అప్పాజి పేట
అప్పాజి పేట, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, నల్గొండ మండలంలోని గ్రామం.[1]
అప్పాజి పేట | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°06′32″N 79°10′22″E / 17.108949°N 79.172712°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ |
మండలం | నల్గొండ |
ప్రభుత్వం | |
- సర్పంచి | గంగుల అండాలు |
- ఉప సర్పంచ్ | తంగెళ్ల యాదగిరి రెడ్డి |
- ఎంపీటీసీ | రాపర్తి శ్రీలత |
జనాభా (2011) | |
- మొత్తం | 3,235 |
- పురుషుల సంఖ్య | 1,670 |
- స్త్రీల సంఖ్య | 1,565 |
- గృహాల సంఖ్య | 729 |
పిన్ కోడ్ | 508255 |
ఎస్.టి.డి కోడ్ | 08682 |
ఇది మండల కేంద్రమైన నల్గొండ నుండి 13 కి. మీ. దూరంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది నల్గొండ నియోజక వర్గంలో పరిధికి చెందిన గ్రామం.అప్పాజిపేట గ్రామ స్థానిక భాష తెలుగు.కొంతమంది హిందీ బాషా కూడా మాట్లాడుతారు.అప్పాజిపేటలో ఉన్న అనేక దుకాణాలు చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలకు అవసరాన్ని తీరుస్తున్నాయి. అప్పాజిపేట మూడు భాగాలుగా విస్తరించి ఉంది. ఎస్.సి కాలనీ, అంబేద్కర్ కాలనీ, హనుమాన్ నగర్ కాలనీ.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
గ్రామ జనాభా
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 849 ఇళ్లతో, 3246 జనాభాతో 1856 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1618, ఆడవారి సంఖ్య 1628. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 695 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 40. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 577081[3].పిన్ కోడ్: 508244.
ఉప గ్రామాలు
మార్చుఅప్పాజిపేట గ్రామ పరిధిలో రెండు ఉప గ్రామాలు ఉన్నాయి. అవి మిర్లోని గూడెం, బంటుగూడెం.
సమీప గ్రామాలు
మార్చుఅప్పాజిపేట గ్రామానికి తూర్పున బుద్దారం,పడమర ఔరవాని,ఉత్తరాన దోమలపల్లి, దక్షిణాన అన్నెపర్తి గ్రామాలు కలిగియున్నాయి.
కార్యాలయాలు
మార్చుగ్రామ పంచాయతీ
మార్చుఇది 2002 లో గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీ నిధులచే నిర్మించారు. ఇది గ్రామ కేంద్రంలో ఉంది.అత్యధిక హంగులతో నిర్మించారు.జిల్లా అధికార యంత్రంగం అప్పుడప్పుడు సందర్శన కోసం వచ్చినప్పుడు ఈ భవనంలో మీటింగ్స్ పెడుతుంటారు. ఇక్కడ ప్రతి నెల గ్రామ సభలు నిర్వహిస్తారు. దీనికి గ్రామ సర్పంజ్ అధికారం నిర్వహిస్తారు.గ్రామ వార్డ్ మెంబర్స్, ప్రజలు పాల్గొని సమస్యల గురించి చర్చిస్తారు.
పశు వైద్యశాల
మార్చుప్రభుత్వం ఇక్కడి ప్రజల పశు వృత్తిని గమనించి ఇక్కడ పశువైద్యశాలను నిర్మించారు.డాక్టర్లు అందుబాటులో ఉంటూ పశువులకు వైద్యం చేస్తూ ఉంటారు.ఈ గ్రామ ప్రజలే కాకుండా ఇతర గ్రామ ప్రజలు కూడా పశు వైద్యం కోసం వస్తూ ఉంటారు.
గ్రంథాలయం
మార్చుగ్రామాలలో రాత్రి పూట బడులు నిర్వహించాలన్న ప్రభుత్వ పథకాల భాగంలో ఈ గ్రంథాలయం వెలసింది.గ్రామంలో యువకుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రతి రోజు న్యూస్ పేపర్స్ ని చదవటానికి గ్రంథాలయానికి వస్తు ఉండేవారు. అప్పటి ప్రభుత్వం భారీ నిధులు విడుదలలో గ్రంధాలయంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆడుకోవడానికి అట సామగ్రి, ప్రభుత్వ పథకాలను తెలుససుకోవడానికి టీవీ కూడా ఉన్నది. ప్రభుత్వాలు మారడంతో నిధులు విడుదల కాకపోవడంతో నిర్వాహకులు తప్పుకున్నారు.
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.సమీప బాలబడి నల్గొండలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నల్గొండలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల నార్కట్ పల్లిలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు నల్గొండలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నల్గొండలో ఉన్నాయి.
విద్యాలయాలు
మార్చుప్రభుత్వ పాఠశాల
మార్చుఈ ప్రబుత్వ పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉంది.ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఇప్పుడు ప్రముఖ స్థానాలలో ఉన్నారు.ఎంతో మంది మేధావులను తీర్చిదిద్దిన పాఠశాల ఇది. గ్రామ ప్రముఖులు, రాజకీయ నాయకులు పడవ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు బహుమతులు, నగదు ఇస్తూ పోత్సాహిస్తూoటారు.మొదట అత్యధిక విద్యార్థులు కలిగి ఉన్న పాఠశాలలో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ రావటంతో తల్లిదండ్రులు సైతం ఆంగ్ల విద్యపై మక్కువ చూపిస్తూవుండటంతో రాను రాను విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.
ప్రైవేట్ పాఠశాలు
మార్చు1. సిద్దార్థ విద్యామందిర్ పాఠశాల వ్యవస్థాపకులు రవీందర్.నాణ్యమైన విద్య అందించడంలో పేరుగాంచింది.విద్యార్థుల తల్లిదండ్లులు సైతం ఈ పాఠశాలకు పంపించడానికి మక్కువ చూపించేవారు.చాల కాలం వరకు తన ఆధిపత్యాన్ని చుపించింది. ఆ తర్వాత యాజమాన్యం మారడంతో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పాఠశాలని పూర్తిగా మూసివేశారు.
2. అక్షర స్కూల్ అంగ్ల బాషా కోసం తల్లిదండ్రులు జిల్లా ప్రాంతానికి పంపిస్తుండమతో మన గ్రామంలోనే నాణ్యమైన విద్య అందిస్తాం అని కేరళ టీచర్లచే విద్య భోదన అంటూ మొదలు పెట్టిన పథ ప్రైవేట్ పాఠశాల. కానీ నాణ్యమైన విద్యనై అందించడంలో విఫలం అవ్వడంతో కొద్ది రోజులకే ఈ పాఠశాలని మూసివేశారు.
వైద్య సౌకర్యం
మార్చుప్రభుత్వ వైద్య సౌకర్యం
మార్చుఅప్పజీపేటలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
మార్చుగ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు
మార్చుగ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
మార్చుగ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
మార్చుఅప్పజీపేటలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
మార్చుగ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
బ్యాంకులు
మార్చుకెనరా బ్యాంకు 2016 లో ప్రారంభించారు. ఈ గ్రామంలో అత్యధిక ఖాతాలు కెనరా బ్యాంకు లో ఉన్నాయి. ప్రజల సౌకర్యాల నిమ్మిత్తం కొరకు కెనరా బ్యాంకు నెలకొల్పడం జరిగింది. కెనరా బ్యాంకు ప్రారంభం కాకముందు ఇక్కడి ప్రజలు నల్గొండ లోని కెనరా బ్యాంకు ను ఉపయోగించే వారు.గ్రామ ప్రజలకు అత్యధిక వ్యవసాయ రుణసాయం చేసిన బ్యాంకు కూడా కెనరా బ్యాంకు. ఎటిఎం కూడా నెలకొల్పడంతో స్థానిక ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన శ్రమ తగ్గింది.
ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
మార్చుగ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
మార్చుగ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
మార్చుఅప్పజీపేటలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 328 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 16 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 36 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 10 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 29 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 152 హెక్టార్లు
- బంజరు భూమి: 843 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 440 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 1388 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 46 హెక్టార్లు
చెరువులు
మార్చుఅప్పజీపేటలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- బావులు/బోరు బావులు: 46 హెక్టార్లు
ముత్యాలమ్మ చెరువు
మార్చుఇది శివాలయానికి దగ్గరలో ఉంది.ముత్యాలమ్మ గుడి ఉండటంతో దీనిని ముత్యాలమ్మ చెరువు అని పిలుస్తారు.తెలంగాణ మిషన్ కాకతీయలో భాగంలో ఈ చెరువు అందంగా అవతరించింది.ఇది వర్షాకాలంలో చెరువు నిండి చెరువు ని అనుకోని ఉన్న పొలాలకు నీరందిస్తుంది
కాకి చెరువు
మార్చుఇది అప్పాజిపేటలో ఔరవని కి పోయే మార్గంలో ఉంటుంది.ఇది చాల నీటి సాంద్రత కలిగియున్నది.ఈ చెరువు అప్పాజిపేట, మీర్లోనిగూడెం లో ఉన్న పొలాలకు నీరందిస్తుంది.
దేవాలయాలు
మార్చుశివాలయం
మార్చుఈ గ్రామంలో 800 ఏండ్ల పురాతన శివాలయం ఉంది. కాకతీయ కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఆనవాళ్లు ఉన్నాయి.చాల కలం ఈ గుడి పట్టించుకొకపోవడం వల్ల ఈ గుడి దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. పురావస్తు శాఖ అధికారులు వచ్చి గుడిని సందర్శించి వివరాలు సేకరించారు. మహా శివరాత్రి పర్వదినాన ఈ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులను సమర్పిస్తారు ప్రస్తుతానికి అక్కడ ఉన్న స్థానిక యువకులు గుడిని శుభ్రం చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటారు.శివాలయం గుడి ప్రక్కనే వినాయకుడు విగ్రహం కొలువై ఉంది. ముందుగా వినాయకుడిని దర్శించిన తర్వాత ఆ మహా శివుడిని దర్శిస్తారు.ఇక్కడ ఉన్న ఒక్క చెట్టు ఇక్కడ, శ్రీశైలం మాత్రమే ఉన్నట్టు పెడ్తారు చెబుతూవుంటారు.
చారిత్రక ఆనవాళ్లు
మార్చుబృహత్ శిలాయుగం
మార్చుస్థానిక గ్రామ జర్నలిస్ట్ పిలుపు మేరకు పురావస్తు శాఖ అధికారులు విచ్చేసి మెన్ హిర్ సమాధిని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సమాధి దాదాపు 20 పిట్ల ఎత్తులో ఉండటం విశేషం.ఇది దేశంలోనే అతిపెద్ద మెన్ హిర్ సమాధి అని గుర్తించారు.పురావస్తు అంతర్జాతీయ సదస్సులో ఈ సమాధి గురించి ప్రస్తావించడంతో పాటుఈ మెన్ హిర్ సమాధి చిత్రాన్ని పురావస్తు శాఖ అధికారులు రచించిన పుస్తకంలో మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచరించారు.
సప్తమాత్రికలు
మార్చు11,12,13వ శతాబ్దానికి సంబదించిన విగ్రహం వెలుగులోకి వచ్చింది. ఈ విగ్రహం కాకతీయుల కాలంలో దేవతా మూర్తుల విగ్రహంను సంతానం లేని మహిళలు పూజంచేవారని అని తెలుస్తుంది. ఈ విగ్రహం 3ఫీట్ల 6ఇంచుల పొడవు 1 ఫీట్ ఎత్తు కలిగివుంది. ఈ విగ్రహంలో మొదటగా వీరభద్రుడు (శివ).. చివరన వినాయక విగ్రహాలు ఉన్నాయి.మధ్యలో ఏడుగురు దేవతలు ఉన్నారు.వారిలో వరుసగా బ్రహ్మీ!!! మహేశ్వరి!!!కౌమారి!!!వైష్ణవి!!!వరాహి!!!ఇంద్రాణి!!!చాముండి దేవతలున్నారు.వారి వాహనాలు వరుసగా హంస-నంది-నెమలి-గరుత్మంతుడు-పండి-ఏనుగు-నక్క చిత్రాలు వరుసగా ఉన్నాయి.
పండుగలు
మార్చుదసరా
మార్చుదసరా పండుగను చాల ఘనంగా నిర్వహిస్తారు.అప్పాజిపేట ఎక్కడెక్కడో నివసిస్తున్న ప్రజలు దసరా పండగకి తప్పకుండా వస్తారు. అన్ని రకాల పిండి వంటలు చేస్తారు. పిల్లలు ఉత్సవంగా బాణసంచా కలుస్తారు. అందరు కొత్త దుస్తులు ధరిస్తారు.సాయంత్రం ఊరి చివరినా జరిగే జమ్మి పూజకు భారీగా ప్రజలు తరలివెళ్తారు.సాంప్రదాయబద్దంగా నిర్వహించిన జమ్మిపూజలో పాల్గొని తర్వాత గ్రామంలో ప్రతిష్టించిన దుర్గ మాతా ని దర్శిస్తారు.
బతుకమ్మ
మార్చుసెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు.ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి.ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ.రాష్ట్రమంతా అన్ని వర్గాల మహిళలుచేసుకునే ఈ పండగ అప్పాజిపేట గ్రామంలో మాత్రం ఒక వర్గానికి చెందిన మహిళలు మాత్రమే బతుకమ్మలో పాల్గొంటారు.పవిత్రంగా మహిళలు ఎంతో అందంగా తయారు చేసిన బతుకమ్మను సాయంత్ర వేళలో కచ్చిర్ దగ్గరికి తీసుకొచ్చి బతుకమ్మ పాటలు పడుతూ నృత్యమాడుతారు. ఆ తర్వాత పక్కనే ఉన్న ముత్యాలమ్మ చెరువులో బతుకమ్మను సమర్పిస్తారు.
వినాయక చవితి
మార్చువినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి. పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు. పురాణ గాథలలో శివుడు వినాయకుడిని అందరు దేవతలలోకి మిన్నగా ప్రకటించిన రోజు. వినాయకుని జ్ఞానానికి, సంపత్తుకి, మంచి అదృష్టానికి దేవతగా, ప్రయాణం ప్రారంభించేటప్పుడ, లేక కొత్త పనులు చేపట్టేటప్పుడు ప్రార్థించటం సర్వసాధారణం. ఈ పండగ ను దేశంలో ఘనంగా చేసుకున్నట్టే ఏ గ్రామంలో కూడా ఘనంగా నిర్వహిస్తారు.యువకులు అత్యధికంగా పాల్గొనే పండగ. దాదాపు ప్రతి వీధిలోనూ వినాయకుడు కొలువై ఉంటాడు. తమ విగ్రహం ఎత్తులో ఉండాలని పోటీ పడుతూ వినాయకుడను పెడుతుంటారు. ఎంతో పవిత్రంగా నవరాత్రులను నిర్వహించినా తర్వాత నిమర్జనం దగ్గరలో ఉన్న నాగార్జున సాగర్లోనూ,కాంచనాపల్లి లోను,పానగల్ లో చేస్తారు.
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".