ప్రధాన మెనూను తెరువు
అబ్దుల్‌ హకీం జానీ షేక్‌, బాల సాహిత్యం పట్ల ప్రత్యేక ఆసక్తితో ఆరు పుస్తకాలు వెలువరించారు

బాల్యముసవరించు

అబ్దుల్‌ హకీం జానీ షేక్‌, గుంటూరు జిల్లా తెనాలిలో 1963 జనవరి 1 జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ మహబూబ్‌బీ, షేక్‌ ఫరీద్‌ సాహెబ్‌.

ఉద్యోగముసవరించు

వీరు బి.ఏ., బిఎడ్‌. చదివి తెలుగు ఉపాధ్యాయులు ఉద్యోగించారు.

రచనా వ్యాసంగముసవరించు

వీ 1976లో విద్యార్థిగా కన్నందుకు శిక్ష నాటిక రాయడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభించారు. 1991 నుండి 2009 వరకు తెలుగు పత్రికలలో వివిధాంశాల మీద సుమారు 12 వందల వ్యాసాలు, కవితలు ప్రచురితం అయ్యాయి. బాల సాహిత్యం పట్ల ప్రత్యేక ఆసక్తితో ఆరు పుస్తకాలు వెలువరించారు. మరో 20 గ్రంథాలు త్వరలో, వెలువడనున్నాయి. వయోజనుల కోసం రాసిన 18 గ్రంథాలు ప్రచురితం అయ్యాయి. ఆకాశవాణి ద్వారా కవితలు, కధానికలు, ప్రసారం అయ్యాయి.

అవార్డులు -పురస్కారాలుసవరించు

వీరికి సమతారావు బాల సాహితీ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, విశ్వదాత అవార్డు (2007), ఆంధ్ర సారస్వత సమితి పురస్కారం (2009). లభించాయి. వీరి లక్ష్యం మానవీయ సంస్కృతీ-సంప్రదాయల పట్ల అవగాహన కల్పిస్తూ, బాలబాలికల అభ్యున్నతికి ఉత్తమ సాహిత్య సృష్టి చేయటం.

మూలాలుసవరించు

అక్షరశిల్పులు అనుగ్రంథము, రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, చిరునామా వినుకొండ - 522647 పుట 31