అపూర్వ గురు చరణ్
అపూర్వ గురు చరణ్ భారతదేశంలోని హైదరాబాద్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడిన సినీ నిర్మాత. ఆమె నిర్మించిన పాకిస్థానీ సినిమా జాయ్ ల్యాండ్ ఆస్కార్ బరిలో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో షార్ట్ లిస్ట్ అవడం విశేషం.[1] ఈ చిత్రం ఇప్పటికే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2022 అవార్డులతో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలను కైవసం చేసుకుంది.
అపూర్వ గురు చరణ్ | |
---|---|
జననం | |
తల్లిదండ్రులు |
|
బాల్యం, విద్య
మార్చుహైదరాబాద్లో సుకన్య, బి.సి. హరిచరణ్ ప్రసాద్ దంపతులకు అపూర్వ గురు చరణ్ జన్మించింది. వారిరువురు సినీ నిర్మాతలు. ఆ తరువత ఉత్తర కాలిఫోర్నియాలో పెరిగింది. కథా కథనాల పట్ల మక్కువతో అపూర్వ గురు చరణ్ కొలంబియా విశ్వవిద్యాలయంలో చలనచిత్రం విషయంలో ఎం.ఎఫ్.ఎ చదివింది.
2006లో కె. ఎన్. టి. శాస్త్రి దర్శకత్వం వహించి నందితా దాస్, తనికెళ్ల భరణి తదితరులు నటించిన కమ్లి తెలుగు చిత్రం అపూర్వ చిత్ర బ్యానర్ పై బి.సి. హరి చరణప్రసాద్, సుకన్య సంయుక్తంగా నిర్మినదే. ఈ చిత్రం విశేష ఆధరణ పొందడమే కాక తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కించుకుంది. నందితా దాస్ కు ఉత్తమ నటిగా నంది అవార్డు తెచ్చిపెట్టింది.
కెరీర్
మార్చుఅపూర్వ గురు చరణ్ కెరీర్‌ను ఫ్రీమాంటిల్ మీడియా సింగపూర్‌లో ప్రారంభించింది. అక్కడ ఆమె డిజిటల్ ప్రొడ్యూసర్‌గా ఆసియాస్ గాట్ టాలెంట్, ఎక్స్ ఫ్యాక్టర్ ఇండోనేషియా, థాయ్‌లాండ్స్ గాట్ టాలెంట్ వంటి ప్రధాన సిరీస్‌లలో పనిచేసింది.
జాయ్‌ల్యాండ్ (2022) ఉర్దూ, పంజాబీ సినిమాతో పాటు అపూర్వ గురు చరణ్ లోన్లీ బ్లూ నైట్ (2020), ఇంటీరియర్ (2018), ది గిఫ్ట్ (2022), బెన్ అండ్ మిమీ (2018), స్ట్రీట్ స్టాంప్ (2019) లాంటి చిత్రాలను నిర్మించింది.
మూలాలు
మార్చు- ↑ "Hyderabad girl behind Pakistan's first Oscar shortlist | Hyderabad News - Times of India". web.archive.org. 2022-12-23. Archived from the original on 2022-12-23. Retrieved 2022-12-23.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)