అమ్మంగి వేణుగోపాల్
అమ్మంగి వేణుగోపాల్ రచయిత, సాహితీ విమర్శకుడు. 2015లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ నారాయణరావు పేరిట తొలి సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు.
అమ్మంగి వేణుగోపాల్ | |
---|---|
జననం | జనవరి 20, 1948 అలంపల్లి, వికారాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం |
ప్రసిద్ధి | రచయిత, సాహితీ విమర్శకుడు. |
తండ్రి | మదనయ్య |
తల్లి | రుక్మిణమ్మ |
జననం
మార్చుఈయన 1948, జనవరి 20న మదనయ్య, రుక్మిణమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం లోని రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ మండలం అలంపల్లి గ్రామంలో జన్మించాడు.
విద్యాభ్యాసం
మార్చుమెదక్ జిల్లా నారాయణఖేడ్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్.ఎస్.సి., హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో పి.యు.సి., హైదరాబాద్ లోని ఆర్ట్స్ కాలేజీలో బి.ఏ., ఎం.ఏ. (1969), ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి. (1984) చదివాడు.
ప్రభుత్వ ఉద్యోగం
మార్చుహుజూరాబాద్, సదాశివపేట, భువనగిరి, గద్వాల, సంగారెడ్డి, జహీరాబాద్ మొదలైన ప్రదేశాలలో జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులుగా, ప్రిన్సిపాల్ గా పనిచేసి 2004లో ఉద్యోగ విరమణ చేశాడు.
సాహిత్యం
మార్చు1962లో పద్యరచనలతో సాహిత్యరంగ ప్రవేశం చేశాడు. 196లో ఎం.ఏ. విద్యార్థిగా సృజన పత్రిక నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో 'చీకటి బతుకు నీడ'అంధుల మీద రాసిన వచన కవితకు ప్రథమ బహుమతి వచ్చింది.
కవి సంపుటాలు: 1. మిణుగురు (1980), పునర్ముద్రణ (2015), 2. పచ్చబొట్టు - పటంచెరు (1999) పునర్ముద్రణ (2015), 3. భరోసా (2008), 4. గంధం చెట్టు (2015), 5. తోటంత పువ్వు (2015)
నాటికలు: అమ్మంగి వేణుగోపాల్ నాటికలు (2008)
సాహిత్య విమర్శ: 1. అవినాభావం (వ్యాస సంపుటి, 1990), 2. సాహిత్య సందర్భం - సమకాలీన స్పందన (89 సాహిత్య వ్యాసాల సంపుటి, 2012), 3. వట్టికోట ఆళ్వారుస్వామి రచనలు - ఒక పరిశీలన (తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ప్రచురణ, 2014)
కథానికలు: సుమారు 10 కథానికలు వివిధ పత్రికలతో ప్రచురితం
పరిశోధన: 1. నవలా రచయితగా గోపీచంద్ (ఉస్మానియా విద్యాలయం నుంచి పిహెచ్.డి పొందిన సిద్ధాంత గ్రంథం, 1984), 2. గోపీచంద్ జీవిత సాహిత్యాలు శతజయంతి నివాళి మోనోగ్రాఫ్, విశాలాంధ్ర ప్రచురణ, 2010)
అనువాదం: 1. తెలుగు లిపి - ఆవిర్భావ వికాసాలు (మూలం: తెలుగు స్క్రిప్ట్ - ఆరిజన్ అండ్ ఎవల్యూషన్...డా. పి.వి. పరబ్రహ్మశాస్త్రి, డా. రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్చలిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం ప్రచురణ, 2012)
సంపాదకత్వం: 1. వ్యాసమంజీర (మెదక్ జిల్లా రచయితలు రాసిన ఏడు వ్యాసాల సంకలనం, మంజీరా రచయితల సంఘం ప్రచురణ, 1990), 2. మరో కొత్త వంతెన / ఏక్ ఔర్ నయాపూల్ (హైదరాబాద్ కు 400 సంవత్సరాలు నిండిన సందర్భంలో తెలుగు-ఉర్దూ, ఉర్దూ-తెలుగు కవుల ద్విభాషా కవితా సంపుటి, 1998), 3. మజహర్ మెహదీ-మరో ప్రపంచం (ప్రసిద్ధ ఉర్దూ కవి, లౌకికవాది మజహర్ మెహదీ 32 ఉర్దూ కవితల తెలుగు అనువాద సంకలనం. ఉర్దూ కవితలను ఉర్దూ లిపిలో, ఉర్దూను తెలుగులోకి లిప్యంతరీకరణం చేసి ప్రచురించిన అరుదైన కవితా సంకలనం, 2009), 4. తెలంగాణ వైతాళికుడు - సురవరం ప్రతాపరెడ్డి (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం ప్రచురణ, 2012), 5. ప్రజల పక్షాన ప్రతిజ్ఞ (శ్రీశ్రీ శతజయంతి నివాళి, సహసంపాదకత్వం, 2010), 6. అద్దంలో విద్యార్థి (ప్రసిద్ధ కవి వి.ఆర్. విద్యార్థి అభినందన సంచికకు సహం సంపాదకత్వం 2012)
గౌరవాలు, పురస్కారాలు
మార్చుప్రతిష్టాత్మక పురస్కారం
మార్చుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్ కాజోజీ నారాయణరావు పురస్కారం (09.09.2015) [1][2]
ఇతర పురస్కారాలు
మార్చు- తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం (2001)
- "భరోసా" కవితా సంపుటికి ఉత్తమ వచన కవితా పురస్కారం (తెలుగు విశ్వవిద్యాలయం, 2010)
- ఆకాశవాణి జాతీయ కవి సమ్మేళనంలో తెలుగు కవిగా ప్రాతినిధ్యం (1994)
- ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి సభ్యులు (2009-11)
- కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు (2013 నుండి)
- రంగారెడ్డి జిల్లా ఉత్తమ రచయిత పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (02.07.2015)
- ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పాఠ్య ప్రణాళికా సంఘం (పి.జి) సభ్యులు (2002-2004)
ఇతర అంశాలు
మార్చుసుమారు 20 గ్రంథాలకు పీఠికలు రాశాడు. సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, అళ్వారు స్వామి, దాశరథి కృష్ణమాచార్య, రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి, పొట్లపల్లి రామారావు, నెల్లూరి కేశవస్వామి వంటి తెలంగాణ వైతాళికులు, రచయితల మీద సుమారు 30 వ్యాసాలు రాశారు. సూర్య దినపత్రికలో రెండున్నర సంవత్సరాలు దస్తూరి కాలమ్ నిర్వహించి 100 దాకా సాహిత్య వ్యాసాల ప్రచురించాడు. 'తేనా' అమెరికా ఎన్.ఆర్.ఐ. సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రతియేటా ఇచ్చే పురస్కారాల సంఘం సభ్యులు (2014 నుండి) గా ఉన్నాడు.
ఇతర భాషలలోనికి అనువాదాలు
మార్చు- వేణుగోపాల్ రచించిన సుమారు 50 తెలుగు కవితలను ప్రసిద్ధ అనువాదకులు ఎలనాగ ఆంగ్ల భాషలోకికి అనువదించాడు (2015)
- వేణుగోపాల్ రచించిన సుమారు 50 తెలుగు కవితలను ప్రసిద్ధ హిందీ అనువాదకులు డా. ఎం. రంగయ్య హిందీ భాషలోకి అనువదించాడు (2015)
- వేణుగోపాల్ రచించిన భరోసా తెలుగు కవితా సంపుటిని శ్రీ నారాయణరావు హిందీలోకి అనువదించాడు (2015)
వేణుగోపాల్ సాహిత్యంపై పరిశోధనలు
మార్చుఅమ్మంగి వేణుగోపాల్ సాహిత్యం-ఒక పరిశీలన అన్న అంశంమీద పరిశోధన చేసిన డా. ఆర్ సూర్య ప్రకాశరావుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్.డి. పట్టా ప్రదానం చేసింది (2015)
అమ్మంగి వేణుగోపాల్ సాహిత్య వ్యాసాలు విమర్శక వ్యక్తిత్వం అనే అంశం మీద గడ్డమీది మల్లేశం పరిశోధన చేసి హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఎం. ఫిల్ పట్టాను పొందడం జరిగింది. [3]
మూలాలు
మార్చు- ↑ 10టివి. "రచయిత అమ్మంగి వేణుగోపాల్ కు కాళోజి తొలి స్మారక పురస్కారం." Retrieved 19 December 2016.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link] - ↑ telangananewspaper. "Ammangi Venugopal Honour Kaloji Puraskar Award 2015". Retrieved 19 December 2016.
- ↑ నవతెలంగాణ, దర్వాజ, స్టోరి. "అమ్మంగి సాహిత్యంపై సమగ్ర పరిశోధన". Archived from the original on 23 మే 2022. Retrieved 4 January 2017.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link)
- రచయిత పరిచయం, పచ్చబొట్టు పటంచెరు, అమ్మంగి వేణుగోపాల్ రచనలు, 2015 ప్రచురణ.