు
- రావాలంటే త్రోవేలేదా దేవా దేవుడౌ నా నాధునకు - రచన: బసవరాజు అప్పారావు
- లోకమదేపని కోడై కూయగా పలుకక ఉందువు - రచన: తాపీ ధర్మారావు
- వీణే చేజారి పడిపోవు వ్రేళ్ళు శ్రుతుల నింపుగా - రచన: బసవరాజు అప్పారావు